⚡SchoolEdu 👈 Join Now
February 4, 2025 at 02:02 AM
*🔊దివ్యాంగులందరికీ రాత సహాయకులు*
*🔶40% వైకల్యం నిబంధన తొలగించిన సుప్రీంకోర్టు*
*🍥దిల్లీ: వివిధ పరీక్షలకు హాజరయ్యే దివ్యాంగులంతా రాత సహాయకులను పొందవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. ప్రామాణిక 40% వైకల్యం ఉన్నట్లు ధ్రువీకరణపత్రం పొందిన వారికి మాత్రమే ఇప్పటివరకు రాత సహాయకులను కోరే అర్హత ఉంది. ఈ నిబంధనను తొలగిస్తూ జస్టిస్ జె.బి.పార్దీవాలా, జస్టిస్ ఆర్.మహదేవన్‌ల ధర్మాసనం సోమవారం తీర్పు ఇచ్చింది. ప్రామాణిక వైకల్యంతో సంబంధంలేకుండా పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులందరికీ రాత సహాయకులను సమకూర్చాలని కేంద్రానికి స్పష్టం చేసింది. కేంద్రం 2022 ఆగస్టు 10న జారీ చేసిన అంతర్గత ఉత్తర్వులను పునఃపరిశీలించి దివ్యాంగులపై విధించిన ఆంక్షలను తొలగించడంతోపాటు వైకల్యం నిబంధనలను సహేతుకంగా సడలించాలని ధర్మాసనం తెలిపింది. రాత సహాయకులకు అందజేసే ధ్రువీకరణపత్రం చెల్లుబాటు గడువును ప్రస్తుతమున్న 6 నెలల నుంచి పొడిగించాలని ధర్మాసనం సూచించింది. పరీక్షకు హాజరవ్వడానికి కాస్త ముందుగానే అభ్యర్థికి, రాత సహాయకుడి మధ్య పరిచయం ఏర్పడటానికి సమయం ఇవ్వాలని తెలిపింది. తన ఆదేశాల అమలుకు రెండు నెలల గడువు విధించింది. బ్యాంకు ఉద్యోగుల నియామక పరీక్ష రాసేందుకు సహాయకుడిని సమకూర్చాలని కోరుతూ గుల్షన్ కుమార్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ తీర్పు వెలువరించింది.*
*Click here to Join*
https://whatsapp.com/channel/0029Va5HyFoFMqreW1ZoJp3m