⚡SchoolEdu 👈 Join Now
                                
                            
                            
                    
                                
                                
                                February 4, 2025 at 02:02 AM
                               
                            
                        
                            *🔊Cooking Oil: వాడిన నూనె మళ్లీ వాడుతున్నారా ?*
*🔶అధికంగా వినియోగిస్తే ఆరోగ్య సమస్యలొస్తాయని మీకు తెలుసా?*
*🔷వంటనూనెల వినియోగంపై కేంద్రం సర్వే*
*🔶ఆన్‌లైన్‌లో అభిప్రాయాలు చెప్పడానికి 23 వరకూ గడువు*
*🍥ఈనాడు, హైదరాబాద్: ఇంట్లో నిత్యం వేపుళ్లకు వాడిన వంటనూనె మళ్లీ వాడుతున్నారా?.. వంటనూనెలు అధికంగా వాడితే ఆరోగ్య సమస్యలొస్తాయని మీకు తెలుసా?  డీప్ ఫ్రై(బాగా వేయించిన) ఆహారాన్ని మీ ఇంట్లో తరచూ తింటారా? అని కేంద్రం ప్రజలను అడుగుతోంది. దేశంలో వంటనూనెల వినియోగం పెరుగుతుండటం, దేశీయంగా నూనెల కొరత నేపథ్యంలో తొలిసారి ప్రజల నుంచి వీటిపై సమగ్ర సమాచార సేకరణకు ప్రత్యేకంగా సర్వే చేపట్టింది. భారత అర్ధ, గణాంకశాఖ వెబ్‌సైట్‌లో ఈ సర్వేకు సంబంధించిన 24 ప్రశ్నలను ఉంచింది. ఆన్‌లైన్‌లో మీ అభిప్రాయాలు చెప్పడానికి ఈ నెల 23 వరకూ గడువు ఇచ్చింది. కొన్ని ప్రశ్నలకు అవును, కాదు అని.. కొన్నింటికి నిర్దిష్ట సమాధానాలను ప్రశ్న కిందనే ఉంచింది. వాటిలో ఏదో ఒకటి ఎంపిక చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తే మీ నుంచి సమాచారం ప్రభుత్వానికి లభిస్తుంది. దేశ చరిత్రలోనే తొలిసారి ఇలా ప్రజల నుంచి వంటనూనెల వినియోగంపై సర్వే చేపట్టడం విశేషం. రోడ్లపై ఆహార పదార్థాలు తయారుచేసే వ్యాపారులు, కొన్ని చిన్న చిన్న హోటళ్లలో మళ్లీ మళ్లీ వంటనూనెలను మరగపెట్టి వినియోగిస్తున్నట్లు ఆహార నాణ్యత విభాగం అధికారులు గుర్తిస్తున్నారు. ఇలా గంటలకొద్ది మరగపెట్టి వినియోగించడం, ఒకసారి వాడిన దానిని మళ్లీ మళ్లీ వాడటం వల్ల పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటి వాడకంపై ప్రజలకు ఎంతమేర అవగాహన ఉందనే సమాచారాన్ని నేరుగా తెలుసుకోవాలని ఈ సర్వేను చేపట్టినట్లు తెలుస్తోంది.*
*Click here to Join*
https://whatsapp.com/channel/0029Va5HyFoFMqreW1ZoJp3m