⚡SchoolEdu 👈 Join Now
February 4, 2025 at 02:02 AM
*🔊అంగన్‌వాడీ ఖాళీలు @ 10,000!* *🔶టీచర్లకే ఆయాల పనీ* *🔷పోస్టుల భర్తీపై పట్టించుకోని సర్కారు* *🔶రిటైర్డ్‌ టీచర్లకు అందని బెనిఫిట్లు* *🔷హామీలకే పరిమితమైన కాంగ్రెస్‌* *🍥హైదరాబాద్‌, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో అంగన్‌వాడీల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత మరీ దుర్భరంగా మారింది. అనేక సమస్యలు అంగన్‌వాడీలను పట్టి పీడిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా టీచర్లు, ఆయాల పోస్టులు మొత్తం 71,400 ఉండగా, అందులో సుమారు 10వేలకు పైగా ఖాళీగా ఉన్నట్టు సమాచారం. వీటిని భర్తీ చేసేందుకు సర్కారు ఎలాంటి చర్యలకు పూనుకోకపోవడం గమనార్హం. నిరుడు 65 ఏండ్లు దాటిన టీచర్లు, ఆయాల ఉద్యోగ విరమణతో 8వేలు, మరణించడం, రాజీనామా, అనారోగ్యం తదితర కారణాలతో వెళ్లిన వారితో 2వేల పోస్టులు ఖాళీ అయ్యాయి. పెద్ద సంఖ్యలో ఖాళీలు ఏర్పడినా ఇప్పటి వరకు భర్తీ కోసం ప్రభుత్వం ముందడుగు వేయటం లేదని తెలంగాణ అంగన్‌వాడీ టీచర్ల సంఘం రాష్ట్ర నాయకురాలు నిర్మల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.* *💥టీచర్లపై అదనపు భారం..* *🌀అంగన్‌వాడీల్లో ఏర్పడిన ఖాళీలతో టీచర్లపై అదనపు పనిభారం పడింది. కొన్ని కేంద్రాల్లో ఆయాలు చేయాల్సిన పనులు కూడా టీచర్లే నిర్వహిస్తున్నారు. ఇలా ఒక్కో టీచర్‌ రెండు, మూడు కేంద్రాల్లో విధులు నిర్వర్తిస్తున్నట్లు సమాచారం. దీంతో ఏ కేంద్రంలోనూ సరిగ్గా విధులు నిర్వర్తించలేకపోతున్న ఆ సంఘం నాయకులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఖాళీల భర్తీ విషయమై పలుసార్లు సంబంధిత శాఖ మంత్రి సీతక్కతోపాటు అధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టింపు కరువైందని మండిపడుతున్నారు.* *💥అంగన్‌వాడీ టీచర్ల డిమాండ్లు ఇవే..* *➡️అంగన్‌వాడీ కేంద్రాల్లోని ఖాళీలను భర్తీ చేయాలి* *➡️టీచర్లపై అదనపు పనిభారాన్ని తగ్గించాలి* *➡️పీఎంశ్రీ స్కూళ్లలో అంగన్‌వాడీ టీచర్లనే తీసుకోవాలి* *➡️రిటైర్మెంట్‌ బెనిఫిట్లు వెంటనే విడుదల చేయాలి* *➡️అంగన్‌వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు నిర్మించాలి.* *➡️టీచర్లకు రూ.18 వేల వేతనం ఇచ్చి, నాల్గో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలి.* *Click here to Join* https://whatsapp.com/channel/0029Va5HyFoFMqreW1ZoJp3m

Comments