
𝕶𝖎𝖗𝖆𝖓 𝕴𝖓𝖋𝖑𝖚𝖊𝖓𝖈𝖊𝖗
February 23, 2025 at 10:18 PM
అమరావతి: ఫిబ్రవరి 23 :::
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 47వ మండలి సమావేశం, 16వ శాసనసభ మూడవ సమావేశ ఏర్పాట్లకు సంబంధించి ఆదివారం గౌరవ స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హరీష్ కుమార్ గుప్తాతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
సమావేశపు ముఖ్యాంశాలు:
గవర్నర్ గారి ప్రసంగం జరిగే రోజు ఉదయం 9.30 గంటలకు సభ్యులందరూ సభలో హాజరు కావాల్సి ఉంటుంది.
బడ్జెట్ సమావేశాలకు ఎమ్మెల్యేలు, అధికారుల వ్యక్తిగత సహాయకులకు (PA) పాసులు జారీ చేయబడవు. అందువల్ల వారికి ప్రవేశం ఉండదు. సభ్యులు సహకరించాలని విజ్ఞప్తి చేయబడింది.
ముఖ్యమంత్రిని కలిసే సందర్శకులు, ప్రతినిధులు శాసనసభ ప్రాంగణంలో అనుమతించరు. కావున, వారు ముఖ్యమంత్రిగారి కార్యాలయంలోనే భేటీ కావాలి.
శాసనసభ భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పోలీసు శాఖకు సహకరించాలని అందరినీ కోరారు.
సమావేశాల సమయంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు గౌరవ స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారు ఆదేశాలు జారీ చేశారు.
అనంతరం మీడియా పాయింట్, కొత్తగా నిర్మిస్తున్న క్యాంటీన్‌ను గౌరవ స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారు స్వయంగా పరిశీలించి తగు సూచనలు చేశారు .
ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు, శాసనసభ కార్యదర్శి జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవర ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు
👍
1