Telugu News International - TNILIVE
February 20, 2025 at 02:21 AM
అంతరిక్షంలో గతితప్పి దూసుకొస్తున్న ‘2024 వైఆర్4’ అనే గ్రహశకలం భూమిని ఢీకొనే అవకాశాలు మరింతగా పెరిగాయి. ఆ ఆస్టరాయిడ్ గమనం ప్రకారం.. భూమిని ఢీకొట్టే అవకాశం 3.1 శాతం పెరిగింది. ఈ ఆస్టరాయిడ్ ఢీకొనే అవకాశమున్న రిస్క్ కారిడార్‌లో తూర్పు పసిఫిక్ మహాసముద్రం, దక్షిణ అమెరికాలోని ఉత్తరభాగం, అట్లాంటిక్ మహాసముద్రం, అరేబియా సముద్రం, దక్షిణాసియా తదితర ప్రాంతాలు ఉన్నాయి. ముంబై, కోల్‌కతా, ఢాకా, బొగొటా, అబిడ్జాన్, లాగోస్, ఖార్టూమ్ లాంటి ఏడు ప్రధాన నగరాలు ఇందులో ఉండటం ఆందోళనకరం. ఈ నగరాల్లో సుమారు 110 మిలియన్ల మంది నివసిస్తున్నారు.