Haindavasakthi
February 20, 2025 at 08:39 AM
క్రైస్తవ కబ్జాకోరుల నుండి కోటప్పకొండ "హిందూ మాదిగల అన్నదాన సత్రాన్ని" కాపాడండి
పల్నాడు జిల్లా, నరసరావు పేటమండలం , కోటప్పకొండ లో శ్రీ శ్రీ శివస్వామి వారి చేత భూమి పూజ నిర్వహించి, బి. వి.విఘ్నేశ్వర స్వామిగారిచే స్థాపించబడిన అన్నదాన సత్రం "హిందూ మాదిగల అన్నదాన సత్రం"
గత పది సంవత్సరాలుగా ప్రతి మహా శివరాత్రికి విశేషమైన అన్నదాన కార్యక్రమం మరియు హిందూ మాదిగలకు ఎన్నో రకాల శుభ కార్యాలు నిర్వహించుకొనేందుకు వీలైన అన్నదాన సత్రం. అటువంటి సత్రాన్ని ఆక్రమించేందుకు అక్కడి క్రైస్తవులు, క్రైస్తవ సంఘాలు మరియు రాజకీయ నాయకుల ప్రోద్బలంతో ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు.
ఈ ప్రయత్నంలో భాగంగా ఈ సంవత్సరం జరగబోయే శివరాత్రి వేడుకలను ఆపడమే కాకుండా, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి వీలు లేదంటూ, బి.వి.విఘ్నేశ్వర స్వామి గారిని తీవ్ర మానసిక, శారీరక ఇబ్బందులకు గురిచేయడమే కాక వారే ఒక కమిటీని సిద్దం చేసి అధ్యక్షులను ఎన్నుకొని ఆయనను బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు మరియు సత్రం లో ఉన్న తాండవ భద్ర కాళి అమ్మవారి విగ్రహాన్ని కూడా తొలిగించాలి లేకుండే చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు.
"హిందూ మాదిగల సత్రం" పేరుతో నిర్వహిస్తున్న ఈ సత్రాన్ని ఎన్నో సంవత్సరాలుగా కాపాడుకుంటూ వస్తున్న బి. వి.విఘ్నేశ్వర స్వామి గారు ఇది క్రైస్తవ మూక చేతుల్లోకి వెళ్తే ఎన్నో అసాంఘిక కార్యక్రమాలు అడ్డాగా మారుతుంది ఆవేదన చెందుతున్నారు.
ఎవరెవరు తనను ఇబ్బందులకు గురిచేస్తునారో పేర్లతో సహా , వీడియో రూపంలో తన ఆవేదనను ప్రతి హిందువూ తెలిసుకునే విధంగా వ్యక్తపరిచారు.
కాబట్టి ప్రతి ఒక్క హిందువు స్పందించి ఆయనకు తగిన న్యాయం జరిగేలా చూడాలని "హైందవశక్తి" ఆశిస్తున్నది.
#జాగో హిందూ # జాగో హిందూ #
https://fb.watch/xSEQ34i9Rz/