Vasamsetti Subash
February 16, 2025 at 12:47 PM
16-2-2025. రామచంద్రపురం. *"పేరాబత్తుల" గెలుపు కోరుతూ మంత్రి సుభాష్ తండ్రి సత్యం గారు పలు గ్రామాల్లో విస్తృత ప్రచారం*. *ప్రభుత్వ అభివృద్ధిని వివరిస్తూ.. ఓట్లు అభ్యర్థన* రామచంద్రపురం,ఫిబ్రవరి 16: ఈనెల 27న ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ను గెలిపించాలని కోరుతూ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారి తండ్రి కూటమి సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం గారు ఆదివారం పలు గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా వెల్ల, తాడిపల్లి, కాపవరం, కందుల పాలెం తదితర గ్రామాల్లో కూటమి నాయకులతో కలిసి నేరుగా పట్టభద్రులైన ఓటర్లను కలిసి ఎన్డీఏ కూటమి అభ్యర్థి రాజశేఖర్ కు ("1") మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ విజయం అందించాలని కరపత్రాలు పంచుతూ ఓట్లు అభ్యర్థించారు. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 లక్ష్యంగా కూటమి ప్రభుత్వం రాష్ట్ర పురోభివృద్ధికి కృషి చేస్తుందని, రాష్ట్ర అభివృద్ధికి పట్టభద్రులు సహకారం అందించాలని కోరారు. పట్టభద్రుల సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్న కూటమి అభ్యర్థిని బలపరచి, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. విద్యావంతుల చేతుల్లోనే రాష్ట్ర భవిత ఆధారపడి ఉందని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి పట్టభద్రులు మద్దతు ఇవ్వాలని కోరారు. నిరుద్యోగ నిర్ములన, యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పన, విద్యారంగ పటిష్టత, శాంతియుత పాలన, అభివృద్ధి, సంక్షేమం కోసం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్ కు మొదటి ప్రాధాన్యత("1") ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

Comments