⚡SchoolEdu 👈 Join Now
February 2, 2025 at 01:17 AM
*🔊ఆలస్యంగా మొదలైన జేఈఈ మెయిన్ దరఖాస్తు ప్రక్రియ*
*🍥ఈనాడు, హైదరాబాద్: జేఈఈ మెయిన్ చివరి విడతకు దరఖాస్తుల స్వీకరణ ఒకరోజు ఆలస్యంగా శనివారం రాత్రి ప్రారంభమైంది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 24 వరకు ప్రక్రియ కొనసాగుతుందని జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) గతంలో ప్రకటించింది. అయితే దరఖాస్తు చేసుకునే విండోను ఆ సంస్థ శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో అందుబాటులోకి తెచ్చింది. ఒకరోజు ఆలస్యమైనందున ఆ మేరకు ముగింపు గడువును ఒకరోజు పెంచింది. అంటే విద్యార్థులు ఈ నెల 25వ తేదీ రాత్రి 9 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలోనే తొలి, చివరి విడతకు దరఖాస్తు చేసిన వారు మాత్రం మళ్లీ చేయాల్సిన అవసరం లేదని ఎన్‌టీఏ పేర్కొంది. ఏప్రిల్ 1 నుంచి 8 మధ్య పరీక్షలు జరగనున్నాయి.*
*Click here to Join*
https://whatsapp.com/channel/0029Va5HyFoFMqreW1ZoJp3m