Yeluri Sambasiva Rao
February 7, 2025 at 11:56 AM
*యువత మేలుకో ఆరోగ్యమే మహాభాగ్యం*
ఆరోగ్యమే మహాభాగ్యం అని ప్రతి ఒక్కరికి నడకే ఆరోగ్యానికి వరమని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే ఏలూరి తన క్యాంపు కార్యాలయంలో మార్నింగ్ వాక్ నిర్వహించారు అనంతరం కొద్దిసేపు జిమ్ చేశారు. అనంతరం క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఏలూరి యూత్ ఫిట్నెస్ సెంటర్ కు వచ్చే పలువురు యువతతో ఎమ్మెల్యే ఏలూరి రచ్చబండ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా యువత ఆరోగ్యం పై దృష్టి సారించాలన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాయామం చేయాలని ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించవచ్చు అన్నారు. ప్రజలకు ఏలూరి యూత్ ఫిట్నెస్ సెంటర్ ద్వారా మంచి సదా అవకాశం కల్పించామని ప్రతి ఒక్క యువత ఈ వ్యాయామశాలను ఉపయోగించుకొని ఆరోగ్యానికి బాటిలు వేసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించి దేహదారుఢ్యం పెంపొందించుకునేలా చూడాలన్నారు. దేహదారుఢ్యం క్రీడారంగంలో మంచి ఫలితాలు సాధించవచ్చని దీనితోడు ఉద్యోగాల్లో మంచి అవకాశాలు వస్తాయన్నారు.
#yelurisambasivarao #mlaparchur
#manaparchurmanayeluri
#yeluripepolesleader
#teamyeluri
❤️
👍
3