⚡SchoolEdu 👈 Join Now
February 3, 2025 at 03:40 AM
*🔊Anganwadi Centers: అద్దె భవనాలు.. అరకొర వసతులు*
*🔶అంగన్‌వాడీ కేంద్రాల్లో తగ్గుతున్న హాజరు శాతం*
*🔷మంజూరైన పనుల్లోనూ కనిపించని పురోగతి*
*🍥రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో కనీస మౌలిక సదుపాయాల పనులు నెమ్మదిగా కొనసాగుతున్నాయి. ఆ కేంద్రాల్లో పూర్వప్రాథమిక విద్య అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ సదుపాయాల కొరత వేధిస్తోంది. శిథిలావస్థకు చేరిన, అద్దె భవనాలు, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం లేకపోవడం, ఆవాసాలకు దూరంగా ఉండటంతో గర్భిణులు, బాలింతలకు కష్టాలు తప్పడం లేదు. ఈ పరిస్థితుల్లో అంగన్‌వాడీ కేంద్రాల్లో హాజరుపై తీవ్రప్రభావం పడుతోంది. పేర్లు నమోదు చేసుకున్న చిన్నారుల సంఖ్య 9.04 లక్షలుగా ఉండగా.. హాజరయ్యేవారు అందులో సగం మాత్రమే. గర్భిణులు, బాలింతల సంఖ్య 3.5 లక్షలుగా ఉండగా.. నెలలో 21 రోజులు హాజరవుతున్న వారు 2 లక్షల్లోపే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మౌలిక సదుపాయాల పనులు వేగవంతం చేయాలని ఇటీవల సంబంధిత మంత్రి అధికారులను ఆదేశించారు.*
*💥పనులు పెండింగ్..*
*💠రాష్ట్రంలోని 35,700 అంగన్‌వాడీ కేంద్రాల్లో 12,380 అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఆయా కేంద్రాలకు పక్కా భవనాలు నిర్మించేందుకు వీలుగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. 2024-25 ఏడాదికి ఉపాధి హామీ పథకం కింద మండలానికి ఒకటి చొప్పున అంగన్‌వాడీ కేంద్రం నిర్మాణానికి ఆమోదం తెలిపింది. అయితే, వీటి నిర్మాణం నత్తనడకన కొనసాగుతోంది. కొన్నిచోట్ల భూముల గుర్తింపు, స్థలాల స్వాధీన సమస్యలు నెలకొన్నాయి. పంచాయతీరాజ్ అధికారుల సమన్వయంతో వీలైనంత త్వరగా నిర్మాణాలు పూర్తిచేయాలని జిల్లా క్షేత్రస్థాయి సంక్షేమాధికారులకు శిశు సంక్షేమశాఖ సూచించింది.*
*💥పనుల పురోగతి ఇలా...*
*➡️రాష్ట్రంలో 500 అంగన్‌వాడీ కేంద్రాలను ఉన్నతీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు 158 కేంద్రాల ఉన్నతీకరణ మాత్రమే పూర్తయింది. 159 కేంద్రాల పనులు ఇంకా మొదలుకాలేదు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం మహబూబాబాద్, వరంగల్, నల్గొండ, సంగారెడ్డి, ఖమ్మం జిల్లాలు ఈ పనుల్లో వెనుకంజలో ఉన్నాయి.*
*➡️రాష్ట్రవ్యాప్తంగా 7,021 అంగన్‌వాడీ కేంద్రాలకు మరుగుదొడ్లు మంజూరయ్యాయి. వీటిలో 4,268 చోట్ల పనులు మొదలు కాలేదు. ప్రారంభమైన వాటిలో 1015 చోట్ల మాత్రమే పూర్తయ్యాయి. రంగారెడ్డి, మహబూబాబాద్, కరీంనగర్, ఖమ్మం, నాగర్‌కర్నూల్ జిల్లాలు వెనకబడి ఉన్నాయి.*
*➡️తాగునీటి సౌకర్యం కల్పనకు 1,811 కేంద్రాలు ఎంపికయ్యాయి. వీటిలో 289 చోట్ల పూర్తయితే.. మరో 1169 కేంద్రాల్లో పనులు మొదలు కాలేదు. ఇందులో రంగారెడ్డి, ములుగు, కరీంనగర్, మహబూబాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలు అత్యంత వెనకబడి ఉన్నాయి.*
*💥వసతుల లేమి ఇలా..*
*➡️మొత్తం అంగన్‌వాడీ కేంద్రాలు 35,700*
*➡️అద్దె భవనాల్లోనివి 12,380*
*➡️మరుగుదొడ్లు లేనివి 16,433*
*💥ఒక్క గది.. నాలుగు అంగన్‌వాడీలు!*
*🌀ఒక్కో అంగన్‌వాడీ కేంద్రానికి ఒక్కో టీచర్ ఉంటారు. ఇక్కడేంటీ.. ఒక్క కేంద్రంలో నలుగురు టీచర్లు పిల్లలకు బోధిస్తున్నారు? ఏంటట ఆ అంగన్‌వాడీ ప్రత్యేకత? అనుకుంటున్నారు కదూ..! పెరిగిన అద్దె ప్రభావం!! నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్ గ్రామంలో నాలుగు అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. రెండు నెలల కిందట వరకు ఇవి అద్దె గదుల్లో కొనసాగుతుండేవి. ప్రభుత్వం అద్దె నిమిత్తం రూ.1,500 చొప్పున మాత్రమే చెల్లిస్తుంది. ఆ ధరకు ఎవరూ గదులు అద్దెకు ఇవ్వడంలేదు. దీంతో రెండు నెలలుగా గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని ఓ గదిలో నాలుగు అంగన్‌వాడీ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఆ కేంద్రాల టీచర్లు నలుగురు ఇలా చిన్నారుల చుట్టూ చేరి బోధిస్తున్నారు. సీడీపీవో సరోజనిని ఈ విషయమై వివరణ కోరగా.. పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.*
*Click here to Join*
https://whatsapp.com/channel/0029Va5HyFoFMqreW1ZoJp3m