GouthamaISM
GouthamaISM
February 26, 2025 at 07:05 AM
• బీ పాజిటివ్! బీ... డెఫ్! ఒకసారి కప్పల మధ్య ఒక పోటీ జరిగింది. పొడవైన ఒక టవర్‌ను ఎక్కాలన్నది పందెం. పోటీ చూడటానికి వచ్చిన కప్పలు అది అసాధ్యమన్నాయి. అయినా మేము ఎక్కగలమని పది కప్పలు పందెంలో పాల్గొన్నాయి. పోటీ మొదలైంది. ప్రేక్షక కప్పలు అసాధ్యమంటూ అరుస్తున్నాయి. వాటిలో అయిదు టవర్ మధ్యలోనే ఇక ఎక్కలేమని కింద పడిపోయాయి. మిగిలిన అయిదు ఔత్సాహిక కప్పలు ఎక్కుతూ పడుతూ ఉన్నాయి. ప్రేక్షక కప్పలు వెనక్కి వచ్చేయమని అరుస్తున్నాయి. చివరికి నాలుగు కప్పలు కింద పడిపోయాయి. ఒకటి మాత్రమే మిగిలింది. కొద్ది సేపు శ్రమించి ఆ ఒక్కటీ టవర్ పై భాగాన్ని దిగ్విజయంగా చేరుకుంది. కప్పలన్నీ ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాయి. అసాధారణ విజయాన్ని పొందిన ఆ చిన్న కప్పను అభినందించాయి. దాని విజయం వెనుక రహస్యాన్ని తెలుసుకుని మరింత ఆశ్చర్యపోయాయి. ఎందుకంటే ఆ కప్ప చెవిటిది. దాని చెవుడే విజయానికి కారణమైంది. ఎదిగేవాడిని చూసి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతుంటారు. కిందకు పడదోయాలని కుంగిపోయే విధంగా మాట్లాడుతుంటారు. ఇలాంటప్పుడే మనం చెవిటివాళ్లమయిపోవాలని చెబుతారు వ్యక్తిత్వ వికాస నిపుణులు. మన ఆశల్ని, ఆశయాల్ని చంపేసే విధంగా... అది నీవల్ల కాదు... నీవు చేయలేవు... ఎందుకు అనవసరంగా కష్టం వృథా... లాంటి మాటలతో ఓటమివైపు నెడతారు. ఆ మాటలన్నీ పట్టించుకుంటే ఆత్మవిశ్వాసం సన్నగిల్లి అపజయం వైపు పడిపోతాం. మనం ఏ పని చేయలేము అనుకుంటామో అది తప్పనిసరిగా చేయగలం... చేయాలి కూడా అంటాడు రూజ్‌వెల్ట్. అందుకే .... బీ పాజిటివ్... బీ బోల్డ్... అండ్..... బీ డెఫ్. #gouthamavenkataramanaraju
Image from GouthamaISM: • బీ పాజిటివ్!  బీ... డెఫ్!  ఒకసారి కప్పల మధ్య ఒక పోటీ జరిగింది. పొడవె...

Comments