🚩రాయలసీమ ఎక్స్ ప్రెస్ న్యూస్🚩
March 1, 2025 at 11:41 AM
పోలీస్ కమాండ్ కంట్రోల్ భవన సముదాయ నిర్మాణానికి భూమిపూజ చేసిన రాష్ట్ర హోంమంత్రి, డిజిపిలు*
🔹 *ప్రీ ప్రైమరీ పోలీస్ రక్షక్ స్కూలు, సి.పి.సి క్యాంటీన్ లను పరిశీలించిన హోంమంత్రి, డిజిపిలు*
🔹 అనంతపురం జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో నూతనంగా నిర్మించ తలపెట్టిన పోలీస్ కమాండ్ కంట్రోల్ నూతన భవన సముదాయ నిర్మాణానికి భూమి పూజ చేసిన *గౌరవ రాష్ట్ర హోం శాఖామాత్యులు శ్రీమతి వంగలపూడి అనిత గారు, గౌరవ రాష్ట్ర డిజిపి శ్రీ హరీష్ కుమార్ గుప్తా IPS గారు*
🔹 అనంతపురం పోలీసు శిక్షణా కళాశాలలో శిక్షణ పూర్తీ చేసుకుని క్షేత్ర స్థాయి విధుల్లోకి వెళ్తున్న 394 మంది SCT ఎస్సైలకు పాసింగ్ అవుట్ పెరేడ్ కార్యక్రమం నిర్వహణ అనంతరం హోంమంత్రి, డిజిపిలు ఈ భూమి పూజలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు
🔹జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో *జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారి* పర్యవేక్షణలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాల పరిశీలన
🔹అనంతపురం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలను *గౌరవ రాష్ట్ర హోం శాఖామాత్యులు శ్రీమతి వంగలపూడి అనిత గారు, గౌరవ రాష్ట్ర డిజిపి శ్రీ హరీష్ కుమార్ గుప్తా IPS గారు* శనివారం పరిశీలించారు. ప్రీ ప్రైమరీ పోలీస్ రక్షక్ స్కూలును సందర్శించారు. చిన్నారులతో ముచ్చటించారు. చదువు ఏమేరకు కొనసాగుతోందో అడిగి తెలుసుకున్నారు. అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం సి.పి.సి క్యాంటీన్ కు వెళ్లారు. సబ్సిడీ ధరలతో ఏఏ సరుకులు అందుబాటులో ఉంచారు, సబ్సడీ ధరల ద్వారా పోలీసు కుటుంబాలకు ఎంత లబ్ధి చేకూరుతుందో ప్రత్యక్షంగా ఓ వినియోగదారుణ్ణి అడిగి తెలుసుకున్నారు. అనంతపురం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాల పట్ల హోంమంత్రి, డిజిపిలు సంతృప్తి వ్యక్తం చేశారు
🔹ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీ పి జగదీష్ IPS గారు, హిందూపురం పార్లమెంటు సభ్యులు శ్రీ బికే పార్థసారథి గారు, ఎమ్మెల్యేలు శ్రీ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు, శ్రీ ఎమ్మెస్ రాజు గారు, శ్రీమతి పల్లె సింధూర రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు శ్రీ పల్లె రఘునాథ్ రెడ్డి గారు మరియు అదనపు ఎస్పీలు డివి రమణమూర్తి, ఇలియాస్ భాష, ఏ.ఆర్ డీఎస్పీ నీలకంఠేశ్వరరెడ్డి, అనంతపురం అర్బన్ డిఎస్పి శ్రీనివాసరావు, ఆర్ఐ లు మధు, బాబు... జిల్లా పోలీస్ కార్యాలయం పరిపాలన అధికారి రవి రాం నాయక్, సూపరింటెండెంట్లు గోపి, ప్రసాద్, సావిత్రమ్మ, ఎస్పీ సీసీ ఆంజనేయ ప్రసాద్, జిల్లా పోలీస్ అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోక్ నాథ్, గాండ్ల హరినాథ్, సుధాకర్ రెడ్డి, లక్ష్మీనారాయణ, శ్రీనివాసులునాయుడు, సూర్యకుమార్, తేజ్ పాల్, తదితరులు పాల్గొన్నారు.
https://whatsapp.com/channel/0029VaOcoLL0Qeai6TcRRX42