⚡SchoolEdu 👈 Join Now
February 4, 2025 at 02:02 AM
*🔊డ్రగ్స్ కట్టడిలో టీజీన్యాబ్ మరో ముందడుగు*
*🔶‘మిత్ర-టీజీ’ పేరిట వాట్సప్ చాట్‌బాట్ రూపకల్పన*
*🔷విద్యాశాఖ అధికారులకు శిక్షణ*
*🍥ఈనాడు, హైదరాబాద్:రాష్ట్రంలో మాదకద్రవ్యాల రవాణా, వినియోగాన్ని కట్టడి చేసే క్రతువులో తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో (టీజీన్యాబ్) మరో ముందడుగు వేసింది. సాంకేతిక అస్త్రం ప్రయోగించడం ద్వారా పిల్లల ప్రవర్తనలో మార్పులను గమనించేలా విద్య, ఐటీశాఖల సహకారంతో.. కృత్రిమ మేధ సాయంతో ‘మిత్ర-టీజీ’ వాట్సప్ చాట్‌బాట్‌ను అభివృద్ధి చేసింది. దీన్ని క్షేత్రస్థాయిలో అమలుచేసేందుకు హైదరాబాద్ ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీఐలో సోమవారం జిల్లా, మండల విద్యాశాఖాధికారులు, ప్రైవేటు పాఠశాలల ప్రతినిధులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా టీజీ న్యాబ్ ఎస్పీ సాయి చైతన్య ‘మిత్ర-టీజీ’ పనితీరును వివరించారు.‘ఉపాధ్యాయులు, అధ్యాపకులు విద్యార్థుల ప్రవర్తనలో మార్పులను గమనిస్తూ..ఈ చాట్‌బాట్‌లో చాటింగ్ చేయడం ద్వారా కారణాలను అంచనా వేయవచ్చు. ఎవరైనా డ్రగ్స్‌కు అలవాటుపడినట్టు అనుమానించే పక్షంలో ప్రమాద స్థాయినీ తెలుసుకోవచ్చు.టీజీన్యాబ్‌కు సకాలంలో సమాచారం అందజేసేందుకు, తద్వారా వారిని సరిదిద్దేందుకు అనువైన వాతావరణం కల్పించేందుకు వీలుపడుతుంది’ అని వివరించారు. డ్రగ్స్‌కు సంబంధించిన ఎలాంటి సమాచారమైనా టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబరు 1908, కంట్రోల్ సెంటర్ నంబరు 87126 71111 లేదా*
*[email protected]*
*సమాచారం అందించాలని సూచించారు.కార్యక్రమంలో ఐటీ విభాగం ఎమర్జింగ్ టెక్నాలజీస్ డైరెక్టర్ రమాదేవి, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఇ.వి.నరసింహారెడ్డి, మనస్తత్వ విశ్లేషకురాలు రోషిణి తదితరులు పాల్గొన్నారు.*
*Click here to Join*
https://whatsapp.com/channel/0029Va5HyFoFMqreW1ZoJp3m