⚡SchoolEdu 👈 Join Now
February 4, 2025 at 02:02 AM
*🔊వీఆర్వో, వీఆర్‌ఏల అంతర్‌బదిలీపై అధ్యయనం*
*🔶డిప్యూటీ సర్వేయర్లుగా నియమించడానికి కసరత్తు*
*🍥ఈనాడు, హైదరాబాద్: భూమి కొలతలు-దస్త్రాల నిర్వహణ శాఖలో డిప్యూటీ సర్వేయర్లుగా గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వో), గ్రామ రెవెన్యూ సహాయకులను (వీఆర్‌ఏ) నియమించడానికి ఉన్న నిబంధనలపై రెవెన్యూశాఖ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం డిప్యూటీ సర్వేయర్ల నియామకంలో వీఆర్వో, వీఆర్‌ఏలను తీసుకునేందుకు చర్యలు చేపడుతుండగా.. ఈ ప్రక్రియ అమలుకు ఉన్న విధివిధానాలపై ఇటీవల సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ రెవెన్యూ శాఖను వివరణ కోరారు. దీంతో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్-2001లోని ఏ నిబంధనల ప్రకారం వారిని తీసుకోవచ్చా, ప్రస్తుతం ఇతర శాఖల్లో పనిచేస్తున్న వీఆర్వో, వీఆర్‌ఏలను ఏ విభాగం నుంచి డిప్యూటేషన్‌పై సర్వే విభాగానికి తీసుకోవచ్చా, అంతర్ బదిలీల రూపంలో ఒక విభాగం నుంచి మరొక విభాగానికి బదిలీ చేసి డిప్యూటీ సర్వేయర్లుగా నియమించేందుకు విధానపరమైన నిబంధనలు ఉన్నాయా.. అనేది అధ్యయనం చేయాలంటూ అధికారులను రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌మిత్తల్ తాజాగా ఆదేశించారు. పూర్వ వీఆర్వో, వీఆర్‌ఏల నుంచి వెయ్యి మందిని డిప్యూటీ సర్వేయర్లుగా నియమించేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిన సంగతి తెలిసింది.*
*Click here to Join*
https://whatsapp.com/channel/0029Va5HyFoFMqreW1ZoJp3m