⚡SchoolEdu 👈 Join Now
February 3, 2025 at 03:40 AM
*🔊20 రాష్ట్రాల్లో బియ్యమే ప్రధాన ఆహారం*
*💠తెలంగాణ 9, ఏపీ 12వ స్థానాల్లో..*
*🍥ఈనాడు, దిల్లీ: మారుతున్న జీవనశైలితో ప్రజలు అన్నం తినడం తగ్గించి.. గోధుమలు, జొన్నలు, రాగులు ఇతర చిరుధాన్యాలు వినియోగించడం పెరుగుతున్నా.. ఇప్పటికీ దేశంలోని 20 రాష్ట్రాల్లో బియ్యమే ప్రధాన ఆహారంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ‘కుటుంబ వినియోగ వ్యయం సర్వే: 2023-24’ నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. దేశం మొత్తం మీద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు నెలకు సగటున 4.629 కేజీల చొప్పున బియ్యాన్ని వినియోగిస్తున్నారు. నెలకు తలసరి సగటున 8.4215 కేజీల వినియోగంతో తెలంగాణ 9వ స్థానంలో, 7.9185 కేజీల వినియోగంతో ఏపీ 12వ స్థానంలో ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధికంగా బియ్యం వినియోగిస్తున్న రాష్ట్రాలు ఇవే. తర్వాతి స్థానాల్లో వరుసగా తమిళనాడు-14, కేరళ-18, కర్ణాటక-20 నిలిచాయి*
*💥దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో బియ్యం తలసరి నెలవారీ వినియోగం 5.065 కేజీలు ఉండగా.. పట్టణాల్లో 4.193 కేజీలు ఉంది. పట్టణ ప్రాంతాల వినియోగంతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 21% అధికంగా ఉంది*
*🌀ఈ తేడా తెలంగాణలో 23 శాతం మేర ఉండగా, ఏపీలో 12 శాతానికే పరిమితమైంది.*
*✡️తెలంగాణ గ్రామాల్లో 9.299, పట్ణణాల్లో 7.544 కేజీలు చొప్పున సగటున 8.4215 కేజీలు నెలవారీగా వినియోగిస్తున్నారు. ఏపీ పట్టణాల్లో 8.356, గ్రామాల్లో 7.481 కేజీల చొప్పున సగటున 7.9185 కేజీలు ఆహారంగా తీసుకుంటున్నారు.*
*❇️బియ్యం వినియోగం ఈశాన్య రాష్ట్రాల్లోనే అత్యధికంగా ఉంది. తొలి మూడు స్థానాల్లో మణిపుర్, త్రిపుర, అరుణాచల్‌ప్రదేశ్‌లు ఉన్నాయి*
*✴️అత్యధిక రాష్ట్రాల్లో బియ్యం వినియోగం గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా ఉంది.*
*🌀పంజాబ్, హరియాణా, రాజస్థాన్ ప్రజలు నెలకు కనీసం కేజీ బియ్యం కూడా ఉపయోగించడంలేదు.*
*💥ఏపీలో కిలో బియ్యానికి సగటున రూ.29, తెలంగాణలో రూ.31 ఖర్చు చేస్తున్నట్లు ఈ నివేదిక ద్వారా వెల్లడైంది*
*Click here to Join*
https://whatsapp.com/channel/0029Va5HyFoFMqreW1ZoJp3m