⚡SchoolEdu 👈 Join Now
February 4, 2025 at 02:02 AM
*🔊ఈసారి వడ్డీరేట్లు తగ్గుతాయ్!*
*🔶రెపో రేటు పావు శాతం దిగిరావచ్చు*
*🔷ఆర్బీఐ ద్రవ్యసమీక్షపై నిపుణుల అంచనా*
*🍥ముంబై, ఫిబ్రవరి 3: త్వరలో వడ్డీరేట్లు పావు శాతం తగ్గుతాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష బుధవారం మొదలు కానుండగా.. శుక్రవారం ఫలితం తేలనున్నది. ఈ క్రమంలోనే రెపో రేటును ఈసారి ఆర్బీఐ 25 బేసిస్ పాయింట్లు తగ్గించే వీలున్నదని ఆర్థిక, బ్యాంకింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవలి బడ్జెట్ నిర్ణయాలకు ఊతమివ్వడంలో భాగంగా రెండేండ్ల తర్వాత రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్ల కోతకు దిగవచ్చన్న విశ్లేషణలు వస్తున్నాయి మరి.*
*💥బడ్జెట్‌కు ఊతం..*
*🌀వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025-26)గాను ఈ నెల 1న పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కొత్త ఆదాయ పన్ను (ఐటీ) విధానం కింద రూ.12 లక్షలదాకా వార్షిక ఆదాయం ఉన్నవారు ఎలాంటి పన్నులు చెల్లించనవసరం లేదని పేర్కొన్న సంగతీ విదితమే. స్టాండర్డ్ డిడక్షన్ రూ.75వేలతో కలిపి రూ.12.75 లక్షలదాకా ఐటీ మినహాయింపు లభిస్తున్నది. మార్కెట్‌లో తగ్గిన కొనుగోలు, వినిమయ శక్తిని పెంచేందుకు తమ నిర్ణయం కలిసొస్తుందన్న ఆశాభావాన్నీ మంత్రి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈసారి ద్రవ్యసమీక్షలో ఆర్బీఐ కూడా తన వంతుగా కీలక వడ్డీరేట్లను పావు శాతం మేర తగ్గించవచ్చని మెజారిటీ నిపుణులు అంటున్నారు. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ రికార్డు కనిష్ఠాలకు పడిపోతున్న వేళ, దేశ జీడీపీ వృద్ధిరేటు మందగమనం దిశగా అడుగులు వేస్తున్న క్రమంలో వడ్డీరేట్ల తగ్గింపు మేలు చేయగలదన్న విశ్వాసాన్ని వారు కనబరుస్తున్నారు.*
*💥రెండేండ్ల తర్వాత..*
*💠2023 ఫిబ్రవరిలో రెపో రేటును 6.5 శాతానికి పెంచిన ఆర్బీఐ.. మళ్లీ ఆ తర్వాత దాని జోలికి వెళ్లనే లేదు. ద్రవ్యోల్బణం కట్టడి లక్ష్యంలో భాగంగా వడ్డీరేట్లను గరిష్ఠ స్థాయిల్లోనే కొనసాగిస్తున్నది. దీంతో గృహ, వాహన, వ్యక్తిగత తదితర రుణాలపై అధిక వడ్డీరేట్లనే బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)లు అనుసరిస్తున్నాయి. ఫలితంగా ఆయా రుణగ్రహీతలు, వివిధ వ్యాపార రంగాలు ప్రభావితమవుతున్నాయి. ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గిస్తే రియల్టీ, ఆటోతోపాటు పలు రంగాల్లో తిరిగి అమ్మకాలు పుంజుకుంటాయని వ్యాపార, పారిశ్రామిక వర్గాలు ఆశిస్తున్నాయి. నిజానికి కరోనాతో దిగాలుపడిన దేశ ఆర్థిక వ్యవస్థలో ఉత్తేజం నింపేందుకు ఆర్బీఐ వడ్డీరేట్లను భారీగా తగ్గించింది. అయితే ఆ తర్వాత విజృంభించిన ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయాలని వరుసగా పెంచుకుంటూపోయింది. ఈ క్రమంలో గత ద్రవ్యసమీక్షలో ఆర్బీఐ తన ద్రవ్యవైఖరిని మార్చుకున్నది. రాబోయే ద్రవ్యసమీక్షల్లో వడ్డీరేట్లు తగ్గుతాయని అప్పటి ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సంకేతాలు కూడా ఇచ్చారు. మరి కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మల్హోత్రా నాయకత్వంలో ఇదే తొలి ఆర్బీఐ ద్రవ్యసమీక్ష కావడం గమనార్హం.*
*Click here to Join*
https://whatsapp.com/channel/0029Va5HyFoFMqreW1ZoJp3m