
Sri Pranava Peetham - Vidyanidhi
February 3, 2025 at 12:33 PM
Vidhyanidhi Intro
ప్రణవ పీఠం విద్యానిధి బృందం,
పిల్లలకు సంస్కారం, వినయం మరియు ఆధ్యాత్మికత తో కూడిన విద్య ను అందించడానికి చుట్టిన శ్రీకారం యే “విద్యా నిధి” అనబడే కార్యక్రమం .
పూజ్య గురుదేవుల అనుమతి మరియు ఆశీస్సులతో
వాటి గురించి ప్రజలందరికీ తెలియచేసి, ధర్మం పట్ల ; విద్యా దానం పట్ల స్ఫూర్తి కలిగించటానికి ప్రయత్నిస్తున్నము.
శ్రీ విద్యానిధి కార్యక్రమంలో భాగంగా పూజ్య గురుదేవుల ఆశీర్వాదంతో ఎంతోమంది పిల్లలు పెద్దలు మహాభారతం లోని కథలు నేర్చుకున్నారు.
పూజ్య గురుదేవుల దివ్య సంకల్పంతో,
*శ్రీ ప్రణవపీఠం – విద్యానిధి* కి తమ సేవలను అందిస్తున్న వాలంటీర్లను అనుగ్రహిస్తూ గురువుగారు మంగళాశాసనములు ప్రసాదించారు.
ఇప్పుడు మనం విద్యా నిధి గురించి తెలుసుకుందాము…
శ్రీ గురు దేవుల ఆదేశం మరియు ఆశీర్వచనం తో , శ్రీ ప్రణవ పీఠం శిష్య బృందం విద్యా నిధి అనబడే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగం గా ఆసక్తి ఉన్న వ్యక్తులకు వివిధ కోర్సుల ద్వారా వివిధ అంశాల లో శిక్షణ ఇవ్వడం జరుగుతోంది. శ్రీమద్ భగవద్గీత హనుమాన్ చాలీసా, సరస్వతీ కవచం , పంచోపచార సాధన,వేదిక్ మ్యాథ్స్, సంగీతం, రామదాసు కీర్తనలు, హిందీ, అమ్మ వారి కీర్తనలు, దేశభక్తి గీతాలు, మంగళ హారతి పాటలు, రఘువంశ వృక్షం,మాథ్స్, ఆదిత్య హృదయం, భాగవతం పద్యాలు, మండాల ఆర్ట్, తెలుగు శతక పద్యాలు , సంస్కృత సంభాషణ, తెలుగు, ఇంగ్లీష్ గ్రామర్, మానవ కథ పద్యాలు, మణిద్వీప వర్ణన, సౌందర్యలహరి, శివానందలహరి,మొదలగు కోర్సులను ఆసక్తి ఉన్నవ్యక్తులకు, పిల్లలకు, ఆన్లైన్ లో zoom మాధ్యమం ద్వారా శిక్షణ ఇవ్వటం జరుగుతోంది.
ఒకవేళ ప్రేక్షకులు ఆసక్తి ఉన్న కోర్సు లో రిజిస్టర్ చేసుకోవాలి అనుకుంటే, శ్రీ ప్రణవ పీఠం admins ఎవరినైనా సంప్రదించవలసిందిగా మనవి.
ముందుగా వినాయక ప్రార్థన తో మన ముందుకు వస్తున్నరు