Nara Lokesh | TDP
February 3, 2025 at 05:23 PM
ఏపీ ప్రైవేట్ డిగ్రీ కాలేజి మేనేజ్మెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమయ్యాను. ప్రైవేట్ డిగ్రీ కాలేజి యాజమాన్యాల విజ్ఞప్తి మేరకు డిగ్రీ కళాశాలలకు ప్రతిఏటా అఫ్లియేషన్ స్థానంలో ఐదేళ్లు అఫ్లియేషన్ విధానాన్ని తెచ్చేందుకు అంగీకరించాను...
అఫ్లియేషన్ ఫీజు ఒక్కో యూనివర్సిటీ పరిధిలో ఒక్కొక్క రకంగా ఉంటోంది. రాష్ట్రమంతటా కామన్ ఫీజు విధానాన్ని అమలుచేసే అంశాన్ని ప్రవేశపెట్టండి. పాత డిగ్రీ కాలేజిలతో పాటు కొత్త కళాశాలలకు కూడా నిర్ణీత సమయంలో అదనపు కోర్సులకు అనుమతి ఇచ్చేలా జీవో నెం.36ని సవరించండి. రెగ్యులేటరీ కమిషన్ పరిధిలో ఫీజుల నిర్ణయం వల్ల ఇబ్బందులు పడుతున్నాం. దీనివల్ల క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించలేకపోతున్నాం. వయబిలిటీ ఆధారంగా బేసిక్ ఫీజు నిర్ణయం జరగాలి. డిగ్రీ కళాశాలల్లో ఆన్లైన్ అడ్మిషన్ విధానంలో మార్పులు తేవాలి. ఇంటర్మీడియట్ అడ్మిషన్ తరహాలో డిగ్రీ అడ్మిషన్లు చేపట్టే విధానాన్ని పరిశీలించండి అంటూ తాము ఎదుర్కుంటున్న అనేక సమస్యలను ఏపీ ప్రైవేట్ డిగ్రీ కాలేజి మేనేజ్మెంట్స్ అసోసియేషన్ సభ్యులు నా దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్, వేపాడ చిరంజీవి, పర్చూరి అశోక్ బాబు, భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి, ప్రైవేట్ డిగ్రీ కాలేజి మేనేజ్మెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
👍
❤️
🙏
💛
👌
✊
🌸
🎉
😂
😢
129