వైద్య నిలయం
February 7, 2025 at 01:18 AM
బతకడం కోసం చచ్చిపోతున్నారు ! అమెరికా లో అక్రమంగా ప్రవేశించేవారిలో ఎక్కువ మంది వెళ్ళేది... గాడిద మార్గం . ఎల్ బుర్రో అనే స్పానిష్ మాటకు అర్థం గాడిద . గాడిదలా బరువులు మోసుకొంటూ అడ్డదిడ్డంగా వెళ్లడం అనే భావాన్నుంచి ఇది పుట్టింది . గాడిద మార్గం రహదారి కాదు . ఎన్నెన్నో దొంగ మార్గాలు . ఇందులో ఒకటి... దరియెన్ ఖాళీ స్థలం . అతి భయంకరమయిన కీకారణ్యం .. చిత్తడి నేల. పొడవు 97 కిలోమీటర్లు . పనామా... కొలంబియా మధ్య వుంది . విష పాములు , చిరుతలు, విష కీటకాలు ఇక్కడ లెక్కకు మించి ఉంటాయి . ఎప్పుడూ వర్షం .. దానితో పాటే ఎండ .. వేడి .. చెమటలు కారి పోతాయి . అసలు సమస్య ఇక్కడ వున్న డ్రగ్ మాఫియా లతో . ఆడవాసన కనబడితే వదిలిపెట్టరు . ఈ మార్గం లో వెళ్లేవారికి ఏజెంట్స్ ముందుగానే కండోమ్లు ఇస్తారు . డ్రగ్ కేటుగాళ్లతో సంభోగానికి ఒప్పుకోవాలి . లేకపోతె చిత్ర హింసలు పెట్టి రేప్ చేసి చంపేస్తారు . ఇవన్నీ లేకుండా ముందుగానే ఒప్పుకొంటే ప్రాణం దక్కుతుంది . ఎయిడ్స్ సోకకుండా రబ్బరు తొడుగు . వారు అడిగితే చేతిలో ఉన్న డబ్బు మొత్తం ఇచ్చేయాలి . రోజుకు ఒక చిన్న బ్రెడ్ ముక్క .. రెండు బిస్కెట్లు . తాగు నీరు పెద్దగా అందుబాటులో ఉండదు . దరియెన్ గాప్ ప్రయాణం వారం నుంచి 15 రోజులు పడుతుంది . అదేంటి కేవలం 97 కిలోమీటర్స్ కదా?.. అనుకొంటున్నారా ? కొండలు గుట్టలు .. బురద .. చెట్లు చేమలు .. పాములు .. దోమలు .. అడుగు తీసి అడుగు వెయ్యాలనుంటే నరకం . అక్కడ ఖాయిలా పడితే అంతే సంగతి . ఖాయిలా మనిషిని అక్కడే వదిలేసి బృందం ముందుకు వెళ్ళిపోతుంది . అంటే అక్కడే తిండి లేకుండా చచ్చి పోతారు . జనాలు వెళుతుంటే దారిలో శవాలు ఆస్తి పంజరాలు కనిపిస్తాయి. ఇంతటి దారుణమయిన మార్గం లో ఎవరు వెళుతారు అనుకొంటున్నారా ? 2023 లో మొత్తం అయిదు లక్షల మంది వెళ్లారు . అంతకు ముందు సంవత్సరం కంటే ఇది డబల్ . విమానం లో ఎక్కించినా బేడీలు ఎందుకు ? భయం .. బయపెట్టడం . " మా దేశానికి అక్రమమార్గం లో వస్తే పర్యవసానాలు ఇలా ఉంటాయి!" అని అందరికీ హెచ్చరిక . సైకలాజికల్ వార్నింగ్ . అందుకే అమృత్సర్ ప్రయాణీకుల సంకెళ్ళ వీడియో ను వారి ప్రభుత్వం అధికారికంగా పెట్టింది ." దరియెన్ గ్యాప్ లో ఎన్నో కష్టాలు పడి మా దేశం లో దూరినా .. పట్టుకొంటాము. చీకటి గదుల్లో బందిస్తాము . అవమానకర రీతిలో చేతులకు కాళ్లకు బేడీలు వేసి గెంటేస్తాము "అని వారు అధికారికంగా చెబుతున్నారు . { గెంటేస్తాము అనే మాట వారు వాడింది } శిక్షించవచ్చు కదా ? టైటిల్ 8 సెక్షన్ 1325 .. us కోడ్ ప్రకారం ఆ దేశం లో అక్రమమగా చొరబడితే రెండేళ్లు జైలు .. రెండు లక్షల యాభై వేల డాలర్స్ అపరాధం . ఇప్పుడు గెంటివేయబడ్డ వారు ఇటీవలే వెళ్ళినవారు . వీరిలో చాలా మంది బోర్డర్ లోనే పట్టుబడి ఇన్నాళ్లు జైళ్లలో ఉన్నవాళ్లే . ఆస్తి మొత్తం అమ్మి ఏజెంట్స్ కు అప్పచెప్పి అమెరికా లో చొరబడి ... అప్పుడే పట్టుబడితే వారి దగ్గర ఏమి ఉంటుంది ? ఇరవై లక్షలు కట్టగలరా ? అందుకే పంపేస్తున్నారు. ఇది వరకే అక్కడ చొరబడి కాస్తో కూస్తో డబ్బు సంపాదించిన వారితో ఎలా వ్యవహరిస్తారో చూడాలి . విద్యార్థుల సంగతి ఏంటి ? స్టడీ వీసా పై వెళ్లిన వారు క్యాంపస్ బయట ఉద్యోగాలు చేయకూడదు . ఇన్నాళ్లు సాగింది . ఇప్పుడు... పట్టుబడిపోతాము అని భయం తో టెక్సాస్ లాంటి చోట్ల ఎవరూ బయట ఉద్యోగాలకు వెళ్లడం లేదు . వీరు వెళ్లినా పార్ట్ టైం ఉద్యోగాలు ఇవ్వడానికి వారు రెడీ గా లేరు . పరిస్థితి దారుణంగా వుంది . ఆయనకో షాప్ వుంది . వ్యాపారం వారి కుల వృత్తి . కొడుకును అరవై లక్షల అప్పు చేసి అమెరికా పంపించాడు . అటు పై మరో ఇరవై లక్షల అప్పు . వడ్డీ కట్టలేక మొన్న ఆత్మ హత్య చేసుకొన్నాడు . కొడుకు బంగారు భవిత కోసం ప్రాణం విడిచిన తండ్రి . ఎవరిదీ పాపం ? ఇంతజరిగినా జనాలకు ఇప్పటికీ సరైన సమాచారం ఇచ్చేవారు లేరు . "పక్క వాళ్ళు వెళ్లారు .. మనం కూడా వెళ్ళాలి" అనే తపనే . గాడిద మార్గం లో ప్రాక్సీ మార్గం లో అమెరికా కు పంపే ఏజెంట్స్ కోటీశ్వరులు అయిపోయారు . అమెరికా లో కేసినోలలో ఒక రాత్రి పూట వారు పందెం కాచే డబ్బు చూసి అమెరికా సంపన్నులే కళ్ళు తేలేస్తున్నారు . నాశనం అయిపోతోంది మనోళ్లే .. దోచుకొంటోంది మనోళ్లే .. మొసలి కన్నీరు కురుస్తోంది మనోళ్లే . డాలర్ డ్రమ్స్ కాస్తా... డాలర్ నైట్ మెర్ అయ్యింది బహుశా మరో రెండేళ్లకు ప్రతిభ వున్నవారికి ఇండియా లో ఫ్లైట్ ఎక్కేముందే గ్రీన్ కార్డు చేతిలో పెట్టి మేళతాళాలతో అమెరికా ఆహ్వానించవచ్చు . రహదారి కు .. అడ్డదారి కి తేడా ఇప్పటికైనా తెలుసుకొంటే అందరూ బాగుపడతారు . ధన్యవాదములు 🙏 మీ నవీన్ నడిమింటి శుభోదయం ! https://t.me/vaidayanilayamNaveen
👍 ❤️ 🙏 9

Comments