వైద్య నిలయం
January 23, 2025 at 04:21 PM
తమిళ్ లో కార్తి హీరోగా వచ్చిన సర్దార్ అనే సినిమా చూశారా? యూట్యూబ్‌లో ఉంది వీలైనంత త్వరగా చూడండి. నేనైతే ఆ సినిమా చూడకముందే ఓ రెజల్యూషన్ తీసుకున్నాను. దాదాపు రెండేళ్లైంది వాటర్ బాటిల్స్ కొనటం మానేసి. (మరీ తప్పని సరైతే తప్ప కొనను) హొటల్, రెస్ట్రంట్స్‌లో కూడా "నాకు బాటిల్ వద్దు రెగ్యులర్ వాటర్ కావాలి" అని అడుగుతున్నాను. నా బ్యాగ్‌లో బాటిల్ పెట్టుకొని నా నీళ్లని నేనే తీసుకుపోతున్నాను. (ఇది నా గొప్పతనం అని చెప్పుకోవట్లేదు, నాకనిపించింది మాత్రం చేస్తున్నాను) ఎందుకంటే.... మనతో నీళ్లు "కొనిపించటానికి" మామూలు ప్రయత్నాలు జరగటం లేదు. కార్పోరెట్ సమాజం మనమీద బలంగానే దృష్టి పెట్టింది. *మీరు మనిచినీళ్లు తాగకుండా ఎంతసేపు ఉండగలరు?* మామూలుగా అయితే ప్రతీరోజుకీ ఒక మనిషి కనీసం 3-4 లీటర్ల మంచినీళ్లు తాగాల్సిందే. అయితే మనం తాగే నీళ్లన్నీ మంచినీళ్లేనా? అసలు మంచినీళ్లు అంటే ఏమిటి? టాప్‌లో వచ్చే నీళ్లా లేకపోతే మినరల్ వాటర్ పేరుతో మనం మార్కెట్లో కొనే ప్యాకేజ్డ్ వాటరా? దీనికంటే ముందు మనం ఇంకో విషయం తెలుసుకోవాలి. మంచినీళ్ల పేరుతో పెద్ద స్కామ్ జరుగుతోంది. అదీ చిన్నా చితకా స్కామ్‌కాదు దీనివిలువ లక్షల కోట్లు. మీరు చదువుతున్నది నిజమే మనం తాగే నీళ్లమీద రకరకాల కాన్స్పైరసీ థియరీలతో వాటర్ కంపెనీలు దోచుకుంటున్న డబ్బు ఒక సంవత్సరానికి 20లక్షల కోట్లకంటే ఎక్కువే. *గడిచిన పదేళ్ల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల వాడకం ఏకంగా 70 శాతానికి పైగా పెరిగింది. అత్యంత వేగంగా విస్తరిస్తున్న మార్కెట్లలో ఇది కూడా ఒకటి. అందుకు నిదర్శనం కొన్నేళ్ల క్రితం వరకు ప్లాస్టిక్ వాటర్ బాటిల్ నీళ్లు కొనుక్కొని తాగడం కేవలం సంపన్నులకు మాత్రమే పరిమితమై ఉండేది. కానీ ఇప్పుడు ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చేశాయి. చిన్న చిన్న పట్టణాల్లో కూడా ప్యాకేజ్డ్ వాటర్ ప్లాంట్లు కనిపిస్తున్నాయి.* జర్మనీకి చెందిన ప్రముఖ డేటా విశ్లేషణ సంస్థ స్టాటిస్టా అందించిన వివరాల ప్రకారం 2023లో ప్రపంచ వ్యాప్తంగా సుమారు 28 లక్షల కోట్ల రూపాయల ప్లాస్టిక్ బాటిళ్ల నీటి వ్యాపారం జరిగింది. వచ్చే ఆరేళ్లలో అంటే 2030 నాటికి ఇది ఏకంగా 40 లక్షల కోట్ల నుంచి 42 నుంచి 43 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే అమెరికా, చైనా, మెక్సికో ఇండోనేషియా తదితర దేశాల్లో అధిక వినియోగం కనిపిస్తోంది. ఇప్పుడు ఇదే బాటలో మనదేశం కూడా చేరబోతోంది. 2022లో మన దేశంలో ప్యాకేజ్డ్ వాటర్ బాటిల్స్ మార్కెట్ వ్యాపారం విలువ సుమారు లక్ష 80 వేల కోట్లు , మరో ఆరేళ్లలో ఈ మార్కెట్ విలువ సుమారు 3లక్షల కోట్లకు చేరుకోవచ్చని అంచనా. అదండీ సంగతి... రోజుకో ప్యాకేజ్డ్ వాటర్ బాటిల్ కొనటంకంటే ఒకటే ఫ్రిడ్జ్ బాటిల్ కొని అందులో నీళ్లు నింపుకోండి. పూర్తిగ వద్దని చెప్పటంలేదుగానీ వీలైనంత వరకూ అవాయిడ్ చేయటమే బెటర్. ధన్యవాదములు 🙏 *మీ నవీన్ నడిమింటి* copied.🙏🙏
❤️ 🙏 👍 6

Comments