GouthamaISM
                                
                            
                            
                    
                                
                                
                                February 27, 2025 at 03:50 PM
                               
                            
                        
                            • అందుకే నేలపై కూర్చొని తినాలట!
ఈరోజుల్లో నేల మీద కూర్చొని భోజనం చేసేవారు చాలా తక్కువమందే! ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ డైనింగ్ టేబుల్ ఓ భాగమైపోయింది. కానీ దీని కంటే నేలపై కూర్చొని తినడమే ఆరోగ్యకరం అంటున్నారు నిపుణులు. కాళ్లు ముడుచుకొని నేల మీద కూర్చోవడం వల్ల ఆరోగ్యపరంగా పలు ప్రయోజనాలు చేకూరతాయని చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం రండి..
కండరాలు దృఢంగా!
నేల మీద కూర్చొని తినడం చాలా సౌకర్యంగా ఉంటుంది. అలాగే దీనివల్ల పొట్ట చుట్టూ ఉండే కండరాల్లో నొప్పి ఉంటే తొలగిపోతుంది. ఇలా రోజూ కింద కూర్చొని తినడం అలవాటు చేసుకుంటే కండరాల్లో కదలిక పెరిగి అవి ఫ్లెక్సిబుల్‌గా, దృఢంగా మారతాయి. అలాగే ఈ భంగిమ వివిధ రకాల శారీరక నొప్పుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుందంటున్నారు నిపుణులు.
జీర్ణక్రియ సాఫీగా..
కింద కూర్చొని నేలపై ప్లేట్ పెట్టుకుని తినడం వల్ల జీర్ణక్రియ సాఫీగా సాగుతుందంటున్నారు నిపుణులు. ఈ ప్రక్రియలో భోజనం నోట్లో పెట్టుకోవడానికి ముందుకు వంగడం, తిరిగి వెనక్కి రావడం.. ఇలా వెంటవెంటనే చేసే భంగిమల వల్ల ఆహారం జీర్ణం కావడానికి అవసరమైన ఆమ్లాలు శరీరంలో ఉత్పత్తవుతాయట. తద్వారా జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా జాగ్రత్తపడచ్చు. అలాగే శరీరానికి కావాల్సిన శక్తి కూడా అందుతుంది.
బరువు తగ్గచ్చు..
నేలమీద కూర్చొని భోంచేయడం వల్ల బరువు కూడా తగ్గచ్చట! అదెలాగంటే.. సాధారణంగా మనకు సరిపోయేంత తిన్నామా? లేదా? అనే విషయం తెలియడానికి పొట్ట నుంచి మెదడుకు సిగ్నల్స్ అందించే నాడి ఒకటి ఉంటుంది. డైనింగ్ టేబుల్‌పై తినడం కంటే కింద కూర్చొని తినడం వల్ల ఈ నాడి మరింత సమర్థంగా పనిచేస్తుందట! కాబట్టి మనకు సరిపోయేంత ఆహారం మాత్రమే తీసుకుంటాం.. ఫలితంగా బరువును అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
బంధాలు పటిష్టం..
ఒకసారి మీ కుటుంబ సభ్యులందరితో కలిసి హాయిగా కింద కూర్చొని తినండి.. మనసుకు ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీకే అర్థమవుతుంది. ఇది పరోక్షంగా అనుబంధాల్నీ పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.
అయితే నడుమునొప్పి, కీళ్ల నొప్పులు ఉన్న వారు మాత్రం.. వైద్యుల సలహా, తమ సౌకర్యం మేరకు ఎక్కడ కంఫర్ట్‌గా ఉంటే అక్కడ కూర్చొని తినడం మేలు!
#ఆయురారోగ్యాలు #ayurarogyalu #gouthamavenkataramanaraju