Bonda Uma | TDP

1.7K subscribers

Verified Channel
Bonda Uma | TDP
February 3, 2025 at 10:30 AM
కాలేజీలకే నేరుగా ఫీజులు చెల్లించే విధానాన్ని మార్చేసి తల్లుల ఖాతాలకే అన్నాడు. తల్లుల ఖాతాలకు ఫీజు డబ్బులు జమచేయకుండా టార్చర్ పెట్టాడు. డిసెంబర్ 17, 2023న నెల్లూరు జిల్లా కావలిలో ఫీజ్ రీయింబర్స్ మెంట్ డబ్బులు అందలేదని దాదాపు 30 మంది ఫైనల్ ఇయర్ నర్సింగ్ విద్యార్ధులను నర్సింగ్ కళాశాల బయటకు పంపేసింది. చిత్తూరు జిల్లాలోని ఓ ప్రముఖ కాలేజీ విద్యార్థికి రూ.57 వేల ఫీజు బకాయిని చెల్లించాలని లీగల్ నోటీసు పంపింది. విజయవాడలోని ఓ కాలేజీ రూ.60 వేల ఫీజు కట్టాలని ఓ విద్యార్థికి కాలేజీ యాజమాన్యం తాఖీదు ఇచ్చింది. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు రాకపోవడంతో 2022లో శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన ఓ యువతి… ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ ముందే కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆరోజు పట్టించుకోని జగన్ కు ఇప్పుడు విద్యార్థులు గుర్తొచ్చారా? #feesdongajagan #psychofekujagan #andhrapradesh
👍 4

Comments