⚡SchoolEdu 👈 Join Now
February 1, 2025 at 01:16 AM
*🔊మే 16న పాలిసెట్‌* *🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం(2025-26) పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశానికి మే 16వ తేదీన పాలిసెట్‌ నిర్వహించాలని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. దరఖాస్తుల స్వీకరణ నుంచి ఫలితాల విడుదల వరకు షెడ్యూల్‌ను కూడా రూపొందించారు. కాకపోతే స్థానికతకు సంబంధించి స్పష్టత కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్, కరీంనగర్‌ పాలిటెక్నిక్‌ తదితర కళాశాలల్లో 15 శాతం సీట్లను అన్‌ రిజర్వ్‌డ్‌ కింద కేటాయిస్తున్నారు. వాటికి ఏపీ విద్యార్థులు సైతం పోటీపడతారు. స్థానికత, రాష్ట్రపతి ఉత్తర్వులు వంటి అంశాలపై ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక అందజేయాల్సి ఉంది. వీటన్నిటిపై స్పష్టత వస్తే వెంటనే నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. గతేడాది ఫిబ్రవరి 15న పాలిసెట్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఎప్‌సెట్‌ తదితర నోటిఫికేషన్లు కూడా జారీ చేయాల్సి ఉన్నందున త్వరలోనే ప్రభుత్వం స్పష్టత ఇస్తుందని అధికారులు భావిస్తున్నారు.* *Click here to Join* https://whatsapp.com/channel/0029Va5HyFoFMqreW1ZoJp3m
👍 1

Comments