వైద్య నిలయం
2.9K subscribers
About వైద్య నిలయం
It should be noted that all the messages posted in this group are for basic health awareness among the members. Remedies and suggestions about various diseases are only to increase awareness among members..it is not a substitute for your doctor. Members should take note.*
Similar Channels
Swipe to see more
Posts
*ప్రవేట్ విద్యాసంస్థలు వైద్య సంస్థలు ఫీజుల రూపంలో ప్రజల రక్తం జలగల్లా పీల్చుక తాగుతున్న పట్టించుకోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు* ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థులు చదవడానికి ఇష్టపడటం లేదంటే విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటు విద్యాసంస్థల్లో చేర్చడానికి ఇష్టపడటం లేదంటే అది ప్రభుత్వం యొక్క అసమర్ధతకు నిదర్శనం ప్రభుత్వ వైద్యశాలలో ప్రజలు వైద్యం కోసం వెళ్లడానికి ఇష్టపడటం లేదంటే వాటిపైన ప్రజలకు నమ్మకం లేనట్లే ఇక్కడ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అలసత్వం అసమర్థత క్లియర్ గా కనబడుతుంది పైగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ విద్యాసంస్థల్ని ప్రైవేట్ వైద్య సంస్థల్ని ప్రోత్సహిస్తూ వారు ఎంత దోచుకున్నా కూడా పట్టించుకోవడం లేదు ఎందుకంటే వారి నుంచి ముడుపులు అందుతాయి కాబట్టి, తెలియదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రైవేట్ విద్యాసంస్థలు వైద్య సంస్థలు ఏ విధంగా ప్రజలను దోపిడీ చేస్తున్నాయో ఫీజుల నియంత్రణ ఎందుకు చేయలేకపోతున్నాయి దేశ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కన్నా ప్రైవేటు విద్యాసంస్థల వైద్య సంస్థల ప్రయోజనాలే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ముఖ్యంగా మారిపోయింది వాస్తవంగా ప్రభుత్వ విద్యాసంస్థలలో వైద్య సంస్థలలో పేద మధ్యతరగతి ప్రజలు మాత్రమే గతిలేక చేతిలో డబ్బు లేక విద్యను వైద్యాన్ని పొందుతున్నారు సంపన్నులు ప్రైవేటు విద్యాసంస్థల్లో ప్రభుత్వ విద్య సంస్థల్లో విద్యా వైద్యాన్ని పొందుతున్నారు అత్యధికంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో వైద్య సంస్థల్లో విద్యా వైద్యాన్ని పొందేది బీసీలు ఎస్సీలు, ఎస్టీలు మాత్రమే అతి కొద్ది మంది మాత్రమే ఓసీలు ఉంటారు అందుకే వీళ్ళంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిన్న చూపు నిర్లక్ష్యం దేశంలో ఉన్న ప్రైవేటు విద్యాసంస్థలు వైద్య సంస్థలు 90% అగ్రకులాల వారివే అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి విద్యా వైద్య సంస్థలను ప్రోత్సహిస్తూ ఉంటాయి. వారు ఎన్ని అరాచకాలు చేసినా పట్టించుకోరు కేసులు బుక్కు కావు వాళ్ళని జైలుకు పంపరు ఇలాంటి నీచ రాజకీయాలు దేశంలో రాష్ట్రాలలో జరుగుచున్నవి కావున ప్రజలు అనవసరమైన ఉచిత పథకాలకు ఆశపడకుండా ఎన్నికల అప్పుడు విద్యా వైద్యాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే విద్యాసంస్థలను వైద్య సంస్థలను నిర్వహిస్తాయని చెప్పి ప్రైవేటు విద్యను వైద్యాన్ని రద్దు చేస్తామని చెప్పి మానిఫెస్టోలో పెట్టి ఎన్నికలకు వచ్చే పార్టీలకు మాత్రమే ప్రజలు ఓటు వేసినప్పుడే విద్యా వైద్యం అభివృద్ధి చెందుతుంది విద్యా వైద్యం అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే దేశము రాష్ట్రము అభివృద్ధి చెందుతుంది కావున ఓటర్లు చాలా జాగ్రత్తగా ఆలోచించి పైసలు పంచే రాజకీయ పార్టీల మోసగారితనాన్ని గుర్తించి ఓటు వేయాలని కోరుచున్నాను ధన్యవాదములు 🙏 మీ నవీన్ నడిమింటి https://t.me/vaidayanilayamNaveen
*Today Education information* *ఇకపై సర్టిఫికెట్లు పోయినా పర్లేదు..* *అపార్ ఐడి ఉంటే చాలు* దేశవ్యాప్తంగా ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులందరికీ ‘అపార్ ఐడీ’ అందించాలని ఇటీవల కేంద్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో విద్యాశాఖ ఆ దిశగా చర్యలు చేపట్టింది. వచ్చే జూన్ నాటికి ఈ ప్రక్రియ పూర్తిచేయాలని ఇప్పటికే అన్ని వర్సిటీలు, కళాశాలల యాజమాన్యాలను ఆదేశాలు జారీచేసింది. దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరికీ వన్ నేషన్-వన్ స్టూడెంట్ పేరిట 12 అంకెల ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ.. అదే అపార్ గుర్తింపు సంఖ్య ఇవ్వాలని కేంద్ర విద్యాశాఖ నిర్ణయించింది. అందులోభాగంగానే… అపార్ ఐడీలను రూపొందించడంలో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది అంబేద్కర్ యూనివర్సిటీ. ఇప్పటికే 75 శాతం అపార్ ఐడీలను క్రియేట్ చేసింది. విషయాన్ని రెండ్రోజుల క్రితం జాతీయ స్థాయిలో నిర్వహించిన సమీక్ష కార్యక్రమంలో రాష్ట్ర కళాశాల విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల విద్యార్ధులకు పూర్తి స్థాయిలో అపార్ ఐడీ క్రియేట్ చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్లుతున్నట్లు తెలిపారు. సాంకేతిక పరమైన సమస్యలు వస్తే నిపుణులు వెంటనే ఆ విద్యార్ధికి అవసరమైన సహాయాన్ని అందిస్తూ అపార్ ఐడీ పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. దీంతో కేంద్ర విద్యా శాఖ డిప్యూటీ సెక్రటరీ రోహిత్ త్రిపాటి… అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని అభినందించారు. 100 శాతం అపార్ ఐడీలు అతి త్వరలోనే పూర్తిచేసి రికార్డ్ క్రియేట్ చేయాలన్నారు. https://t.me/vaidayanilayamNaveen
🔸♦️🔹🔸♦️🔹🔸♦️🔹🔸 *సంతృప్తిగా... సంతోషంగా!* *మనిషికి ఉన్నది తృప్తి, పశువుకు తిన్నది తృప్తి* అని నానుడి. ఉండటం అనేదాన్ని ఆస్తిపాస్తులకు పరిమితం చేయకుండా, మానవత్వానికి జోడించి ఆలోచిస్తే తృప్తి అన్న మాట అర్థవంతమవుతుంది. కుటుంబ పోషణకు, నిత్యావసరాలకు సరిపోయేంత సంపదతో మనిషి తృప్తి పడగలిగితే అదే మనశ్శాంతి. తీర్చుకున్న కొద్దీ పెరిగే కొత్త కోరికల కుప్ప మనసు. దాన్ని గాడిలో పెట్టగలిగే మంత్రదండం బుద్ధి. ఆర్జించడం తప్పు కాదు. ఊటబావిలో ఊరే నీరల్లే ఉబికి వచ్చే కోరికలు తీర్చుకోవడం కోసమే ఆర్జించడం తప్పు. *పారమార్థిక చింతనను పక్కనపెట్టి, కేవలం ఆర్జించడమే ధ్యేయంగా, ఆశలు తీర్చుకోవడమే పరమార్థంగా బతికేవారికి చివరకు మిగిలేది అసంతృప్తే*. ఎందుకంటే, కష్టించి ఆర్జించిన సంపదను ధారపోసిన తరవాత, దాన్ని అనుభవించే వారసులనుంచి ఆశించిన ప్రేమ లభించడం ప్రశ్నార్ధకమే కనుక. తృప్తి ఎక్కడ ఉంటుందో చూపించే అక్షరజ్యోతులివి. తృప్తి అనేది ఒక మానసిక భావన. తామస ఆలోచనలకు తావివ్వని మనసు తేలికగా తృప్తి చెందుతుంది. https://t.me/vaidayanilayamNaveen పాండవులు అయిదూళ్లతో తృప్తి పడతారని చెప్పిన కృష్ణుణ్ని నమ్మని అహంకారి దుర్యోధనుడు. అతగాడి మనసును అభద్రతా భావం, అసూయ లొంగదీసుకుని అసంతృప్తికి, తద్వారా కురుక్షేత్రానికి దారితీశాయి. తృప్తి లేకపోవడం వల్లనే మకరందాన్ని అపరిమితంగా తాగుతూ పొద్దెరగని తుమ్మెద, కలువ ముడుచుకోవడాన్ని గమనించక, ఊపిరాడక మరణిస్తుంది. తృప్తిలేని వాడికి ఏది దొరికినా, ఎంత దొరికినా సంతోషం కలగదు. జీవితం ఆసాంతం అశాంతితోనే గడుస్తుంది. ఓ చలిరాత్రి వీధిలో పడుకున్న అభాగ్యుడికి దుప్పటి కప్పి వచ్చినప్పుడో, వైద్యం అందక అలమటిస్తున్న రోగికి సాయం అందించినప్పుడో, నిరుపేద విద్యార్థికి ఫీజు కట్టినప్పుడో, ఆ సాయం పొందినవారికన్నా, చేసినవారికి కలిగే తృప్తికి కొలమానం ఉండదు. ఉన్నదాంతో తృప్తి పడినప్పుడే ప్రశాంతంగా ఉండగలం. ఆ ప్రశాంతత లభించిన మనిషిని అనారోగ్యం త్వరగా దరిచేరదు. ఆయుష్షూ పెరుగుతుంది. ప్రకృతిలో పక్షులనూ, జంతువులనూ ఎప్పుడో తప్ప వ్యాధులు సోకి మరణించడం చూడము. మనిషి కూడా అంతే. అత్యాశలకు పోకుండా, ఈర్ష్యాసూయలకు లోనుకాకుండా మనగలిగితే తృప్తిగా జీవించి, తృప్తిగా పరమాత్మను చేరుకోవచ్చు. అయితే, విజ్ఞాన సముపార్జన విషయంలో తృప్తి ఉండకూడదు. నిరంతరం నేర్చుకోవాలనే తపనా, నేర్చిన జ్ఞానాన్ని పదుగురికీ పంచాలన్న సదుద్దేశం ఉత్తమ లక్షణాలు. *కొత్త విషయాలు తెలుసుకోవడం, సజ్జనుల సాంగత్యం కోసం ప్రయత్నించడం మానవులకు ఎంతో మేలు చేస్తుంది*. ధన్యవాదములు 🙏 *మీ నవీన్ నడిమింటి* *విశాఖపట్నం* 🔸♦️🔹🔸♦️🔹🔸♦️🔹🔸 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు* *సర్వేజనా సుఖినోభవంతు* *లోకా సమస్త సుఖినోభవంతు* *శుభం భూయాత్* *ఓం శాంతి శాంతి శాంతిః* *స్వస్తి* 🔸♦️🔹🔸♦️🔹🔸♦️🔹🔸
🐓🐓🐓🐓🐓 1Death Associated with H5N1 Bird Flu Infection in the United States 🟥https://t.me/vaidayanilayamNaveen
*గర్భాశయ క్యాన్సర్ పై అవగాహనా కోసం నవీన్ నడిమింటి వైద్య నిలయం సలహాలు* గర్భాశయంలోని అసాధారణ కణాలు పెరిగినప్పుడు మరియు అనియంత్రితంగా గుణించి, కణితిని ఏర్పరుచుకున్నప్పుడు గర్భాశయ క్యాన్సర్ సంభవిస్తుంది. ప్రమాద కారకాలు 1. *హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV)*: గర్భాశయ క్యాన్సర్‌కు HPV ప్రధాన కారణం. 2. *ధూమపానం*: ధూమపానం గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. 3. *బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ*: హెచ్ఐవి/ఎయిడ్స్ వంటి బలహీనమైన రోగనిరోధక వ్యవస్థలు ఉన్న మహిళలు ఎక్కువ అవకాశం కలిగి ఉంటారు. 4. *వయస్సు*: 30 ఏళ్లు పైబడిన మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తుంది. లక్షణాలు 1. *అసాధారణ యోని రక్తస్రావం*: కాలాల మధ్య రక్తస్రావం, సెక్స్ తరువాత, లేదా మెనోపాజ్ తరువాత. 2. *కటి నొప్పి*: పొత్తికడుపు లేదా కటిలో నొప్పి. 3. *అసాధారణ ఉత్సర్గ*: అసాధారణ యోని ఉత్సర్గ. నివారణ 1. *HPV టీకా*: గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి HPV కి వ్యతిరేకంగా టీకాలు వేయండి. 2. *రెగ్యులర్ PAP పరీక్షలు*: అసాధారణ కణ మార్పులను గుర్తించడానికి సాధారణ PAP పరీక్షలను పొందండి. 3. *ప్రాక్టీస్ సేఫ్ సెక్స్*: HPV ప్రసార ప్రమాదాన్ని తగ్గించడానికి కండోమ్‌లను ఉపయోగించండి. చికిత్స 1. *శస్త్రచికిత్స*: కణితి లేదా ప్రభావిత కణజాలం తొలగించడానికి శస్త్రచికిత్స. 2. *రేడియేషన్ థెరపీ*: క్యాన్సర్ కణాలను చంపడానికి రేడియేషన్ థెరపీ. 3. *కెమోథెరపీ*: క్యాన్సర్ కణాలను చంపడానికి కీమోథెరపీ. అవగాహన మరియు స్క్రీనింగ్ 1. *విద్యావంతులను పొందండి*: గర్భాశయ క్యాన్సర్, దాని ప్రమాద కారకాలు మరియు నివారణ పద్ధతుల గురించి తెలుసుకోండి. 2. *పరీక్షించండి*: సాధారణ PAP పరీక్షలు మరియు HPV పరీక్షలను పొందండి. 3. *ఇతరులను ప్రోత్సహించండి*: స్నేహితులు మరియు కుటుంబ సభ్యులను చదువుకోవడానికి మరియు పరీక్షించడానికి ప్రోత్సహించండి. ఆయుర్వేద నివారణ మరియు చికిత్స 1. *పసుపు* : పసుపు యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది. 2. *కలబంద*: కలబంద వేరంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు ఓదార్పు లక్షణాలు ఉన్నాయి. 3. 4. *పంచకర్మ*: పంచకర్మ చికిత్స శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి మరియు చైతన్యం నింపడానికి సహాయపడుతుంది. ధన్యవాదములు 🙏 *మీ నవీన్ నడిమింటి* గర్భాశయ క్యాన్సర్‌ను నివారించడానికి మరియు చికిత్స చేయడానికి అవగాహన మరియు ప్రారంభ గుర్తింపు గుర్తుంచుకోండి. విద్యావంతులు మరియు పరీక్షించడానికి ఇతరులను ప్రోత్సహించండి! https://t.me/vaidayanilayamNaveen
*ఈ రోజు హెల్త్ ఇన్ఫర్మేషన్* పాల ప్యాకెట్ కొందామంటే భయం వేస్తోంది, ఈ వీడియో చూచినా తర్వాత, పెద్ద ఎత్తున గుర్తింపు ఉన్న, విజయ డైరి, తెలిసి కూడా కొనడం అంటే, ప్రజల ప్రాణాల కన్నా వాళ్ళ వ్యాపార అభివృద్ధి కోసం ఏలాంటి నీచమైన పనికి పాల్పడుతున్నారు. వెంటనే ప్రభుత్వాలు అన్ని పాల కేంద్రలను వెంటనే తనిఖీ చేయాలి. లేక పోతే ప్రజలు అనారోగ్యాలకు దారితీస్తుంది.🙈 మనం ఏలాంటి పాలు కొనుగోలు చేయలో, పూర్తి ఆరోగ్యం సలహాలు కోసం లింక్స్ https://t.me/vaidayanilayamNaveen
తాత మనవడు ! వయొలెంట్ లవ్ స్టోరీ . దాసరి సినిమాకు సీక్వెల్ ! తాతగారు ! ఏలూరు దగ్గర ... ఒక పల్లెటూళ్ళో... మధ్య తరగతి కుటుంబం లో జన్మించాడు . ఆత్మ విశ్వాసం , కృషి , పట్టుదల ... ఇందనలుగా... అంచెలంచెలుగా ఎదిగాడు . రతన్ టాటా తో కలిసి చదివాడు . పారిశ్రామిక వేత్త అయ్యాడు . కోట్లు గడించాడు. ముగ్గురు కూతుళ్లు .. ఒక కొడుకు ! పిల్లలకు ఆస్తులు ఇచ్చాడు . దాన కర్ణుడు .. తిరుమల కొండకు 50 కోట్లు ఇచ్చాడు . తాను చదివిన పల్లె బడికి ... అయిదు కోట్లు ఇచ్చాడు . వయసు 85 . మనవడు ! డబ్బుల్లో పుట్టాడు . తల్లి... తండ్రి తో... విడిపోయింది . విలాసాల్లో... విచ్చల విడిగా పెరిగాడు . అడ్డుఅదుపు లేదు . మద్యానికి బానిస అయ్యాడు . తాతగారి డబ్బు .. అమెరికా లో ఉన్నత విద్యాసంస్థలో సీట్ ఇప్పించింది . డ్రగ్స్ పిచ్చి పట్టింది . . ప్రేమ... అనురాగం... ఆప్యాయత ... విచక్షణ.. లాంటి మానవ భావోద్వేగాలు మచ్చుకైనా లేవు . నార్సిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్ .. ఆంటి సోషల్ పర్సనాలిటీ డిసార్డర్ . ద్వేషం , పగ ప్రతీకారం .. . తాతగారి కంపెనీ . తాగుబోతు... తిరుగుబోతు... డ్రగ్స్ కు బానిస అయిన మనవడికి ... కంపెనీ డైరెక్టర్ పదవి ఇస్తే కంపెనీ అందులో పని చేసే ఉద్యోగులు నష్టపోతారు . తాను నాటిన చెట్టు తన కళ్ళముందే కూలి పోతుంది . అందుకే తాతగారు ఆ పదవి ఈ మృగానికి ఇవ్వలేదు . ఎంతైనా కూతరు కొడుకు కదా . మమకారం చావదు . .. బతకడానికి నాలుగు కోట్లు ఇచ్చాడు . మనవడు ! నేరమయ నవ ప్రపంచానికి ప్రతినిధి . ఈ కాలం కుర్రాడు " తొక్కలో డబ్బుదేముంది . బ్రో . .. చిన్నప్పటి నుంచి తాను నోట్ల కట్టల్లో పెరిగాడు . డబ్బు ఇచ్చే సుఖాలను అనుభవించడం తెలుసు . కృషి పట్టుదల శ్రమ సహానుభూతి లాంటివి తనకు ఒంటబట్ట లేదు . వాటి అవసరమేముంది ? తాతగారు సంపాదించింది చాలదా ? 29 ఏళ్ళ వయసు వచ్చింది .. ఇప్పుడు .. తనకు సమాజం లో గుర్తింపు , గౌరవం కావాలి . పెత్తనం చెలాయించాలి . అదో తుత్తి. ఎంత సేపు తిని తొంగుంటే మడిషికి గొడ్డుకి తేడా ఏటుంటది? ఇగో .. దాన్ని సాటిస్ఫాయి చెయ్యాలి . సూట్ వేసుకొని బోర్డు మీటింగ్స్ కు వెళ్ళాలి . ఆర్డర్స్ ఇవ్వాలి . చప్పట్లు కొట్టించుకోవాలి లీడర్ అని పించుకోవాలి . తాత ఇచ్చిన నాలుగు కోట్లు ఓకే . " కానీ కంపెనీ కి డ్రైరెక్టర్ చెయ్యమంటే ముసలోడు .. వినడే. ఎంత సేపు వాడు చెప్పిందే నడవాలా? ఎనభై ఏళ్ళు వచ్చినా అంత ఇగో నా ? నేనేంటో చూపుతా . దెబ్బకు అకౌంట్ సెటిల్ అయిపోవాలి . ముసలోడు చావాలి .. కుక్క చావు చావాలి . " అందుకే కసి తీరా... పొడిచి... పొడిచి... చంపేశాడు . ఒక్క సారి కాదు .. మెడ పై ... డజను సార్లు .. ఒంటి పై... డెబ్భై సార్లు... .. పొడిచి కసిగా... తనివి తీరా చంపేశాడు . తల్లి అడ్డొచ్చింది . " కొడుకంటే ప్రేమ లేదా ? తనకు సమాజం లో గౌరవం వద్దా? ముసలాడి కి చెప్పొచ్చుగా ? అందుకే . తాతను పొడిచిన కత్తితోనే .. తల్లిని కూడా పొడిచాడు . ముసలాడు పోయాడు . తల్లి ఇప్పటికి బతికింది . తనను పోలీస్ లు పట్టుకొంటారని తెలుసు . అయితేనేమి? .. ... పగ ప్రతీకారం ముఖ్యం . తనకు పదవి నివ్వని తాత చావాలి . తల్లి కూడా చావాలి . నవ మాసాలు మోయడం లాంటి తొక్కలో కబుర్లు వద్దమ్మా . తాగమా!.. డ్రగ్స్ తీసుకొన్నామా! .. ఎంజాయ్ చేశామా! .. ఇదే జీవితం . అవును నాకు జీవితం ఇదే నేర్పింది . నేను ఈ కాలం కుర్రాడిని . " . నిజ జీవిత కథలో నీతి. ఆస్తులు సంపాదిస్తారు .. పిల్లలు... మనవలు ... మానవరాండ్రు... చల్లగా ఉండాలని ... వారి కష్టం కూడా మీరే పడుతూ ..వారికి కష్టం తెలియక .. కష్టపడాల్సిన అవసరం లేకుండా .. ... వారి బతుకు కూడా మీరే బతికేస్తారు . డబ్బు సంపాదనలో మీరు ... . డబ్బు కావాలి . డబ్బు సంపాదించాలి . నిజమే . కానీ బాలన్స్ తెలియాలి గా? .. పిల్లకు కేవలం డబ్బే ఇచ్చి .. .. మీ సమయం ఇవ్వక .. పెంచితే ? వారు మృగాలు అవుతారు . రాక్షసులు అవుతారు . తప్పెవరిది ? మీ అమ్మ నాన్న మిమ్మల్ని ఇలాగే పెంచారా ? డబ్బు ఇవ్వకపోయినా వారు... మీకు సమయం ఇచ్చారు . ప్రేమ... అనురాగం... ఆప్యాయత నేర్పారు . మరి మీరు ? చంద్రునిలో కుందేలు ఉందని మీరు మాత్రమే విన్నారు . గోరు ముద్దలు తిన్న.. అనగనగా తో... మొదలెట్టి కంచికి కి చేరే దాక ... కథలు విన్న ... చివరి తరం మీది . " ఈ కాలం యువత... సెల్ ఫోన్ కు... నీలి చిత్రాలకు... మద్యానికి... డ్రగ్స్ కు బానిస అని మీ పెద్దలు అంటున్నారు . మీరు మాత్రం సంపాదన వ్యసనపరులు కాదా ? స్టేటస్ పిచ్చి మీకు లేదా ? మా బాల్యాన్ని దోచిన దొంగలు ఈరు కదా ? మీరున్నది ఒక తీరు .. మమ్మల్నే తప్పు పడుతారు ఎందుకు ?" ... యువ ఘోష . మీరు సంపాదించిన డబ్బు .. దిండు కింద నాగు ! చేతిలో డబ్బు .. ఇంట్లో ... తల్లితండ్రి ప్రేమ కరువు ... . చెడు సావాసాలు . .. చెడిపోరా ? అసలు మంచి- చెడు అంటే ఏంటో వారికి బాల్యం లో నేర్పారా ? డబ్బు తో చదువు కొన్నారు . కారు కొన్నారు . బంగాళా కొన్నారు . కానీ .. మానవత్వాన్ని కొనగలరా ? మీకు డబ్బే ముఖ్యం . అందుకే మీ డబ్బే మీకు ... ఇప్పుడు... ఉరితాడు . మానవత్వం నేర్వని నేటి కుర్రరికం ..డబ్బు పిచ్చి పట్టిన పెద్దరికం పై పగ తీర్చుకొంటోంది . అయ్యో పెద్దాయనా! మధ్య తరగతి నేపథ్యం .. డబ్బు పెద్దగా లేకపోవడం .. మీలో కసి పెంచింది . కష్టించి పని చేసేలా చేసింది . నాయకత్వ లక్షణాలు అలవాటు చేసింది . తరం మారింది . కూతురు మీ ఇంట్లో ఉంది . కొడుకును ఎలా పెంచిందో చూడు ! వాడి పెంపకం .. కుటుంబ నేపథ్యం .. విలాసాలకు బానిస చేసింది . పాజిటివ్ భావోద్వేగ లక్షణాలు చంపేసింది . ఏంటి నీకు ఈ శిక్ష పెద్దాయనా ! డబ్బు సంపాదించాలి . నిజమే . అంత కంటే పిల్లల్ని ఎలా పెంచాలో నేర్వాలి . వారితో టైం గడపాలి . వివాహ కుటుంబ వ్యవస్థలను గౌరవించాలి . ధన్యవాదములు 🙏 మీ నవీన్ నడిమింటి https://t.me/vaidayanilayamNaveen
*పిచ్చి కుక్క కాదు !* "ఏమిటండీ ఈయన ? ఏదో ఆవేశం కాకపోతే ? మిలిటరీ విమానాలను ఉపయోగించి మరీ అక్రమ వలసదారులు పంపించేస్తున్నాడు . మిలటరీ విమానం బాగా కాస్ట్లీ . ఒక్కో ప్రయాణికుడిపై సివిల్ విమానం లో ఫస్ట్ క్లాస్ టికెట్ కంటే మూడు రెట్లు ఖర్చవుతుంది . ఆ దేశంలో మొత్తం కోటి మంది అక్రమ వలసదారులు ఉన్నట్టు వారే చెబుతున్నారు . ఇలా వంద మందిని... రెండు వందల మందిని పంపాలంటే అది ఎప్పటికయ్యేను ? అమెరికా బడ్జెట్ అంతా ఖర్చు పెట్టినా మరో పదేళ్లకు కూడా అక్రమ వలసదారులు పంపించలేరు " " ఇండియన్ స్టూడెంట్స్ పని చెయ్యడం వల్లే రెస్టారెంట్లు , గ్యాస్ స్టేషన్స్... మాల్స్ నడుస్తున్నాయి . రూల్స్ ను కచ్చితంగా అమలు చేస్తే అవి మూతబడుతాయి . అప్పుడు రెస్టారెంట్లు.. గ్యాస్ స్టేషన్స్.. ఓనర్స్ నుంచి వ్యతిరేకత వస్తుంది . మరో మూడు నెలల్లో ట్రంప్ తగ్గాల్సిందే . గెలిచిన ఆవేశంలో ఏదో చేసేస్తున్నాడు . కాస్త ఓపిక పడితే అన్నీ సర్దుకుంటుంది " ... ఇదీ గత రెండు వారాలుగా అనేక మంది విశ్లేషకులు చెబుతున్న మాటలు . ఎందుకింత ఆవేశం ? అది ఆవేశమా ? లేక ఆలోచనా? ఓపికగా చదవండి . వెన్నులో వణుకు పుడితే... నన్ను తిట్టుకోవద్దు . ఇలా జరగాలని నేను కోరుకోవడం లేదు . జరక్కపోతే సంతోషపడేవారిలో నేను మొదటి వాడిని . ఈ పోస్ట్ సేవ్ చేసుకోండి . ఆరు నెలల తరువాత ఇంకొక సారి చదవండి . కృత్రిమ మేధ యుగంలో డెబ్భై శాతం ఉద్యోగాలను రోబోలు ఎత్తుకెళ్లి పోతాయి . రోబో లతో పని చేయించేవారికి... రోబో లు చేయలేని పని చేసేవారికే ... ఇక ఉద్యోగాలు .. ఈ మాట గత కొన్నేళ్లుగా తరచూ వినిపిస్తోంది . ఇదిగో మొదలయ్యిపోయింది . ఎక్కడ మొదలు కాకూడదో అక్కడే మొదలయ్యింది . ట్రంప్ ది ఆవేశం కాదు . ఎన్నికలకు ముందే ఏమి చెయ్యాలో.. చాలా ప్లాన్స్ వేసుకొని వచ్చాడు . మాగా అంటే మాక్ అమెరికా గ్రేట్ అగైన్ అని . తిరిగీ అమెరికా ను గొప్ప దేశం చెయ్యాలి అనేది ట్రంప్ బృందం అలోచన. అమెరికా విప్లవం జరిగి 250 ఏళ్ళు అయ్యింది . ఇప్పుడు అమెరికాలో రెండవ విప్లవం తేవాలని పకడ్బందీ ప్రణాళికతో ట్రూప్ బృందం శరవేగంతో ముందుకు ఉరకలేస్తోంది . ట్రంప్ ప్రవేశ పెట్టిన వాటిలో ముఖ్యమయినవి... DOGE VSIP . ముందుగా డాగీ గురించి .... అమెరికా ఫెడరల్ వ్యవస్థ .. మీకు బాగా అర్థం కావడానికి ఫెడరల్ అనే మాట స్థానంలో... సెంట్రల్ అని వాడుతాను. అమెరికా లో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగుల సంఖ్య ముప్పై లక్షలు . ఇందులో ఫుల్ టైం ఉద్యోగులు 23 లక్షలు . పది మంది మనుషులు చేసే పనిని ఒక్క రోబో చెయ్యగలదు. అమెరికా సెంట్రల్ గవర్నమెంట్ వ్యవస్థలో రోబోలు ప్రవేశపెడుతున్నారు . అందుకే డాగీ కి ఎలోన్ మస్క్ నాయకత్వం వహిస్తున్నాడు . ప్రభుత్వ వ్యవస్థల పని తీరు మెరుగుపరచడం .. ఇలా ఎన్ని మాటలు చెప్పినా దాని సారం .. రోబో లను ప్రవేశ పెట్టడమే . అందుకే ట్రంప్ VSIP అనే పథకం ప్రవేశ పెట్టాడు . ఉద్యోగాలు వదిలేసి పొతే ఎనిమిది నెలల జీతం ఇస్తాను అని చెప్పాడు . సుమారుగా ఒకటి నుంచి రెండు లక్షల మంది అమెరికా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ పథకాన్ని ఉపయోగించుకొని స్వచ్చందం గా పదవీ విరమణ పొందుతారు అని వారి అంచనా . అమెరికా లో సగం దాక ఎర్ర రాష్ట్రాలు . అంటే కమ్యూనిస్ట్ రాష్ట్రాలు కావు . ట్రంప్ పార్టీ .. అదే రిపబ్లికన్ పార్టీ అధికారంలో వుండే అనేక రాష్టాలు డాగీ లాంటి పథకాన్ని తమ రాష్టంలో కూడా అమలు చెయ్యడానికి పథకాలు వేస్తున్నాయి . ఒక్లోహోమా, టెక్సాస్ , కరోలినా , న్యూ హాంప్‌షైర్... మిస్సోరి... ఇలా ఒక్కక్కటి ముందుకు వస్తున్నాయి . అంటే మరో ఆరు నెలల్లో అమెరికాలో .. సెంట్రల్.. స్టేట్... గవర్నమెంట్ ఉద్యోగులు పెద్ద ఎత్తున వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొంటారు . వీరి సంఖ్య అయిదు లక్షల దాక ఉండొచ్చు . అమెరికా లో ఇప్పటికే ఉన్న నిరుద్యోగ యువత సంఖ్య 23 లక్షలు . అంటే సుమారుగా ముప్పై లక్షల మంది ప్రైవేట్ ఉద్యోగాల కోసం చూస్తారు . { వాలంటరీ రిటైర్మెంట్ తీసికొన్నవారిలో కొంత మంది కొత్త ఉద్యోగం కోసం చూడక పోవచ్చు . నిజమే } . ముప్పై లక్షల మంది.. అందరూ .. అమెరికా పౌరులు . వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి . ఎలా ? స్టూడెంట్ వీసా పై వెళ్లి పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకొంటున్నవారు లక్షల్లో వున్నారు . అలాగే వీసా నిబంధనలు అతిక్రమించి ఉన్నవారు పెద్ద సంఖ్యలో . చట్టాన్ని అమలు చేస్తే ఈ ఉద్యోగాలు... పౌరులకు దక్కుతాయి . ఇది కేవలం ప్రారంభం మాత్రమే .. ఏదో అద్భుతం జరిగి డాగీ ప్రక్రియ ఆగిపోతే తప్పించి .. 1 . లక్షల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు ఊడుతాయి... లేదా ఖాళీ అవుతాయి . వీరు అమెరికాలో దొరికే ప్రైవేట్ ఫుల్ టైం లేదా పార్ట్ టైం జాబ్స్ కోసం చూస్తారు . 2 . ఉద్యోగుల సంఖ్య తగ్గించుకోవడం వల్ల ప్రభుత్వానికి కోట్లల్లో ఆదా అవుతుంది . ప్రభుత్వ వ్యవస్థల పని తీరు మెరుగుపడుతుంది . ౩. అమెరికన్స్ కే జాబ్ లేనప్పుడు .. అక్కడికి వెళ్ళినవారు { గ్రీన్ కార్డు వారు తప్పించి .. అలాగే కీలక మయిన ఉద్యోగాల్లో ఉన్నవారు తప్పించి } ఏమి ఉద్యోగాలు చేస్తారు ? ఇప్పుడు ట్రంప్ యుద్ధ విమానాల్లో దించుతున్నాడు అంటే" అరేయ్... బాబు వెళ్లిపోండి" అని చెప్పడం . ఉద్యోగాలు పొతే .. అమెరికా లో ఎన్ని రోజులు ఉంటారు ? చట్టాలను కచ్చితంగా అమలు చేస్తే ఎంతమంది అక్కడ వుండే అర్హతను కోల్పోతారు ? వీరు ఎంత కాలం అమెరికా లో ఉండగలుగుతారు ? యుద్ధ విమానాలు .. కాళ్లకు చేతులకు సంకెళ్లు .. ఇవన్నీ సంకేతాలు . చట్టం అమలు చేస్తాము అని అందరికీ చెప్పడం . అక్కడ వుండే అర్హత కోల్పోయినవారు సొంత డబ్బులతో తిరిగీ తమ దేశాలకు వెళ్లిపోవాల్సిందే . అంటే పొమ్మనకుండా పొగ పెట్టడం . ఇది ఒకే రోజులో జరగదు .. ప్రక్రియ... ప్రారంభం అయ్యింది నిన్నటి పోస్ట్ లో... జరిగింది గోరంత .. జరగబొయ్యేది కొండంత... అని రాసాను . ఇదే అసలు విషయం . 4 . రోబో లు ప్రవేశ పెడితే కొత్త ఉద్యోగాలు రావా ? వస్తాయి . వంద ఉద్యోగాలు ఊడితే... ఇరవై ముప్పై కొత్తగా వస్తాయి . కృత్రిమ మేధ.. రోబోటిక్స్ లాంటి కొత్త రంగాల్లో వస్తాయి . మొత్తం వీసా విధానాన్ని మార్చేసి కేవలం అత్యుత్తమ ప్రతిభ కలిగిన వారిని మాత్రమే అమెరికా కు రప్పించేలా / అమెరికా లో ఉండేలా చేయబోతున్నారు . ఇలాంటి వారికి విమానం ఎక్కే ముందే గ్రీన్ కార్డు ఇస్తారు కాబోలు .ఇప్పటికే అక్కడ వున్నవారికి గ్రీన్ కార్డులు ఇచ్చేస్తారు . క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ అన్న మాట . ప్రతిభ లేకున్నా .. ఉన్నత విద్య పేరుతొ అమెరికా కి వెళ్లిపోవడం .. పార్ట్ టైం ఉద్యోగం ... ఫుల్ టైం ఉద్యోగం .. అటు పై అక్కడే సెటిల్ అయ్యిపోవడం... ఇక గతం . గడియారం వెనక్కు తిరుగుతోంది .. 1960 , 1970 లలో ఉన్నట్టే కేవలం అత్త్యుత్తమ ప్రతిభ కలిగినవారికే ఇక అమెరికా ఛాన్స్ . డెమోక్రాటిక్ పార్టీ ఎన్ని నిరసనలు చేసినా ప్రయోజనం ఉంటుందా ? మహా అంటే.. వేగాన్ని తగ్గించవచ్చు . అర్థం అయ్యిందా . పిచ్చి కుక్క కాదు . భవిషత్తు ! ఆగండి. అక్కడితో అయిపోలేదు . డాగీ లాంటిది ఆటు పై ఇండియా లో రాదా ? మిగిలిన డబ్బు తో బంగారం కొనుక్కోండి . ఖర్చు తగ్గించుకొని ఆదా చేసుకోండి . పిల్లలని కృత్రిమ మేధ రోబోటిక్స్ లాంటి కోర్సులలో చేర్పించండి . అన్నింటికీ మించి రోబో చెయ్యలేని పని వారు చేసేలా చెయ్యండి .. సృజన .. క్రిటికల్ థింకింగ్... కాంప్లెక్స్ ప్రాబ్లెమ్ సొల్వింగ్ స్కిల్స్ వారిలో తీసుకొని రండి అంటూ... ... సొంత ఖర్చు తో ఊరారా బాలమిత్ర క్లాసులు పెట్టి ఎందుకు చెబుతునాన్నో అర్థం అయ్యిందా ? వాసిరెడ్డి అమర్నాథ్.. మీకు అర్థం అయ్యింది గోరంత . నాకు తెలుసు .. ఈ పోస్ట్ చూసి నా పై చాలామంది మండిపడుతారని . గత అయిదేళ్లుగా నాకిది మామూలే . అందుకే పోస్ట్ సేవ్ చేసుకొని ఆరు నెలలకు చూడండి అని చెబుతున్నా! ధన్యవాదములు 🙏 మీ నవీన్ నడిమింటి శుభోదయం . https://t.me/vaidayanilayamNaveen
బతకడం కోసం చచ్చిపోతున్నారు ! అమెరికా లో అక్రమంగా ప్రవేశించేవారిలో ఎక్కువ మంది వెళ్ళేది... గాడిద మార్గం . ఎల్ బుర్రో అనే స్పానిష్ మాటకు అర్థం గాడిద . గాడిదలా బరువులు మోసుకొంటూ అడ్డదిడ్డంగా వెళ్లడం అనే భావాన్నుంచి ఇది పుట్టింది . గాడిద మార్గం రహదారి కాదు . ఎన్నెన్నో దొంగ మార్గాలు . ఇందులో ఒకటి... దరియెన్ ఖాళీ స్థలం . అతి భయంకరమయిన కీకారణ్యం .. చిత్తడి నేల. పొడవు 97 కిలోమీటర్లు . పనామా... కొలంబియా మధ్య వుంది . విష పాములు , చిరుతలు, విష కీటకాలు ఇక్కడ లెక్కకు మించి ఉంటాయి . ఎప్పుడూ వర్షం .. దానితో పాటే ఎండ .. వేడి .. చెమటలు కారి పోతాయి . అసలు సమస్య ఇక్కడ వున్న డ్రగ్ మాఫియా లతో . ఆడవాసన కనబడితే వదిలిపెట్టరు . ఈ మార్గం లో వెళ్లేవారికి ఏజెంట్స్ ముందుగానే కండోమ్‌లు ఇస్తారు . డ్రగ్ కేటుగాళ్లతో సంభోగానికి ఒప్పుకోవాలి . లేకపోతె చిత్ర హింసలు పెట్టి రేప్ చేసి చంపేస్తారు . ఇవన్నీ లేకుండా ముందుగానే ఒప్పుకొంటే ప్రాణం దక్కుతుంది . ఎయిడ్స్ సోకకుండా రబ్బరు తొడుగు . వారు అడిగితే చేతిలో ఉన్న డబ్బు మొత్తం ఇచ్చేయాలి . రోజుకు ఒక చిన్న బ్రెడ్ ముక్క .. రెండు బిస్కెట్లు . తాగు నీరు పెద్దగా అందుబాటులో ఉండదు . దరియెన్ గాప్ ప్రయాణం వారం నుంచి 15 రోజులు పడుతుంది . అదేంటి కేవలం 97 కిలోమీటర్స్ కదా?.. అనుకొంటున్నారా ? కొండలు గుట్టలు .. బురద .. చెట్లు చేమలు .. పాములు .. దోమలు .. అడుగు తీసి అడుగు వెయ్యాలనుంటే నరకం . అక్కడ ఖాయిలా పడితే అంతే సంగతి . ఖాయిలా మనిషిని అక్కడే వదిలేసి బృందం ముందుకు వెళ్ళిపోతుంది . అంటే అక్కడే తిండి లేకుండా చచ్చి పోతారు . జనాలు వెళుతుంటే దారిలో శవాలు ఆస్తి పంజరాలు కనిపిస్తాయి. ఇంతటి దారుణమయిన మార్గం లో ఎవరు వెళుతారు అనుకొంటున్నారా ? 2023 లో మొత్తం అయిదు లక్షల మంది వెళ్లారు . అంతకు ముందు సంవత్సరం కంటే ఇది డబల్ . విమానం లో ఎక్కించినా బేడీలు ఎందుకు ? భయం .. బయపెట్టడం . " మా దేశానికి అక్రమమార్గం లో వస్తే పర్యవసానాలు ఇలా ఉంటాయి!" అని అందరికీ హెచ్చరిక . సైకలాజికల్ వార్నింగ్ . అందుకే అమృత్సర్ ప్రయాణీకుల సంకెళ్ళ వీడియో ను వారి ప్రభుత్వం అధికారికంగా పెట్టింది ." దరియెన్ గ్యాప్ లో ఎన్నో కష్టాలు పడి మా దేశం లో దూరినా .. పట్టుకొంటాము. చీకటి గదుల్లో బందిస్తాము . అవమానకర రీతిలో చేతులకు కాళ్లకు బేడీలు వేసి గెంటేస్తాము "అని వారు అధికారికంగా చెబుతున్నారు . { గెంటేస్తాము అనే మాట వారు వాడింది } శిక్షించవచ్చు కదా ? టైటిల్ 8 సెక్షన్ 1325 .. us కోడ్ ప్రకారం ఆ దేశం లో అక్రమమగా చొరబడితే రెండేళ్లు జైలు .. రెండు లక్షల యాభై వేల డాలర్స్ అపరాధం . ఇప్పుడు గెంటివేయబడ్డ వారు ఇటీవలే వెళ్ళినవారు . వీరిలో చాలా మంది బోర్డర్ లోనే పట్టుబడి ఇన్నాళ్లు జైళ్లలో ఉన్నవాళ్లే . ఆస్తి మొత్తం అమ్మి ఏజెంట్స్ కు అప్పచెప్పి అమెరికా లో చొరబడి ... అప్పుడే పట్టుబడితే వారి దగ్గర ఏమి ఉంటుంది ? ఇరవై లక్షలు కట్టగలరా ? అందుకే పంపేస్తున్నారు. ఇది వరకే అక్కడ చొరబడి కాస్తో కూస్తో డబ్బు సంపాదించిన వారితో ఎలా వ్యవహరిస్తారో చూడాలి . విద్యార్థుల సంగతి ఏంటి ? స్టడీ వీసా పై వెళ్లిన వారు క్యాంపస్ బయట ఉద్యోగాలు చేయకూడదు . ఇన్నాళ్లు సాగింది . ఇప్పుడు... పట్టుబడిపోతాము అని భయం తో టెక్సాస్ లాంటి చోట్ల ఎవరూ బయట ఉద్యోగాలకు వెళ్లడం లేదు . వీరు వెళ్లినా పార్ట్ టైం ఉద్యోగాలు ఇవ్వడానికి వారు రెడీ గా లేరు . పరిస్థితి దారుణంగా వుంది . ఆయనకో షాప్ వుంది . వ్యాపారం వారి కుల వృత్తి . కొడుకును అరవై లక్షల అప్పు చేసి అమెరికా పంపించాడు . అటు పై మరో ఇరవై లక్షల అప్పు . వడ్డీ కట్టలేక మొన్న ఆత్మ హత్య చేసుకొన్నాడు . కొడుకు బంగారు భవిత కోసం ప్రాణం విడిచిన తండ్రి . ఎవరిదీ పాపం ? ఇంతజరిగినా జనాలకు ఇప్పటికీ సరైన సమాచారం ఇచ్చేవారు లేరు . "పక్క వాళ్ళు వెళ్లారు .. మనం కూడా వెళ్ళాలి" అనే తపనే . గాడిద మార్గం లో ప్రాక్సీ మార్గం లో అమెరికా కు పంపే ఏజెంట్స్ కోటీశ్వరులు అయిపోయారు . అమెరికా లో కేసినోలలో ఒక రాత్రి పూట వారు పందెం కాచే డబ్బు చూసి అమెరికా సంపన్నులే కళ్ళు తేలేస్తున్నారు . నాశనం అయిపోతోంది మనోళ్లే .. దోచుకొంటోంది మనోళ్లే .. మొసలి కన్నీరు కురుస్తోంది మనోళ్లే . డాలర్ డ్రమ్స్ కాస్తా... డాలర్ నైట్ మెర్ అయ్యింది బహుశా మరో రెండేళ్లకు ప్రతిభ వున్నవారికి ఇండియా లో ఫ్లైట్ ఎక్కేముందే గ్రీన్ కార్డు చేతిలో పెట్టి మేళతాళాలతో అమెరికా ఆహ్వానించవచ్చు . రహదారి కు .. అడ్డదారి కి తేడా ఇప్పటికైనా తెలుసుకొంటే అందరూ బాగుపడతారు . ధన్యవాదములు 🙏 మీ నవీన్ నడిమింటి శుభోదయం ! https://t.me/vaidayanilayamNaveen
*ఫోన్ ఎతొద్దు.. తిరిగి చేయొద్దు లైట్ గా తీసుకొంటే మీ బ్యాంకు డబ్బులు కాలి 👹* • ఆదమరిచారో మీ ఖాతాలు ఖతమే • మీ సిమ్ నేరాలు చేసి ఇరికిస్తారు • హైదరాబాద్ పోలీసుల వార్నింగ్ • పలు ప్రమాదకర నంబర్లవిడుదల • ఈ ఫోన్ కాల్స్ యమ డేంజర్ మిస్డ్ కాల్ వచ్చిందని.. తిరిగి ఆ నంబర్ కు కాల్ చేస్తున్నారా? అయితే మీరు డేంజర్లో పడిపోయినట్లే. అలా చేసిన జస్ట్ మూడు సెకన్లలో హ్యాక్ చేసి మీ ఫోన్‌కు అను సంధానమైన ఖాతా వివరాలు, కాంటాక్ట్స్ ను కొట్టేస్తున్నారని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఫిర్యాదులు, ప్రాథమిక విచారణలో తేలిన అంశాలతో గుర్తించిన కొన్ని అనుమానిత +కోడ్‌తో వచ్చే ఫోన్ నంబర్లను విడుదల చేశారు. #90 #09 .. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి #90 లేదా #09ను డయల్ చేయమంటే చేయొద్దని, అలా చేస్తే మీ సిమ్‌ను వాళ్లు యాక్టివేట్ చేసుకుని మీ నంబర్ తో నేరాలకు పాల్పడి మిమ్మల్ని ఇరికిస్తారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ఫోన్ నంబర్ల సమాచారాన్ని కుటుంబ సభ్యులతో పాటు తెలిసిన వారికి చెప్పి అప్రమత్తం చేయాలని సూచిస్తున్నారు. ఈ కోడ్లతో వచ్చే నంబర్లతో జాగ్రత్త.. +375 (໖໓) +371 (5) +381 (2) +563 (2) +370 (225) +255 (టాంజానియా) అస్సలు ఎత్తకూడని నంబర్లు.. +94777455913 +37127913091 +37178565072 +56322553736 +3705222959 +255901130460 This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి. https://t.me/vaidayanilayamNaveen