
Minister For PRRD TELANGANA
February 17, 2025 at 07:15 AM
*లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల పట్ల మంత్రి సీతక్క ఆగ్రహం*
*రాహుల్ గాంధీ మతం, అభిమతం కుల గణన - మంత్రి సీతక్క*
*పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క*
దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టి జనాభా ప్రాతిపదికన సంక్షేమ ఫలాలు, రిజర్వేషన్లు కల్పించాలన్నదే రాహుల్ గాంధీ గారి అభిమతం
బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్ది న్యాయం చేయాలని రాహుల్ గాంధీ గారు కుల గణన కోసం డిమాండ్ చేస్తున్నారు
రాహుల్ గాంధీ గారు దేశ వ్యాప్తంగా బీసీ కులగలన కోసం పట్టుబడుతున్నారు
కుల గానన అంశాన్ని పక్కదారి పట్టించేందుకు రాహుల్ గాంధీ గారిని బిజెపి నేతలు టార్గెట్ చేస్తున్నారు
త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ విజన్ ఉన్న నాయకుడు
30 సంవత్సరాలుగా ఎలాంటి మంత్రి పదవుల్లో లేకుండా దేశం కోసం పనిచేస్తున్నారు
అందుకే గ్రామ స్థాయి నుంచి ప్రధాని వరకు.. రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ కించపరిచే ప్రయత్నాలు చేస్తున్నారు
విద్వేష, విధ్వంసమే బిజెపి విధానం
ప్రేమ, శాంతి, సమానత్వం కోసం రాహుల్ గాంధీ పనిచేస్తున్నారు