⚡SchoolEdu 👈 Join Now
February 3, 2025 at 03:40 AM
*🔊నేటి నుంచే.. నామినేషన్ల పర్వం*
*🍥ఈనాడు డిజిటల్, కొత్తగూడెం: ఉమ్మడి ఖమ్మం-నల్గొండ-వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం.. నామపత్రాల స్వీకరణ. సోమవారం నుంచి ఈ ప్రక్రియ మొదలుకానుంది. ఈనెల 10వ తేదీ వరకు, సాధారణ రోజుల్లో ఉ.11 నుంచి మ.3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి రిటర్నింగ్ అధికారిగా(ఆర్వో) వ్యవహరిస్తున్నారు. అభ్యర్థులెవరైనా ఆర్వో కార్యాలయంలో నామపత్రాలు దాఖలు చేయొచ్చు. ఈ నెల 11న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఉపసంహరణకు 13వ తేదీ వరకు గడువిచ్చారు.*
*💥తుది జాబితా కొలిక్కి..*
*🌀ఎన్నికల సంఘం తుది ఓటరు జాబితాను సిద్ధం చేసింది. ఉమ్మడి ఖమ్మం-నల్గొండ-వరంగల్ జిల్లాల పరిధిలో మొత్తం 24,905 మంది ఓటర్లు నమోదయ్యారు. వీరంతా ఓటుహక్కు వినియోగించుకునేలా 200 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. 2019 నాటి ఎన్నికల్లో 20,888 మంది ఓటర్లు నమోదయ్యారు. వీరికి అదనంగా 4,017 మంది ఓటుహక్కు పొందారు. ఈనెల 27న పోలింగ్ జరగనుండగా, ఓట్ల లెక్కింపు మార్చి 3న ఉంటుంది. అధికార యంత్రాంగం పోలింగ్‌కు ఇప్పట్నుంచే సన్నద్ధమవుతోంది.*
*Click here to Join*
https://whatsapp.com/channel/0029Va5HyFoFMqreW1ZoJp3m