𝕶𝖎𝖗𝖆𝖓 𝕴𝖓𝖋𝖑𝖚𝖊𝖓𝖈𝖊𝖗
𝕶𝖎𝖗𝖆𝖓 𝕴𝖓𝖋𝖑𝖚𝖊𝖓𝖈𝖊𝖗
February 24, 2025 at 05:40 AM
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగిస్తున్నారు. "ఎన్నికల్లో ప్రజలు మా ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ ఇచ్చారు. ప్రజల కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. గత ఐదేళ్లలో రాష్ట్రం అనేక ఇబ్బందులకు గురైంది. గత ప్రభుత్వ పాలనతో రాష్ట్రం ఎంతో నష్టపోయింది. సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నాం. అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను రద్దు చేశాం. మెగా డీఎస్సీ దస్త్రంపై సంతకం చేశాం. అన్న క్యాంటీన్లు తెచ్చి పేదవాళ్ల ఆకలి తీరుస్తున్నాం. కూటమి వచ్చాక రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం. మా ప్రభుత్వం వచ్చాక తలసరి ఆదాయం పెరిగింది. అవకాశాలిస్తే ప్రతి ఒక్కరూ మెరుగైన సేవలు అందిస్తారని నమ్ముతున్నాం. ప్రతి నెలా ఒకటో తేదీనే ఇంటికి వెళ్లి పింఛన్లు అందిస్తున్నాం. పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తున్నాం. విద్య, వైద్యం, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాం. 2047 నాటికి స్వర్ణాంధ్ర కలను సాకారం చేస్తాం. బీసీ వర్గాలు సమాజానికి వెన్నెముక. వారికోసం ప్రత్యేక కార్యక్రమాలు. స్థానిక సంస్థలు, నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు అనేక పథకాలు ప్రవేశపెట్టాం. అర్హులైన అందరికీ సొంతిల్లు ఉండాలనేదే మా ఆకాంక్ష" అని తెలిపారు.
👍 1

Comments