Telugu Helper
Telugu Helper
February 9, 2025 at 01:26 PM
మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ రాజీనామా చేశారు. ఆదివారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన బీరేన్ సింగ్.. తన రాజీనామా పత్రాన్ని రాష్ట్ర గవర్నర్‌ అజయ్ కుమార్ భల్లాకు అందజేశారు. ఇప్పటి వరకు మణిపూర్ ప్రజలకు సేవ చేయడం గౌరవంగా ఉందని ఈ సందర్భంగా బీరేన్ సింగ్ పేర్కొన్నారు. బీరేన్ సింగ్ వెంట బీజేపీ అధ్యక్షురాలు ఎ శారద, బీజేపీ ఈశాన్య మణిపూర్ ఇంఛార్జ్ సంబిత్ పాత్ర, మరో 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. గత కొంత కాలంగా మణిపూర్ రాష్ట్రంలో కొనసాగుతున్న హింసాత్మక ఘటనలపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో బీరేన్ సింగ్ రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది
Image from Telugu Helper: మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ రాజీనామా చేశారు. ఆదివారం ముఖ్...

Comments