⚡SchoolEdu 👈 Join Now
February 3, 2025 at 03:40 AM
*🔊Telangana Legislature Meeting: రేపు శాసనసభ సమావేశం*
*🔶శాసనమండలి సైతం..*
*🔷సామాజిక ఆర్థిక సర్వే, ఎస్సీ వర్గీకరణ నివేదికపై చర్చ*
*🔶అంతకుముందు మంత్రివర్గం భేటీ*
*🍥ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే(కుల సర్వే), ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు సంబంధించి ఏకసభ్య కమిషన్ నివేదికపై చర్చించేందుకు ఈనెల 4న ఉదయం 11 గంటలకు శాసనసభ, శాసనమండలి ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. సమావేశాలకు ముందు అసెంబ్లీ కమిటీ హాలులో ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రిమండలి సమావేశమై ఈ రెండు నివేదికలపై చర్చించి, ఆమోదించనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల ఖరారుపై కీలకంగా మారిన సామాజిక ఆర్థిక సర్వే నివేదికను ప్రణాళిక శాఖ ఆదివారం బీసీ మంత్రివర్గ ఉపసంఘానికి అందజేసింది. నివేదికలోని ముఖ్యాంశాలు, ఇతర వివరాలను సోమవారం ఉపసంఘం లోతుగా చర్చించనుంది. అనంతరం ఉపసంఘం తమ నివేదికను మంగళవారం జరిగే సమావేశంలో మంత్రివర్గానికి సమర్పించనుంది. మరోవైపు ఎస్సీ వర్గీకరణపై నియమించిన జస్టిస్ షమీమ్ అక్తర్ ఏకసభ్య కమిషన్ తమ నివేదికను ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘానికి అందించనుంది. అందులోని సిఫార్సులపై మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు చర్చించి క్యాబినెట్‌కు నివేదిస్తారు.*
*Click here to Join*
https://whatsapp.com/channel/0029Va5HyFoFMqreW1ZoJp3m