🚩రాయలసీమ ఎక్స్ ప్రెస్ న్యూస్🚩
February 15, 2025 at 04:18 PM
కోటీశ్వరుడు.. కానీ విరిగిన ఫోనే వడతాడు.. ఎందుకంటే....
Sadio Mane ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ ఆటగాడు, అతను 2019 సంవత్సరానికి ఆఫ్రికా యొక్క ఉత్తమ ఆటగాడిగా ఎంపికయ్యాడు, అతని వయసు 27 సంవత్సరాలు. ఇతడు వారానికి 1 కోటి 40 లక్షలు, సంవత్సరానికి 27 కోట్ల రూపాయలు సంపాదిస్తాడు.
అతను చాలా సార్లు, చాలాచోట్ల విరిగిన ఫోన్‌తో కనిపించాడు. కోటీశ్వరుడై ఉండి విరిగిన ఫోన్ వాడుతున్నాడని చాలా మంది అతన్ని ఎగతాళి చేశారు.
ఒక ఇంటర్వ్యూలో, ఫోన్‌ను మార్చడం గురించి అడిగినప్పుడు, నేను దాన్ని రిపేర్ చేయించుంటా అని సమాధానం ఇస్తాడు, యాంకర్ నవ్వుతూ మీరు కొత్తది ఎందుకు కొనుక్కోలేరు అని అడిగితే, నేను అలాంటివి వెయ్యి, 10 ఫెరారీ, 2 జెట్ విమానాలను, డైమండ్ గడియారాలు కొనగలను. అయితే ఇవన్నీ నాకు ఎందుకు ??
నేను పేదరికాన్ని చూశాను, నేను చదవలేకపోయాను, ఆ కారణంగా, ప్రజలు చదువుకునేలా నేను పాఠశాలలు నిర్మించాను, ప్రజలు ఫుట్‌బాల్ నేర్చుకునేలా స్టేడియాలు నిర్మించాను.
నాకు బూట్లు ఉండేవి కావు, బూట్లు లేకుండా ఆడేవాడిని, మంచి బట్టలు లేవు, తినడానికి తిండి ఉండేది కాదు ఈ రోజు నేను చాలా సంపాదించాను, కాబట్టి నేను దానిని నా ప్రజలతో పంచుకోవాలనుకుంటున్నాను. సాడియో మానే సెనెగల్ (పశ్చిమ ఆఫ్రికా) కు చెందినవాడు మరియు తన దేశ ప్రజల కోసం చాలా చేస్తున్నాడు.
https://whatsapp.com/channel/0029VaOcoLL0Qeai6TcRRX42