⚡SchoolEdu 👈 Join Now
February 2, 2025 at 01:17 AM
*🔊Samagra kutumba survey: నేడు సమగ్ర కుటుంబ సర్వే నివేదిక* *🔶మంత్రివర్గ ఉపసంఘానికి అందజేయనున్న ప్రణాళికాశాఖ* *🔷ఆది, సోమవారాల్లో నివేదికపై చర్చించనున్న సీఎం, మంత్రులు* *🔶5న ఉదయం మంత్రివర్గ భేటీ.. అదేరోజు మధ్యాహ్నం శాసనసభ ప్రత్యేక సమావేశం* *🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ అంశాలు త్వరలో ఖరారు కానున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల ఖరారులో కీలకమైన సమగ్ర కుటుంబ సర్వే(కుల సర్వే), ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం నియమించిన జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్‌ నివేదికలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు కులగణన నివేదికను ప్రణాళికాశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, అధికారులు ఉప సంఘానికి సమర్పించనున్నారు. ఎస్సీ వర్గీకరణపై నివేదికను జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్‌ సోమవారం (ఈ నెల 3న) మంత్రివర్గ ఉప సంఘానికి ఇవ్వనుంది. వీటిపై ఈ నెల 5న ఉదయం జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి, అదేరోజు మధ్యాహ్నం ఏర్పాటు చేసే శాసనసభ ప్రత్యేక సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. కుటుంబ సర్వే, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై శనివారమిక్కడ మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులతో సీఎం రేవంత్‌రెడ్డి చర్చించారు.* *💥మంత్రివర్గ ఉపసంఘం భేటీ* *🌀ఎస్సీ వర్గీకరణ, సమగ్ర కుటుంబ సర్వేపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం శనివారం సమావేశమై చర్చించింది. దీనికి సభ్యులు దామోదర్‌ రాజనర్సింహ, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, మల్లు రవి హాజరయ్యారు. సమగ్ర కుటుంబ సర్వేపై గత ఏడాది అక్టోబరు 19న ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వగా.. నవంబరులో దాదాపు 1.10 కోట్ల కుటుంబాల సర్వే జరిగిందని, ఈ వివరాల క్రోడీకరణను ప్రణాళికాశాఖ విజయవంతంగా పూర్తి చేసిందని ఉత్తమ్‌ పేర్కొన్నారు. కుటుంబ సర్వే నివేదికపై ఆది, సోమవారాల్లో మంత్రులతో సీఎం ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారని పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.* *💥2 రోజుల్లో బీసీ ప్రత్యేక కమిషన్‌ నివేదిక!* *💠సమగ్ర కుటుంబ సర్వే నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై ఏర్పాటైన ప్రత్యేక(డెడికేటెడ్‌) కమిషన్‌ రెండు రోజుల్లో నివేదిక సిద్ధం చేయనున్నట్లు సమాచారం. వార్డులు, గ్రామాలు, మండలాలు, జిల్లాలు, పట్టణ స్థానిక సంస్థల వారీగా బీసీ జనాభా వివరాల ప్రకారం గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలు, జీహెచ్‌ఎంసీ వారీగా రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.* *💥సమగ్ర అధ్యయనం చేసిన జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ కమిషన్‌* *🥏ఎస్సీ వర్గీకరణపై జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ నేతృత్వంలో ఏర్పాటైన ఏకసభ్య కమిషన్‌ క్షేత్రస్థాయిలో పర్యటించడంతో పాటు ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించింది. పలు నివేదికలను, సమాచారాన్ని అధ్యయనం చేసింది. కమిషన్‌కు 8 వేల మంది, కుల సంఘాలు తమ వినతులు, అభ్యంతరాలను అందించాయి. వివిధ శాఖల నుంచి జనాభా, అక్షరాస్యత, ఉద్యోగులు, విద్యాసంస్థల్లో ప్రవేశాలు, సంక్షేమ పథకాల లబ్ధిదారులు, ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాల వివరాలను కమిషన్‌ సేకరించింది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు, రామచంద్రరాజు కమిషన్‌ నివేదికలను పరిశీలించింది. మంత్రివర్గ ఉపసంఘానికి కమిషన్‌ నివేదిక అందించిన తర్వాత దానిపై ప్రభుత్వం అధ్యయనం చేసిన అనంతరం అసెంబ్లీలో చర్చించి, నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.* *Click here to Join* https://whatsapp.com/channel/0029Va5HyFoFMqreW1ZoJp3m

Comments