
Haindavasakthi
February 24, 2025 at 08:14 AM
#కృష్ణా_జిల్లా_మోపిదేవి_శ్రీ_సుబ్రహ్మణేశ్వర_స్వామి_దేవస్థానంకి_సమీపంలో _నివాస_గృహంలో_అక్రమ_చర్చి_నిర్వహణ_పంచాయతీ_రాజ్_శాఖ_ఈ. ఓ.పి.ఆర్.సి.కి_దేవస్థానం_ఈ. ఓ.కి_ఫిర్యాదులు_చేసిన_హైందవశక్తి.
కృష్ణా జిల్లా, మండల కేంద్రమైన మోపిదేవిలో వేంచేసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానానికి ప్రక్క సందులో ఒక అక్రమ చర్చి నిర్వహిస్తున్నారు దానిని నిలుపుదల చేయించండి అని మన "హైందవశక్తి" వాట్సాప్ గ్రూప్లో ఫిర్యాదు వచ్చింది.
దాంతో నిన్న అనగా 23/02/2025వ తేదీ ఆదివారం ఉదయం మన "హైందవశక్తి"- వ్యవస్థాపక అధ్యక్షులు శేడింబి. ప్రసాద్ గారు, న్యాయసలహా విభాగం జాతీయ అధ్యక్షులు ధూపం.చంద్రశేఖర్ గారు,
కృష్ణా జిల్లా అధ్యక్షులు కొత్తూరు ప్రసన్న గారు, గుంటూరు ఫీల్డ్ కో ఆర్డినేటర్ సురేష్ గారు కలిసి మోపిదేవి"శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర దేవస్థానం" మరియు దానికి అతి సమీపంలో, ఒక నివాసగృహంలో "కల్వరి ప్రేమ ప్రార్ధన మందిరము" పేరిట అక్రమంగా నిర్వహిస్తున్న చర్చిని సందర్శించటం జరిగింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మోపిదేవి బ్రాంచ్ కి వెనుక ఒక నివాస గృహంలో పాస్టర్ పి.రాజేష్
(1) ఆదివారం ఉదయం 11 గం॥లకు ఆరాధన....
(2) బుధవారం రాత్రి 8 గం॥లకు - స్త్రీల కూడిక....
(3)శుక్రవారం మధ్యాహ్నం 2 గం॥లకు- ఉపవాస ప్రార్ధన....
(4) ప్రతినెల మొదటి శుక్రవారం : సంపూర్ణరాత్రి ఉపవాస ప్రార్ధన..
(5) శనివారం రాత్రి 8 గం॥లకు విజ్ఞాపన కూడికల..... పేరిట ఒక ఎండోన్మెంట్ దేవాలయ ప్రాంగణాన్ని క్రైస్తవ ప్రార్ధనలతో
హోరెత్తిస్తున్న ఈ అక్రమ చర్చి పై మన ధూపం.జీ మోపిదేవి ఈ.ఓ.(పి.ఆర్.డి) గారికి ఫోన్ చేసి ప్రశ్నించడం జరిగింది. ఆవిడ సానుకూలంగా స్పందించి ఈ చర్చి కి నిర్మాణ అనుమతులు లేవు, రేపు తన పై అధికారులతో కూడా మాట్లాడిస్తాను అన్నారు.
వెంటనే మన బృందం మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం ఈ. ఓ గారిని కలిసి మాట్లాడి, లిఖిత పూర్వకంగా ఫిర్యాదును కూడా సమర్పించడం జరిగింది. వారు కూడా ఈ అక్రమ చర్చి నిర్వహణను అడ్డుకోవడానికి చట్టపరంగా చేయగలిగింది అంతా చేస్తాము అని హామీ ఇవ్వడం జరిగింది. సంబంధిత ప్రభుత్వ అధికారులు తీసుకొనే చర్యలను బట్టి తదుపరి మన కార్యాచరణ ఉండబోతోంది.
అందుకే మనమంటాము...
"హైందవశక్తి" అంటే పోరాటం......
పోరాటం అంటేనే "హైందవశక్తి"...
ఇలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తే మాకు కాల్ చెయ్యండి.మా నెంబర్ 8096311785.
Join హైందవశక్తి 092467 30838

👍
🙏
9