⚡SchoolEdu 👈 Join Now
February 4, 2025 at 02:02 AM
*🔊అల్పాహార పథకానికి నిధులివ్వాలి*
*🔶కేంద్రాన్ని కోరిన మంత్రి సీతక్క*
*🍥ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు ఉదయం అల్పాహారం అందించేందుకు నిధులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క కోరారు. సోమవారం దిల్లీలో కేంద్ర శిశుసంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవిని కలిసి సీతక్క వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణకు నిధులు పెంచాలని కోరారు. కరోనా అనంతరం చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని, వీరికి పోషకాహారం అందించాల్సిన అవసరముందని తెలిపారు. ఈ పథకంతో 8.6లక్షల మంది చిన్నారులకు ప్రయోజనం కలుగుతుందని, అందుకు రూ.206 కోట్లు అవసరమని వివరించారు. ఈ పథకంపై బడ్జెట్ సమావేశాల్లో చర్చిస్తానని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు మంత్రి సీతక్క తెలిపారు. కేంద్రమంత్రిని కలిసిన వారిలో శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ కాంతివెస్లీ, తెలంగాణ ఫుడ్స్ ఛైర్మన్ ఎం.ఏ.ఫహీం ఉన్నారు.*
*Click here to Join*
https://whatsapp.com/channel/0029Va5HyFoFMqreW1ZoJp3m