⚡SchoolEdu 👈 Join Now
February 3, 2025 at 03:41 AM
*🔊రెండు వారాల్లోపు ‘స్థానిక’ ఎన్నికల షెడ్యూల్*
*🔹మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి*
*🔶నిరుపేదలకు న్యాయం చేయడానికే తమ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని వెల్లడి*
*🍥వైరా, న్యూస్‌టుడే: స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ రెండు వారాల్లోపు రాబోతోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా వైరా మండలంలోని విప్పలమడకలో అనారోగ్యంతో మృతిచెందిన ఓ మహిళ కుటుంబ సభ్యులను ఆదివారం మంత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్థానికులతో మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్లను పూర్తిగా అర్హులకే కేటాయిస్తామని, ఎవరూ అధైర్యపడొద్దన్నారు. అధికారం ఉంది కదా అని ఎవరికి పడితే వారికి ఇచ్చే పరిస్థితి లేదని పేర్కొన్నారు*
*✡️నిరుపేదలకు న్యాయం చేయడం కోసమే తమ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ రాబోతున్న తరుణంలో అర్హులకు అన్యాయం జరగకుండా చూడాలని, జాబితాపై ఎమ్మెల్యే స్థాయిలో సరిచూసుకోవాలన్నారు.*
*🌀ధాన్యం ఇంకా మిగిలినా అధికారులు కొనుగోలు చేయడం లేదంటూ రైతులు ఆయనకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడ నుంచి కలెక్టర్‌కు ఫోన్ చేసి ధాన్యం కొనుగోలు చేసేలా చూడాలని సూచించారు. ప్రతిధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు.*
*💥రైతుల సమస్యపై కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి*
*చిత్రంలో వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్*
*Click here to Join*
https://whatsapp.com/channel/0029Va5HyFoFMqreW1ZoJp3m
👍
1