𝕶𝖎𝖗𝖆𝖓 𝕴𝖓𝖋𝖑𝖚𝖊𝖓𝖈𝖊𝖗
February 24, 2025 at 09:24 AM
*తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల*
దిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections) షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఏపీ, తెలంగాణలో ఐదుగురు చొప్పున మొత్తం 10 మంది పదవీకాలం ముగియనుంది.
మార్చి 29 నాటికి ఏపీలో యనమల రామకృష్ణుడు, జంగా కృష్ణమూర్తి, పి. అశోక్ బాబు, తిరుమలనాయుడు, దువ్వారపు రామారావు పదవీకాలం ముగియనుంది. తెలంగాణలో పదవీకాలం ముగిసే వారిలో మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, శేరి సుభాష్రెడ్డి, ఎగ్గె మల్లేశం, మీర్జా రియాజుల్ హాసన్ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసింది.
*ముఖ్యమైన తేదీలు:*
ఎన్నికల నోటిఫికేషన్ జారీ: మార్చి 3
నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం: మార్చి 10
నామినేషన్ల పరిశీలన: మార్చి 11
నామినేషన్ల ఉపసంహరణ: మార్చి 13
పోలింగ్: మార్చి 20 (ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు)
ఓట్ల లెక్కింపు: మార్చి 20 (పోలింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి)
👍
1