Minister For PRRD TELANGANA
Minister For PRRD TELANGANA
February 20, 2025 at 01:29 PM
Minister Sitakka: హ‌త్యకు గురైన సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్యపై మంత్రి సీత‌క్క (Minister Sitakka) సీరియ‌స్ అయ్యారు. మంచిర్యాల జిల్లాలో ఆమె మాట్లాడారు. ప్రశ్నిస్తే చంపేయడం ఏంటని ప్ర‌శ్నించారు. కక్షలతో ఇలా చంపేయడం సరైనది కాదన్నారు. ప్రజా ప్రభుత్వం ఇలాంటి వ్య‌వ‌హారాల‌ను సహించదని, ఇటువంటి హత్యలను కాంగ్రెస్ ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తుందన్నారు. సామాజిక కార్యకర్తగా ఆయ‌న‌కు ఎన్నో అనుమానాలు ఉన్నాయ‌ని, అన్యాయం జరిగింద‌ని ప్రశ్నిస్తే చంపుతారా..? అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ హత్య వెనుక మాజీ మంత్రి అయినా, మాజీ ఎమ్మెల్యే అయినా…? ఎవ‌రు ఉన్నా హత్యకు కారకులైన ఎవరైనా కఠినంగా శిక్షిస్తామ‌న్నారు. ప్రజా ప్రభుత్వంలో ఇలాంటి వాటికి తావులేదని మ‌రోమారు స్ప‌ష్టం చేశారు. గతంలో పెద్దపల్లి జిల్లాలో సైతం ఇలాంటి హత్యలు జరిగాయన్నారు.

Comments