Nara Lokesh | TDP

70.8K subscribers

Verified Channel
Nara Lokesh | TDP
February 3, 2025 at 02:02 PM
ఇంజనీరింగ్ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమయ్యాను. ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను నా దృష్టికి తీసుకొచ్చారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా విద్యావ్యవస్థ నిర్వీర్యమైంది, ప్రాథమిక స్థాయి నుంచే పరివర్తన తేవాలన్నది మా లక్ష్యం. ఇంటర్మీడియట్ విద్యలో గత 10 సంవత్సరాలుగా సంస్కరణలు లేవు, నేను మంత్రి అయ్యాక సంస్కరణలకు శ్రీకారం చుట్టామని వారికి తెలిపాను. అన్ని విద్యాసంస్థల్లో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెరగాల్సి ఉంది. విద్యావ్యవస్థలో నైతిక విలువలతో కూడిన సంస్కరణలు తేవాలన్నది నా ఉద్దేశం. సంస్కరణలు అమలుచేసే క్రమంలో ఏవైనా తప్పులు దొర్లితే సరిదిద్దుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలిపాను. ప్రజా ప్రభుత్వంలో ఏకపక్ష నిర్ణయాలు ఉండవని, చర్చలు, సంప్రదింపుల ద్వారానే ఏదైనా విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పాను. ఈ ఏడాది ఆర్ టిఎఫ్ స్కాలర్ షిప్ లకు సంబంధించి తొలివిడతలో రూ.788 కోట్లకు గాను, ఇప్పటికే రూ.571.96 కోట్లు విడుదల చేశామని, రెండు, మూడు రోజుల్లో మిగిలిన రూ.216.04 కోట్లు కూడా విడుదల చేస్తామని తెలిపాను. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్, ఆర్ అండ్ డి, ఇన్నొవేషన్స్ పై దృష్టి సారించాలని చెప్పాను. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్లేస్ మెంట్స్ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని కోరాను. విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకురావాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత ఒక రోజు వర్క్ షాప్ నిర్వహించి ఇంజనీరింగ్ విద్య నాణ్యత పెంచేందుకు అందరి అభిప్రాయాలు తీసుకుంటామని తెలిపాను. ఇంజినీరింగ్ కళాశాలలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చాను. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, పర్చూరి అశోక్ బాబు, వేపాడ చిరంజీవి, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజెస్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు వాసిరెడ్డి విద్యాసాగర్, ఇతర సభ్యులు పాల్గొన్నారు. #andhrapradesh
👍 ❤️ 🙏 👌 👏 💛 ✌️ 😂 😢 🫡 91

Comments