⚡SchoolEdu 👈 Join Now
5.0K subscribers
About ⚡SchoolEdu 👈 Join Now
SchoolEdu channel for Information related to 🔅Teacher Info 🔅UDISE Plus 🔅Student Info 🔅Aadhar 🔅CCE 🔅FRS 🔅MDM 🔅Transfers 🔅School Education GO's 🔅Notification and latest updates 💠Other formats, Proceedings, YouTube tutorials related to School Education Department Telangana💠
Similar Channels
Swipe to see more
Posts
*🔊బ్యాంకింగ్ వ్యవస్థలోనే లోపాలున్నాయి* *🔶ఛార్జీల పేరుతో సామాన్యులపై భారం వేస్తున్నారు..* *🔷రూ.వేల కోట్లు ఎగవేసిన వారిని వదిలేస్తున్నారు* *🔶బ్యాంకు అధికారుల తీరుపై హైకోర్టు వ్యాఖ్యలు* *🍥ఈనాడు, హైదరాబాద్: దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థలో లోపాలున్నాయని ఓ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. బ్యాంకు అధికారులు వేల కోట్ల రూపాయల రుణాలను మంజూరు చేస్తున్నారని, తీసుకున్న వారు ఎగవేస్తుంటే పట్టించుకోవడంలేదని, అదే సమయంలో సామాన్యులపై వివిధ ఛార్జీల పేరుతో భారం మోపుతున్నారని ఆక్షేపించింది. మంజూరుచేసిన అధికారులపైనే వసూలు చేయాల్సిన బాధ్యత పెడితే.. వ్యవస్థలో కొంతయినా మార్పు వస్తుందని పేర్కొంది. హైదరాబాద్ సనత్‌నగర్ ఎస్‌బీఐ బ్రాంచి అధికారులు ముందస్తు చెల్లింపుల పేరుతో, ఎలాంటి సమాచారం లేకుండా ఛార్జీలను మినహాయించుకోవడాన్ని సవాలుచేస్తూ ఉత్తమ్ ధాతు అండ్ ఇస్పాత్ ప్రైవేట్ లిమిటెడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ సి.వి.భాస్కర్‌రెడ్డి శుక్రవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, ఆస్తులను హామీగా ఉంచి తీసుకున్న రుణాన్ని ముందుగానే చెల్లించినందుకుగాను రూ.1.16 కోట్లు కంపెనీ ఖాతా నుంచి బ్యాంకు మినహాయించుకుందన్నారు. ఇది ఆర్‌బీఐ నిబంధనలకు విరుద్ధమని, జరిమానాతోపాటు వడ్డీతో సహా తిరిగి ఇచ్చేలా ఆదేశాలు జారీచేయాలని కోరారు. వాదనలను విన్న న్యాయమూర్తి బ్యాంకింగ్ వ్యవస్థ లోపభూయిష్ఠంగా ఉందని పేర్కొంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘సాధారణ, మధ్య తరగతి ప్రజలు రుణాలు తీసుకుంటే ఛార్జీల పేరుతో బ్యాంకులు భారం వేస్తున్నాయి. రుణం ముందు తీర్చేసినా, జాప్యం చేసినా జరిమానాల పేరుతో సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. తీసుకున్న గృహరుణం పూర్తయిన తర్వాత.. సంబంధిత డాక్యుమెంట్ తీసుకునేటప్పుడు కూడా ఛార్జీలు చెల్లించాల్సి వస్తోంది. అదే సమయంలో రూ.వేల కోట్ల రుణం తీసుకుని ఎగవేసిన వారి నుంచి వసూలు చేయలేకపోతున్నాయి. మంజూరు చేసిన బ్యాంకు అధికారే వసూలు బాధ్యత కూడా తీసుకోవాలనే నిబంధన ఉంటే రుణాలు సక్రమంగా మంజూరవుతాయి’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు. ప్రస్తుత కేసులో ఆర్‌బీఐతోపాటు బ్యాంకు అధికారుల వివరణను పరిశీలించాల్సి ఉందన్నారు. ప్రతివాదులైన ఆర్‌బీఐతోపాటు ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీలకు నోటీసులు జారీ చేస్తూ..కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.* *Click here to Join* https://whatsapp.com/channel/0029Va5HyFoFMqreW1ZoJp3m
*🔊UPS: యూనిఫైడ్ పింఛనుపై సంకటస్థితి!* *🔶బెంచ్‌మార్క్ కార్పస్ ఫండ్‌పై కొరవడిన స్పష్టత* *🔷యూపీఎస్‌లోకి మారేందుకు కేంద్ర ఉద్యోగుల నిరాసక్తి* *🍥ఈనాడు, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ తరువాత కచ్చితమైన పింఛను ఇచ్చేందుకు ఉద్దేశించిన ‘యూనిఫైడ్ పింఛను పథకం (యూపీఎస్)’పై అనేక సందేహాలు ముసురుకున్నాయి. యూపీఎస్‌లో చేరాలని సూచిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు సరైన స్పష్టత ఇవ్వడం లేదు. ఈ స్థితిలో తెలుగు రాష్ట్రాల్లోని 12 వేల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. పూర్తి పింఛనుకు కనీస సర్వీసు, ముందస్తు ఉపసంహరణ (విత్ డ్రా)లపై ఆంక్షలు, బెంచ్‌మార్క్ కార్పస్ నిధి తదితరాలపై స్పష్టమైన వివరణలు లేకపోవడంతో ఉద్యోగులు పెద్దగా ఆసక్తి చూపడంలేదు. 2004 తరువాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన వారు.. ప్రస్తుత జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్)లో కొనసాగాలా? లేక కొత్తగా తీసుకువచ్చిన యూపీఎస్‌లో చేరాలా? అనే విషయమై సంకటస్థితి నెలకొంది. ఒకసారి యూపీఎస్‌లో చేరితే తిరిగి ఎన్‌పీఎస్‌లోకి వెళ్లే అవకాశాన్ని కేంద్రం తొలగించింది. యూపీఎస్‌లో చేరేందుకు ఈ నెల 30ని చివరి తేదీగా నిర్ణయించడంతో ఉద్యోగులంతా ఈ నెల 28లోగా ఆప్షన్ ఇవ్వాలని సంబంధిత ఎకౌంట్స్ అధికారులు గడువు విధించారు.* *💥పూర్తి పింఛను ఎవరికి వస్తుందంటే..* *💠యూపీఎస్‌లో చేరిన ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం వేతనంలో సగం మొత్తం పింఛనుగా (దీన్నే పూర్తి పింఛనుగా వ్యవహరిస్తారు) రావాలంటే కొన్ని నిబంధనలు పేర్కొంది. కనీసం 25 ఏళ్ల సర్వీసు పూర్తిచేయాలి. ఉద్యోగి, యజమాని వాటా నిధులు ఒక్కనెల కూడా పొరపాటు లేకుండా నిరంతరాయంగా పీఎఫ్‌ఆర్‌డీఏ వద్ద జమ కావాలి. 25 ఏళ్ల కన్నా తక్కువ సర్వీసుతో పదవీ విరమణ చేసినా, స్వచ్ఛంద పదవీ విరమణ చేసినా ఆ మేరకు పింఛనులో కోత పడుతుంది. కార్పస్ నిధి నుంచి ఒక్క రూపాయి కూడా పాక్షిక ఉపసంహరణ (విత్ డ్రా) చేయకూడదు. ఉద్యోగి డిఫాల్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. ఈ నిబంధనలన్నీ పాటిస్తేనే పూర్తిపింఛను వస్తుంది. అయితే యూపీఎస్‌లో పింఛను అర్హత పొందేందుకు కనీసం పదేళ్ల సర్వీసు పూర్తిచేసి ఉండాలి.* *💥ఉపసంహరణ చేసినా, సర్వీసు తగ్గినా...* *➡️యూపీఎస్‌లో చేరిన ఉద్యోగులు వేతనం నుంచి 10 శాతం కార్పస్‌నిధికి జమ చేస్తే.. కేంద్రం 18 శాతం జమ చేస్తుంది. ఈ మొత్తాన్ని ఎన్‌పీఎస్‌లో పెట్టుబడి పెడతారు. అవసరాల కోసం నిధిని ఉపసంహరించుకునే అవకాశమిచ్చినా, అలా నగదు విత్ డ్రా చేస్తే.. పింఛను తగ్గుతుంది.* *➡️ఉదాహరణకు... ఒక ఉద్యోగి రిటైరయ్యే నాటికి మూలవేతనం, డీఏ కలిపి రూ.45 వేలు ఉండి.. అతడు ఒక్క రూపాయి కూడా వెనక్కు తీసుకోకుంటే నెలకు రూ.22,500 పింఛను వస్తుంది. విత్ డ్రాల ద్వారా బెంచ్‌మార్క్ కార్పస్ నిధికి ఎంత తక్కువైతే.. పింఛను లెక్కింపులో ఆ మేరకు కోత తప్పదు. ఒకవేళ కార్పస్ నిధి కన్నా ఖాతాలో ఎక్కువ సొమ్ము ఉంటే.. పీఎఫ్‌ఆర్‌డీఏ ఆ మొత్తాన్ని ఉద్యోగి బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది.* *➡️పదవీ విరమణ సమయంలో ఉద్యోగులకు గ్రాట్యుటీతో పాటు ఒకేసారి చెల్లింపు కింద.. ప్రతి ఆరునెలలకోసారి చివరి వేతనంలో పదోవంతు నగదు ఇవ్వనుంది. కనీసం పదేళ్ల సర్వీసు పూర్తిచేసిన వారికే ఈ ప్రోత్సాహకం అందుతుంది. అంటే పదేళ్ల సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగికి.. ఆరునెలలకు ఒకటి చొప్పున లెక్కిస్తే మొత్తం 20 నెలలు అవుతుంది. నెలకు 1/10 వంతు వేతనం చొప్పున 20 నెలల మొత్తాన్ని ఆ ఉద్యోగికి ఒకేసారి చెల్లిస్తారు. ఉదాహరణకు ఒక ఉద్యోగి చివరి వేతనం రూ.68,850 ఉంటే... 1/10 వంతు రూ.6885 అవుతుంది. అతడు 15 సంవత్సరాల సర్వీసు పూర్తిచేశారనుకుంటే.. ఆరు నెలలకు ఒక నెల చొప్పున 15 ఏళ్లకు 30 నెలలు అవుతుంది. ఆ ఉద్యోగికి ఏకమొత్తంగా 30్ల6885 చొప్పున రూ.2,06,550 చేతికి అందుతాయి.* *💥ఉద్యోగుల ఆందోళనకు కారణాలివీ...* *➡️ఎన్‌పీఎస్‌లో కనీసం 60 శాతం నిధిని వెనక్కు తీసుకునే అవకాశముంది. కానీ యూపీఎస్‌లో ఆ వెసులుబాటు లేదు. ఒకవేళ విత్ డ్రా చేస్తే.. పింఛను తగ్గిపోతుంది.* *➡️పదవీ విరమణ అనంతరం ఇచ్చే మొత్తాన్ని (పే అవుట్‌ను) పింఛనుగా చెప్పడం లేదు. కేంద్రం నిర్ణయించినప్పుడు డీఏ ఏ విధంగా లెక్కిస్తారన్న స్పష్టత ఇవ్వలేదు.* *➡️ఉద్యోగి వేతనం నుంచి చెల్లించిన 10 శాతం నగదు వెనక్కు వచ్చే అవకాశం లేదు. ఉద్యోగి వాటా తీసుకుని పింఛను లెక్కిస్తే పదవీ విరమణ అనంతరం గ్రాట్యుటీ తప్ప చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండదు.**Click here to Join* https://whatsapp.com/channel/0029Va5HyFoFMqreW1ZoJp3m
*🔊💰ఏడెకరాల వరకు రైతుభరోసా నిధుల విడుదల* *🍥ఈనాడు, హైదరాబాద్: ఐదో విడత రైతుభరోసా నిధులు శుక్రవారం విడుదలయ్యాయి. ఏడు ఎకరాల వరకు ఉన్న 2.64 లక్షల మంది రైతులకు రూ. 905.89 కోట్లు జమ చేశామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేవలం ఐదు రోజుల్లోనే రూ. 7,310.59 కోట్లు విడుదల చేశామని, ఇప్పటివరకు 65.12 లక్షల మంది రైతులు రైతుభరోసా పొందారని చెప్పారు.* *Click here to Join* https://whatsapp.com/channel/0029Va5HyFoFMqreW1ZoJp3m
*🔊Ambedkar Research Center: రూ.100 కోట్లతో అంబేడ్కర్ పరిశోధన కేంద్రం* *🔶ఆరు నెలల్లో ‘బ్రిడ్జ్’ను ప్రారంభించేందుకు కసరత్తు* *🍥ఈనాడు, హైదరాబాద్: స్వతంత్ర భారతదేశంలో చాలా రాష్ట్రాలు.. ప్రాంతాల్లో కొనసాగుతున్న సామాజిక అసమానతలు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరును అధ్యయనం చేసేందుకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ స్థాయిలో పరిశోధన కేంద్రాన్ని నిర్మించనుంది. జూబ్లీహిల్స్‌లోని అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో రెండు ఎకరాల విస్తీర్ణంలో రూ.100 కోట్లతో ఇది రూపుదిద్దుకోనుంది. రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చనుంది. వచ్చే ఆరునెలల్లో ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి ‘బ్రిడ్జ్’ (బీఆర్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డైలాగ్ ఆన్ గవర్నెన్స్, ఈక్విటీ) అని పేరు పెట్టారు. ఈ కేంద్రం కార్యకలాపాల నిర్వహణకు ఒక గవర్నింగ్ బోర్డు, సలహా మండలిని ఏర్పాటు చేశారు. సలహామండలి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి, సమన్వయకర్తగా అంబేడ్కర్ వర్సిటీ వీసీ, సభ్యులుగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పరిశోధకులు, న్యాయనిపుణులు ఉంటారు. గవర్నింగ్ బోర్డు ఛైర్మన్‌గా ఉపముఖ్యమంత్రి వ్యవహరిస్తారు. బోర్డులో ఆర్థిక, ఉన్నత విద్యాశాఖల ముఖ్య కార్యదర్శులు, ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి శాఖల ముఖ్యకార్యదర్శులు, వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్, ముగ్గురు సంచాలకులు ఉంటారు. ప్రజాప్రయోజన అంశాలు, సాంఘిక దురాచారాలు, అక్షరాస్యత ఇలా వివిధ అంశాలపై అధ్యయనం చేయాలనుకున్న పరిశోధకులు, నిపుణులకు ఈ కేంద్రం నిధులు సమకూర్చనుంది. రాజ్యాంగ విధివిధానాల అమలు, సామాజిక న్యాయం వంటి అంశాలపై శిక్షణ ఇవ్వనుంది. గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనుంది. రాజ్యాంగంలో పొందుపరిచిన సూత్రాలు, విలువలు, నైతిక ప్రమాణాల అనుసరణపై విస్తృత అవగాహన కల్పించడం ప్రధాన లక్ష్యం. విస్తృత పరిశోధనలకు వీలుగా కొలంబియా విశ్వవిద్యాలయం, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌తో ఒప్పందాలు కుదుర్చుకోనుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యాకేంద్రంగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు, విధివిధానాలపై పరిశోధనలు నిర్వహించే సంస్థగా దీనిని రూపొందించేందుకు నిర్వాహకులు ప్రణాళికలను సిద్ధం చేశారు.* *💥ఇది కేవలం ఎస్సీ, ఎస్టీలకు సంబంధించింది కాదు* *🎙️ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, అంబేడ్కర్ వర్సిటీ వీసీ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం* *🌀సామాజిక అసమానతలపై పరిశోధనలు చేస్తున్న వారికి ప్రోత్సాహమిచ్చేందుకు ఆర్థిక సహకారం అందించనున్నాం. 3 లేదా 6 నెలల్లో అధ్యయనం పూర్తిచేయాలి. వాటిని అంతర్జాతీయ స్థాయిలో ప్రచురించనున్నాం. కేంద్ర, రాష్ట్ర పథకాలు, విధివిధానాలపై అధ్యయనాలు ఆయా ప్రభుత్వాల దృష్టికి వెళ్తే వెంటనే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అవి సద్వినియోగమవుతున్నాయా.. లోపాలను సవరిస్తే ఇంకా ఎంతమందికి ప్రయోజనం కలగొచ్చు.. అనే అంశాలపై పరిశోధన, అధ్యయనాలను ప్రచురించనున్నాం. ఇది కేవలం ఎస్సీ, ఎస్టీలకు సంబంధించింది కాదు. విధానపరమైన అంశాలను అధ్యయనం చేసే అత్యుత్తమ అంతర్జాతీయ పరిశోధన కేంద్రం.* *Click here to Join* https://whatsapp.com/channel/0029Va5HyFoFMqreW1ZoJp3m
*🔊ఒకే గదిలో.. బడి, అంగన్‌వాడీ, పంచాయతీ* *🍥ఈనాడు, హైదరాబాద్: గిరిజన తండాల్లో ప్రభుత్వ భవనాల కొరతకు దర్పణమీ చిత్రం. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం కొర్రతండాలో ఒకే గదిలో పంచాయతీ కార్యాలయం, ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలకు ఆ భవనాన్ని కేటాయించారు. ఆ తర్వాత అంగన్వాడీ కేంద్రం, గ్రామపంచాయతీని కూడా అందులోనే కలిపేశారు. దీంతో మూడు వ్యవస్థలు ఒకే గదిలో పనిచేయాల్సి వస్తోంది.* *Click here to Join* https://whatsapp.com/channel/0029Va5HyFoFMqreW1ZoJp3m
*🔊Union Education Ministry: కోచింగ్ లేకుండా ర్యాంకు కొట్టేదెలా..?* *🔶విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేలా ఏం చేయొచ్చు?* *🔷నిపుణుల కమిటీని నియమించిన కేంద్ర విద్యాశాఖ* *🍥ఈనాడు, హైదరాబాద్: ప్రస్తుతం కోచింగ్ లేకుండా ఇంజినీరింగ్ లేదా వైద్య విద్య ప్రవేశ పరీక్షల్లో ర్యాంకు సాధించలేరనే భావన విద్యార్థులతోపాటు తల్లిదండ్రుల్లోనూ నెలకొంది. ఉత్తమ ర్యాంకులు సాధించి.. అత్యుత్తమ విద్యాసంస్థల్లో సీట్లు దక్కించుకోవాలన్న తాపత్రయంతో పాఠశాల స్థాయి నుంచే కోచింగ్ కేంద్రాల్లో చేరుతున్నారు. పిల్లలు ర్యాంకుల పరుగు పందెంలో పడి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు కేంద్ర విద్యాశాఖ దృష్టి సారించింది. కోచింగ్ ప్రభావం పడకుండా పరీక్షలకు పోటీపడేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలోచర్చించి.. సిఫార్సులు చేయాలని కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషి ఛైర్మన్‌గా కమిటీని నియమించింది. సీబీఎస్‌ఈ ఛైర్మన్, పాఠశాల, ఉన్నత విద్య విభాగాల సంయుక్త కార్యదర్శులు, ఐఐటీ మద్రాస్, తిరుచ్చి ఎన్‌ఐటీ, ఐఐటీ కాన్పుర్, ఎన్‌సీఈఆర్‌టీ ప్రతినిధులు, ఒక కేంద్రీయ విద్యాలయ, ఒక నవోదయ విద్యాలయ, ఒక ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపల్ సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ప్రతి నెలా విద్యాశాఖ మంత్రికి పురోగతిని వివరించాలని ఆదేశించింది.* *💥ఏళ్లుగా మాటలకే పరిమితం* *🌀జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్ పరీక్షలకు కోచింగ్ లేకుండా చేయాలని.. ఇంటి నుంచైనా సన్నద్ధమయ్యేలా చేస్తామని డైరెక్ట్ టూ హోం(డీటీహెచ్) ఛానళ్ల కోసం స్వయంప్రభ పోర్టల్‌ను 2017లోనే ప్రారంభించింది. అయితే దీనిపై ప్రచారం, అవగాహన కల్పించడంలో విఫలమైంది. ఫలితంగా కోచింగ్ లేకుండా ఐఐటీ చదవడమనేది మాటలకే పరిమితమైంది. పలు ప్రైవేటు కోచింగ్ సెంటర్లు ఇష్టారాజ్యంగా తమదే మొదటి ర్యాంకని ప్రచారం చేసుకుంటూ తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తున్నా ఏ ప్రభుత్వాలూ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ర్యాంకుల ఒత్తిడిలో ఏటా వందల మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2022 గణాంకాల ప్రకారం 13,044 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అందులో 2 వేల మంది పరీక్షల్లో వైఫల్యంతోనే బలవన్మరణానికి పాల్పడ్డారని పేర్కొంది. రాజస్థాన్‌లోని కోటాలో 2023లో 26 మంది పిల్లలు తనువు చాలించగా...ఈ సంవత్సరం ఇప్పటివరకు 14 మంది ప్రాణాలొదిలారు. మరోవైపు పిల్లల శిక్షణకు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తూ తల్లిదండ్రులు అప్పుల పాలవుతున్నారు. ‘శిక్షణ తీసుకోకపోతే తాము వెనకబడతామనే భావనతో చదువులో ప్రతిభావంతులు సైతం కోచింగ్ కేంద్రాల్లో చేరుతున్నారు. ఆ సంస్థలు వెనకబడిన విద్యార్థులకు ఉత్తమ ర్యాంకులు తెప్పించలేవు. బాగా చదివే వారికే కొంత సానబెడతాయి.నిజానికి వారు కోచింగ్ తీసుకోకున్నా మంచి ర్యాంకులే తెచ్చుకోగలరు’ అని జేఎన్‌టీయూహెచ్ ఆచార్యుడు ఒకరు తెలిపారు.* *💥2028 నాటికి రూ.1.34 లక్షల కోట్ల వ్యాపారం* *💠దేశంలో కోచింగ్ పరిశ్రమ మార్కెట్ ఆదాయం 2028 నాటికి రూ.1.34 లక్షల కోట్లకు చేరుకుంటుందని పుణెకు చెందిన కన్సల్టెన్సీ సంస్థ ఇన్ఫీనియం గ్లోబల్ రీసెర్చ్ వెల్లడించింది. 2022లో ఇది రూ.58 వేల కోట్లుగా ఉన్నట్లు అంచనా వేసింది. ఏటా 7 నుంచి 8% కాంపౌండ్ వార్షిక వృద్ధి రేటు(సీఏజీఆర్)తో ఈ పరిశ్రమ ఆదాయం పెరుగుతున్నట్లు పేర్కొంది. జేఈఈ మెయిన్‌కు ఏటా 13 లక్షల మంది, నీట్‌కు 22 లక్షల మంది పోటీపడుతున్నారు. వారిలో 80% మంది ఏదో ఒక మార్గంలో కోచింగ్ తీసుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు.* *💥కమిటీ పరిశీలించాల్సిన అంశాలు* *➡️పాఠశాల విద్యలో లోపాలు. నిర్ణయాత్మక ఆలోచన(క్రిటికల్ థింకింగ్), విశ్లేషణాత్మక నైపుణ్యాలు, నవ కల్పన తదితర అంశాలపై తక్కువ దృష్టి సారిస్తుండటం* *➡️డమ్మీ స్కూళ్ల కట్టడి* *➡️పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేలా తొలి నుంచి విద్య అందించడం* *➡️ప్రముఖ విద్యాసంస్థల్లో తక్కువ సీట్లు ఉండటం.. నాణ్యమైన విద్యకు డిమాండ్ పెరుగుతుండటం* *➡️ఇతర కెరీర్ మార్గాలపై అవగాహన పెంపొందించడం* *➡️పోటీ పరీక్షల్లో కోచింగ్ ప్రభావంపై అధ్యయనం* *➡️శిక్షణ కేంద్రాల ప్రకటనలు, తప్పుడు మార్గాల్లో ర్యాంకులను క్లెయిమ్ చేసుకోవడం తదితర వాటిపై సమీక్ష* *➡️పాఠశాలలు, కళాశాలల్లో కెరీర్ గైడెన్స్‌పై సూచనలు.* *Click here to Join* https://whatsapp.com/channel/0029Va5HyFoFMqreW1ZoJp3m
*🔊ఇంటర్వ్యూల వాయిదా సమాచారం తెలియక పోటెత్తిన అభ్యర్థులు* *🍥ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని హాస్టల్ సహాయ వార్డెన్ పోస్టులకు ఇంటర్వ్యూలు జరుగుతాయని భావించిన అభ్యర్థులు శుక్రవారం భారీఎత్తున తరలివచ్చారు. 20 పోస్టులకు ఈ నెల 20న వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయ పాలకమండలి ఈ నెల ఆరంభంలో వెబ్‌సైట్ ద్వారా వెల్లడించింది. ఆ తర్వాత ఇంటర్వ్యూలను వాయిదా వేస్తున్నట్లు ఈ నెల 17న వెబ్‌సైట్‌లో పేర్కొంది. చాలామంది అభ్యర్థులు మొదట్లో ప్రకటించిన తేదీనే ఇంటర్వ్యూలు ఉంటాయని భావించి శుక్రవారం విశ్వవిద్యాలయానికి తరలివచ్చారు. వాయిదా వేసినట్లు తెలుసుకొని.. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఇంటర్వ్యూలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ భైఠాయించారు. వాయిదా వేసినట్లు ఈ నెల 17నే తెలియజేశామని, త్వరలో మరో తేదీ ప్రకటిస్తామని రిజిస్ట్రార్ తెలిపారు. అభ్యర్థులు మధ్యాహ్నం వరకు వేచి చూసి వెళ్లిపోయారు.* *Click here to Join* https://whatsapp.com/channel/0029Va5HyFoFMqreW1ZoJp3m
*🔊ఇంటర్ విద్యార్థులకు జులై నుంచి ఆన్‌లైన్ కోచింగ్* *🍥ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీల్లో ఇంటర్ విద్యార్థులకు జేఈఈ, నీట్, క్లాట్ లాంటి ప్రవేశ పరీక్షలకు ఉచితంగా ఆన్‌లైన్ కోచింగ్ ఇవ్వనున్నారు. ‘తెలంగాణ ఎచీవర్స్ 2025’ పేరిట జులై నుంచి డిసెంబరు వరకు ఎడ్‌టెక్ కంపెనీ ఫిజిక్స్ వాలా భాగస్వామ్యంతో అమలు చేయనున్నారు. విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా శనివారం నిర్వహించిన సమీక్షలో అమలుపై చర్చించారు.* *Click here to Join* https://whatsapp.com/channel/0029Va5HyFoFMqreW1ZoJp3m
*🔊పాఠశాలల్లో సాధన* *🍥పెనుబల్లి, న్యూస్‌టుడే : పాఠశాలల్లో నిత్యం ప్రార్థన సమయం లేదా తరగతి గదిలో అయిదు నిమిషాలపాటు విద్యార్థులకు యోగా లేదా ధ్యానం నిర్వహించాలని, అరగంట పాటు పిల్లలతో కథల పుస్తకాలు, పత్రికలు చదివించాలని ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్‌లో ఆదేశించింది.* *🌀ఇదీ ఉద్దేశం.. విద్యార్థులు నిత్యం యోగా సాధన చేస్తే శారీరక దృఢత్వంతో పాటు ఆరోగ్యంగా ఉంటారు. ధ్యానం అలవాటు చేస్తే చదివే విషయాలపై ఏకాగ్రత, పెరిగి, మానసిక ప్రశాంతత చేకూరుకుంది. కథలతో నైతిక విలువలు పెరగడం, పత్రికలు చదవడం వల్ల జ్ఞానం, జీకే, సామాజిక, వర్తమాన అంశాల్లో పట్టు లభిస్తుంది.* *💠అన్నిచోట్లా సాధ్యమేనా?.. 2022 నుంచి పాఠశాలల్లో యోగా సాధన చేయించాలని ప్రభుత్వం భావిస్తున్నా కార్యరూపం దాల్చటం లేదు. జిల్లాలోని అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయులు లేరు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నచోటే వీరున్నారు. యోగా విద్యపై అవగాహన లేని ఉపాధ్యాయులున్న పాఠశాలల్లో ఎలా అమలవుతుందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఉదయం గీతాలాపాన, వార్తలు చదవడం, ప్రధానోపాధ్యాయుల సందేశం అనంతరం విద్యార్థులు తరగతి గదులకు వెళ్తున్నారు. వారంలో చాలాసార్లు ఈ కార్యక్రమాలకు కేటాయించిన సమయం మించిపోతుందని క్లాస్ టీచర్లు అంటున్నారు. యోగా, ధ్యాన ప్రక్రియలకు సమయాన్ని మార్చితే మేలని అభిప్రాయపడుతున్నారు. బాలికలకు ఆత్మరక్షణ విద్య నేర్పేందుకు కరాటే శిక్షకులను నియమించిన తరహాలో తర్ఫీదు పొంది, అనుభవం కలిగిన వారిని యోగా శిక్షకులుగా నియమించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.* W
*🔊కాస్త మెరుగు‘బడి’నా..!* *🍥ఈనాడు డిజిటల్, కొత్తగూడెం : రెండేళ్లుగా సర్కారు బడుల పనితీరు మెరుగుపడింది. కేంద్ర విద్యాశాఖ 2023-24 పెర్ఫార్మింగ్ గ్రేడ్ ఇండెక్స్(పీజీఐ) నివేదికను తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం ఖమ్మం, భద్రాద్రి జిల్లాలు పుంజుకున్నాయి. అభ్యసన ఫలితాలు, చదువుల నాణ్యత, మౌలిక వస తులు, అందుబాటులో బడులు- పిల్లల రక్షణ, డిజిటల్ లెర్నింగ్, విద్యా పరిపాలన విభాగాల్లో 74 సూచికలను పరిగణనలోకి తీసుకుని 600 మార్కులకు గ్రేడింగ్ ఇచ్చారు. వీటిలో వచ్చిన మార్కుల ఆధారంగా జిల్లాలకు ర్యాంకులు కేటాయించారు.* *💥ప్రశిష్ట-3 నుంచి ప్రశిష్ట-2లోకి..* *🌀ప్రభుత్వ పాఠశాలల పనితీరు మదింపునకు ఆరు విభాగాలు, 74 సూచికలను ప్రామాణికంగా తీసుకున్నారు. 600 మార్కులకు 2022-23లో ఖమ్మం-225, భద్రాద్రి- 217 మార్కులు సాధించి ప్రశిష్ట-3 కేటగిరీలో నిలిచాయి. 2023-24లో ఖమ్మం-269, భద్రాద్రి-248 మార్కులతో ఒక స్థానం ఎగబాకి ప్రశిష్ట-2 కేటగిరీకి చేరాయి.* *💥మెరుగైన అభ్యసన ఫలితాలు* *💠పీజీఐ కొలమానాల్లో అభ్యసన ఫలితాల మదింపునకు 24 సూచికలను పరిగణనలోకి తీసుకున్నారు. వీటికి 290 మార్కులు కేటాయించారు. పిల్లల అక్షరాస్యత, గణితంలో కనీస నైపుణ్యం, బడి బయట పిల్లలు, ప్రాథమిక, ఉన్నత విద్యలో చదువు మధ్యలో మానేసిన పిల్లలు, 6-10వ తరగతిలో సైన్స్, సాంఘికశాస్త్రాల్లో ప్రావీణ్యం సాధించిన పిల్లల శాతం వంటి 24 అంశాలకు మార్కులు ఇచ్చారు. ఈ విభాగంలో 2022-23లో ఖమ్మం-98, భద్రాద్రి-87 మార్కులు సాధించగా 2023-24లో ఖమ్మం-115, భద్రాద్రి-106 మార్కులు పొందాయి.* *💥డిజిటల్ లెర్నింగ్‌లో వెనుకబాటే* *🥏డిజిటల్ లెర్నింగ్ విభాగంలో ఖమ్మం, భద్రాద్రి జిల్లాలు ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నాయి. పాఠశాలల్లో ఇంటర్‌నెట్ సౌకర్యం, కంప్యూటర్లు, స్మార్ట్ తరగతి గదులు, శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, విద్యార్థులు, కంప్యూటర్ల నిష్పత్తి వంటి ఐదు అంశాలకు 50 మార్కులు కేటాయించారు. 2022-23లో ఖమ్మం-11, భద్రాద్రి-8 మార్కులు పొందగా 2023-24లో ఖమ్మం-14, భద్రాద్రి-10 మార్కులు సాధించాయి. అందుబాటులో బడులు, పిల్లల రక్షణ విభాగంలోనూ ఉభయ జిల్లాలు వెనుకబడ్డాయి. దీనికి 35 మార్కులు కేటాయించగా 2023-24లో ఖమ్మం-11, భద్రాద్రి-10 మార్కులు సాధించాయి. సర్కారు బడులను బలోపేతం చేయటంలో ఈ రెండు విభాగాలు కీలకమవటంతో వీటిల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా అధికార యంత్రాంగం కృషిచేయాలి.* *💥ఏడో స్థానంలో ఖమ్మం* *💫పీజీఐ నివేదిక ప్రకారం రాష్ట్రంలో అత్యధిక మార్కులు సాధించిన జిల్లాల జాబితాలో ఖమ్మం జిల్లా 7, భద్రాద్రి జిల్లా 23వ స్థానంలో నిలిచాయి. 284 మార్కులతో మేడ్చల్ మల్కాజిగిరి తొలిస్థానంలో, 219 మార్కులతో ఆదిలాబాద్ చివరి స్థానంలో ఉన్నాయి. అన్ని విభాగాల్లో రాజధాని చుట్టుపక్కల జిల్లాలతో ఖమ్మం పోటీపడినా.. డిజిటల్ లెర్నింగ్, అందుబాటులో బడులు, పిల్లల రక్షణ విషయంలో వెనుకబడటం వల్ల ర్యాంకు తగ్గింది.* *Click here to Join* https://whatsapp.com/channel/0029Va5HyFoFMqreW1ZoJp3m