⚡SchoolEdu 👈 Join Now
February 3, 2025 at 03:40 AM
*🔊ఆరుగురు గురుకుల విద్యార్థులు అదృశ్యం*
*🍥కోదాడ గ్రామీణం, న్యూస్‌టుడే: సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని దోరకుంట సమీప నెమలిపురి సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు ఆదివారం అదృశ్యమయ్యారు. ఉపాధ్యాయులు మందలించడంతోనే పరారైనట్లు సమాచారం. గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు శనివారం వీడ్కోలు సమావేశం నిర్వహించారు. పది మంది మద్యం తాగి తోటి విద్యార్థులతో ఘర్షణకు దిగినట్లు తెలుస్తోంది. దీంతో ప్రధానోపాధ్యాయురాలు ఝాన్సీ, ఉపాధ్యాయులు విద్యార్థులను మందలించారు. దీంతో విద్యార్థులు పాఠశాల నుంచి పరారయ్యారు. తల్లిదండ్రులను ఆరా తీయగా ఇంటికి రాలేదని చెప్పడంతో రాత్రి వరకు ఎదురుచూసి కోదాడ గ్రామీణ ఠాణాలో ప్రిన్సిపల్ ఫిర్యాదు చేశారు*
*Click here to Join*
https://whatsapp.com/channel/0029Va5HyFoFMqreW1ZoJp3m