
Minister For PRRD TELANGANA
February 16, 2025 at 04:53 AM
*పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క*
జై సేవాలాల్ మహారాజ్ కి జై అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క
గిరిజన అభివృద్ధి కోసం వరాలు కురిపిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు
సంత సేవాలాల్ జయంతి ఉత్సవాలకు కోరినన్ని నిధులు మంజూరు చేసి ఘనంగా నిర్వహిస్తున్న ప్రభుత్వానికి, cm గారికి కృతజ్ఞతలు
సేవాలాల్ ఎంచుకున్న భక్తి, విశ్వాసం, నమ్మకంతో వారి ఆశయాలని ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో పని చేయాలి
రేపటి తరానికి సేవాలాల్ సేవలను అందించాలి
అందరికీ సేవాలాల్ జయంతి శుభాకాంక్షలు
చరిత్ర లేనిది వర్తమానం లేదు.. నేడు లేనిది రేపు లేదు
చరిత్ర పునాదుల మీదే మన జాతి నిర్మితమవుతుంది
సేవాలాల్ ఇచ్చిన శాంతి బోధనలు, సమానత్వం, అహింస స్ఫూర్తితో ముందుకు నడవాలి
ఆయన చూపిన సమాజ శాంతి కోసం బంజారాలు పనిచేయాలి
బంజారాలను సంచార జీవితమ నుంచి విముక్తి కల్పించిన మహనీయుడు సేవాలాల్
బంజారాల స్థిర నివాసం కోసం తండాలు ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తి సేవలాల్
ఆ మహనీయుడి ఆశయాలను భవిష్య తరాలకు అందించడమే ఆయనకిచ్చే నివాళి
పశ్చాత్య సంస్కృతి వెంటపడకుండా.. మనం మూలాలు మరవద్దు
ఎంత ఎత్తుకు ఎదిగినా జాతి మూలాలు వేష భాషలను మర్చిపోవద్దు
మూలాలు పోతే అస్తిత్వం దెబ్బతింటుంది అప్పుడు హక్కుల గురించి మాట్లాడే అవకాశం ఉండదు
కనీసం పండగల రోజైనా మన జాతి గొప్పదనాన్ని గుర్తు చేసుకోవాలి
మాటల ద్వారా ఆటల ద్వారా మన జాతి జాడను గుర్తు చేసుకోవాలి
మన జాతి గురించి మనం సగర్వంగా చెప్పుకోవాలి
జాతి ప్రయోజనాలు పొందుతున్నా.. జాతి గురించి చెప్పుకునేందుకు కొందరు ఇబ్బందులు పడుతుంటారు
గిరిజన జాతి నుంచి ఎంతోమంది ఐఏఎస్లో ఐపీఎస్ లు అయ్యారు..ఎమ్మెల్యేలు మంత్రులయ్యారు
*సేవాలాల్ మార్గము సేవా మార్గమే*
విద్వేశం కాదు ఆత్మీయత ప్రేమలు ముఖ్యం
ఆస్తులు హోదాలు కాదు..ఫ్రెండ్లీగా, ఎంత శాంతితో, ఎంత సోదర భవంతో బతుకుతున్నాం అన్నదే ముఖ్యం
ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పెట్టింది కాంగ్రెస్
ఐటీడీఏలు ఏర్పాటు చేసింది కాంగ్రెస్
గత సంవత్సరం గతంలో సబ్ ప్లాన్ నిధులు పక్క దారి పట్టాయని.. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం 17వేల కోట్ల ను ఎస్టీ సంక్షేమం కోసం కేటాయించింది
తండాలలో రోడ్ల నిర్మాణం కోసం వందల కోట్లు ఖర్చు పెడుతున్నాం
తండాల అభివృద్ధి కోసం సలహాలు సూచనలు ఇవ్వండి
తండాల మౌలిక రూపాలను మెరుగుపరిచేందుకు సలహాలు స్వీకరిస్తాం
మీ విజ్ఞప్తి మేరకు వచ్చే ఏడాది సేవాలాల్ జయంతి ఉత్సవాన్ని పెద్దబిస్టేడియంలో నిర్వహించే విధంగా సీఎంను కోరుతాం
బంజారా భాషను అధికారిక భాషగా గుర్తించేందుకు రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో పెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృషి చేస్తాం
మూలాలను మర్చిపోకుండా భవిష్యత్ తరాలకు మూలాలను అందించేలా పని చేద్దాం
. గిరిజనులను అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తూ తెలంగాణను ప్రగతి పదంలో నిలుపుతాం
286 సంవత్సరాల క్రితం జన్మించిన సంతు సేవాలాల్ ఏప్పటికీ చిరస్మరణీయుడే
ఆయన సేవా సిద్ధాంతాలే ఆయనను సజీవంగా నిలుపుతున్నాయి
🙏
3