Haindavasakthi
February 20, 2025 at 06:28 AM
కాళ్ళ గ్రామం - పురాతన కోదండ రామాలయం-తొలగింపుకు - ప్రయత్నం - జిల్లా-కలెక్టర్ కు - ఫిర్యాదు - చేసిన - హైందవశక్తి.
పశ్చిమగోదావరి జిల్లా, కాళ్ళ మండలం, కాళ్ళ గ్రామంలో రోడ్డు విస్తరణ, అభివృద్ధి పేరిట ఎప్పటి నుంచో ఉన్న "కోదండ రామాలయా న్ని" తొలగించే ప్రయత్నాలు ఒక వారంగా జరుగుతున్నాయి అని స్థానిక "హైందవశక్తి" కార్యకర్తల ద్వారా వ్యస్థాపక అధ్యక్షులు శేడింబి. ప్రసాద్ గారికి ఫోన్ వచ్చింది.
ఆయన వెంటనే సదరు విషయాన్ని మన "హైందవశక్తి" న్యాయసలహా విభాగం జాతీయ అధ్యక్షులు ధూపం.చంద్రశేఖర్ గారి దృష్టికి తెచ్చారు.
ధూపం.జీ వెంటనే పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారికి స్థానికులు సమర్పించేలా ఒక "విజ్ఞాపనా పత్రం" తయారు చేసి పంపారు. స్థానికుల సంతకాలు సేకరించి ఆన్లైన్ లో ఈ "విజ్ఞాపనా పత్రాన్ని" సమర్పించిన ఎకనాలెడ్జిమెంట్ ను ఈ పోస్ట్ క్రింద ప్రతి ఒక్కరూ చూడవచ్చు.
తమ గ్రామంలో ఒక పురాతన దేవాలయాన్ని రక్షించు కొనే విషయంగా స్థానిక యువత 18/02/2025వ తేదీ సోమవారం రాత్రి రాష్ట్ర రహదారిపై రాస్తారోకో కూడా చేశారు. ఆ విషయం అన్ని ప్రముఖ వార్తాపత్రికలలో కూడా వచ్చింది. తదుపరి కొంతమంది స్థానిక గ్రామ పెద్దల సలహా మేరకు నిరసన ప్రదర్శనను విరమించుకున్నారు. సదరు సమస్యపై చట్టబద్ధంగా వెళదామన్న మన "హైందవశక్తి" ప్రసాద్ గారి మాట స్థానిక పెద్దలు అంగీకరించడం సర్వత్రా ముదావహం.
అందుకే మనమంటాము...
"హైందవశక్తి" అంటే పోరాటం......
పోరాటం అంటేనే "హైందవశక్తి"...
ఇలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తే మాకు కాల్ చెయ్యండి.
మా నెంబర్ 8096311785.
Join హైందవశక్తి 092467 30838
https://www.facebook.com/share/p/18Uy9JRa9x/
👍
1