APTEACHERS
February 5, 2025 at 01:53 AM
*♻️నేటి వార్తలు (05.02.2025)* ✳️ *అంతర్జాతీయ వార్తలు::* ▪️అమెరికాలో ఉంటున్న భారతదేశానికి చెందిన 18 వేల మంది అక్రమ వలసదారులను గుర్తించి 15940 మందిని భారతదేశానికి పంపేందుకు అమెరికా తుది ఉత్తర్వులు జారీచేసింది. ▪️స్వీడన్ లో ఒరెబ్రా నగరంలోని క్యాంపస్ రిస్బెర్గ్ స్కా వయోజన విద్యా కేంద్రంపై మంగళవారం నాడు ఓ వ్యక్తి కాల్పులు జరిపిన సంఘటనలో పదిమంది మరణించినట్లు అధికారులు తెలియజేశారు. ▪️అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు నిన్న వాషింగ్టన్ లో సమావేశమై హమాస్ వద్ద ఉన్న బందీల విడుదల ఇజ్రాయిల్ సౌదీ అరేబియా ల మధ్య ఒప్పందం ఇరాన్ అణు కార్యక్రమం తదితర అంశాలపై చర్చించారు. ▪️ చంద్రుని దక్షిణ ధృవం పై నీటి అన్వేషణ కోసం 2026లో చాంగే-7 మిషన్ లో భాగంగా స్మార్ట్ రోబోటిక్ "ఫ్లయర్ డిటెక్టర్ రోబో" ను పంపేందుకు చైనా ఏర్పాటు చేస్తున్నట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలియజేసింది. ▪️ఉక్రెయిన్ కు అమెరికా నుంచి సైనిక సహాయం కావాలంటే ఉక్రెయిన్ లో లభించే అరుదైన ఖనిజాలను వినియోగించుకునే అవకాశం కల్పించాలన్న షరతు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. *✳️జాతీయ వార్తలు:* ▪️అమెరికాలోని భారతదేశానికి చెందిన అక్రమ వలసదారులను వెనుకకు పంపించే కార్యక్రమంలో భాగంగా నిన్న టెక్సాస్ లోని శాన్ ఆంటోనియో నుంచి 205 మందితో కూడిన c17 సైనిక విమానం పంజాబ్ లోని అమృతసర్ కు బయలుదేరినట్లు ఢిల్లీలోని అమెరికా ఎంబసీ అధికారులు తెలియజేశారు. ▪️దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ నేటి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6 వరకు కొనసాగనుండగా ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ▪️ఉత్తర ప్రదేశ్ లో ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమంలో జనవరి 13వ తేదీన ప్రారంభమైన మహా కుంభమేళాకు ఇప్పటివరకు 38 కోట్ల మంది భక్తులు హాజరైనట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. ▪️మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ స్మారకం ఏర్పాటు కోసం ఢిల్లీలోని రాజ్ ఘాట్ ప్రాంగణంలో కేంద్ర ప్రభుత్వం భూమిని కేటాయించినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. ▪️జేఈఈ మెయిన్ పరీక్ష తొలి విడత పేపర్ -1 పరీక్షల ప్రాథమిక కీ ని నిన్న విడుదల చేసిన జాతీయ పరీక్షల సంస్థ (ఎన్ టి ఏ) దీనిపై అభ్యంతరాలు ఈనెల 6వ తేదీలోగా పంపించవచ్చని తెలియజేసింది. ▪️తెలంగాణలోని 59 ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా వర్గీకరించడం, ఉద్యోగాల భర్తీ విధానం, రోస్టర్ పాయింట్ల విభజన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించిన అనంతరం నిన్న శాసనసభ, శాసనమండలి ఆమోదం తెలిపాయి. ▪️మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో బిక్షం వేసినా, తీసుకున్నా నేరంగా పరిగణిస్తామని చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని నిన్ను అధికారులు ప్రకటించారు. ✳️ *రాష్ట్ర వార్తలు:* ▪️రాష్ట్రంలో ఫిబ్రవరిలో అసాధారణ వేడి వాతావరణం నెలకొనగా ఈనెల రెండో వారం నుంచి రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ▪️రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా డేటా చార్యం జరుగుతోందని నిరూపిస్తే రూ 10 కోట్లు స్వయంగా కానుక అందిస్తానని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలియజేశారు. ▪️రాష్ట్రంలో పట్టణ ప్రాంతాలలో భవన నిర్మాణ అనుమతులను సులభతరం చేస్తూ సెల్ఫ్ సర్టిఫికేషన్ స్కీం (సి సి ఎస్) ను అమలు చేసేందుకు మునిసిపల్ శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. ▪️పట్టణాలలో విలీనమైన గ్రామాలకు సంబంధించిన 176 మందిని ఆయా పట్టణ స్థానిక సంస్థలలో విలీనం చేసేలా మునిసిపల్ పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ▪️రాష్ట్ర అసెంబ్లీ లో ప్రజాపద్దుల కమిటీ (పిఎసి), అంచనాల కమిటీ, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ (పియుసి) లకు నూతన చైర్మన్ లను శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు నియమించారు. ▪️అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం హెటెరో ఔషధ పరిశ్రమలో నిన్న రాత్రి 8 గంటల ప్రాంతంలో విషవాయువు లీకై 12 మంది అస్వస్థతకు గురయ్యారు. ▪️గీత కార్మిక కుటుంబాలకు మద్యం దుకాణాల లైసెన్స్ ఖరారుపై స్టే ఇవ్వాలంటూ మద్యం దుకాణ యజమానులు చేసిన అభ్యర్థులను హైకోర్టు నిరాకరించింది. ▪️కొబ్బరి ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరిందని భారత దేశంలో ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తెలియజేశారు. *✳️క్రీడా వార్తలు:* ▪️ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ లో జరుగుతున్న 38వ జాతీయ క్రీడలలో నిన్న మహిళల 3x3 బాస్కెట్బాల్ పోటీలలో తెలంగాణ కేరళను ఓడించి స్వర్ణ పతకం సాధించింది. ▪️అర్జెంటీనాలో జరుగుతున్న రోసారియో ఛాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ తొలి రౌండు లో భారత ఆటగాడు సుమిత్ నగల్ విజయం సాధించాడు.
❤️ 👍 2

Comments