
Telugu News International - TNILIVE
265 subscribers
About Telugu News International - TNILIVE
Global Telugu News Portal.
Similar Channels
Swipe to see more
Posts

https://www.tnilive.com/2025/02/28/telugu-horoscope-today-mar-01-2025/

TNILIVE - Daily English Telugu NewsPapers - March 01 2025 Saturday https://drive.google.com/drive/folders/1964HEIML5aIgjz_KpAceJ6zw1mHpM7wQ?usp=sharing


రాహుల్ గాంధీని ప్రధాన మంత్రినిచేసే వరకు విశ్రమించవద్దు: రేవంత్ రెడ్డి పదవులు రాని వారు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదన్న ముఖ్యమంత్రి కష్టపడే వారికి పదవులు తప్పకుండా వస్తాయని హామీ పార్టీ కోసం కష్టపడిన వారికి సముచిత స్థానం కల్పిస్తున్నామన్న ముఖ్యమంత్రి రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేసే వరకు విశ్రమించవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పదవులు రాని వారు నిరుత్సాహపడవద్దని, కష్టపడిన వారికి తప్పకుండా పదవులు వస్తాయని హామీ ఇచ్చారు. నాలుగైదేళ్లు జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చినట్లు చెప్పారు. పార్టీ కోసం నమ్మకంగా పనిచేసిన వారికి కూడా ఉన్నత పదవులు ఇచ్చినట్లు చెప్పారు. పార్టీ కోసం కష్టపడిన వారికి సముచిత స్థానం కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం రెండేళ్ల కాలానికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చామని, మార్చి 10వ తేదీ లోపు జిల్లాల వారీగా ఇంఛార్జ్ మంత్రులు నామినేటెడ్ పదవులకు సంబంధించిన నివేదికలు ఇవ్వాలని ఆయన అన్నారు.


రాత్రి, పగలు తేడా లేకుండా గంటల కొద్దీ పని.. పైగా డెడ్ లైన్లతో తీవ్రమైన పని ఒత్తిడి.. వ్యాయామం చేయకపోవడం, అనారోగ్యకరమైన తిండి.. ఇవన్నీ కలిసి ఐటీ ఉద్యోగులను రోగాల ఊబిలోకి నెడుతున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ సాయంతో నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఐటీ ఉద్యోగుల్లో గుర్తించిన రోగాలు 84% ఫ్యాటీ లివర్ రోగులు 71% ఊబకాయం కలిగిన వారు హైబీపీ, డయాబెటిస్‌తో సంబంధమున్న మెటబాలిక్ సిండ్రోమ్ రోగులు 34% సర్వే చేసిందెక్కడ హైదరాబాద్ సర్వే చేసింది ఎప్పుడు? జూలై 2023- జూలై 2024 మధ్య అన్ని రంగాల్లో కలిపి ఒత్తిడి ఎదుర్కొంటున్న ఉద్యోగినులు – 74.7% అన్ని రంగాల్లో కలిపి ఒత్తిడి ఎదుర్కొంటున్న ఉద్యోగులు – 73.7% పని ఒత్తిడి కారణంగా వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌లో రాజీ పడినవారు – 68.25%


https://www.youtube.com/watch?v=CX0JyvtGcDU

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) ఉద్యోగుల డిపాజిట్లపై చెల్లించే వడ్డీ మొత్తాన్ని 8.25 శాతంగానే స్థిరీకరించింది. 2024-25 సంవత్సరానికి గాను 7 కోట్ల సభ్యులున్న ఉద్యోగుల భవిష్య నిధి మొత్తాలపై 8.25 శాతం వడ్డీ చెల్లించనున్నదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. 2022-23లో 8.15 శాతం ఉన్న వడ్డీ రేటును 2023-24కు 8.25 శాతానికి పెంచుతున్నట్టు గత ఏడాది ప్రకటించింది. ఈ ఏడాది కూడా అదే వడ్డీ రేటును కొనసాగించనున్నట్టు తెలుస్తున్నది. 2020-21లో కూడా ఇదే వడ్డీ రేటు ఉండగా కరోనా కారణంగా దేశ ఆర్థిక పరిస్థితి మందగించడంతో మార్చి 2022లో8.1 శాతానికి తగ్గించింది.


పత్రికా ప్రకటన *తిరుమల* *రూ.44 లక్షల విరాళంతో ఒకరోజు అన్నప్రసాద వితరణకు అవకాశం* - దాతలు స్వయంగా వడ్డించవచ్చు - దాతల పేరు ప్రదర్శన తిరుమల శ్రీవారి దర్శనార్థం దేశ విదేశాల నుండి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు రుచిగా, శుచిగా ఒక రోజు అన్నప్రసాదాలు అందించేందుకు టిటిడి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు ఒక రోజు విరాళ పథకం ప్రారంభించిన విషయం విదితమే. ప్రస్తుతం అన్నప్రసాద వితరణ కోసం విరాళాల వివరాలు ఒక రోజు పూర్తిగా అన్నప్రసాద వితరణకు రూ.44 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. (కాగా ఇందులో ఉదయం అల్పాహారం కోసం రూ.10 లక్షలు, మధ్యాహ్న భోజనం కోసం రూ.17 లక్షలు, రాత్రి భోజనం కోసం రూ.17 లక్షలు) దాతలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించవచ్చు. విరాళం అందించే దాత పేరును వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ప్రదర్శిస్తారు. --------------------------------- టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.


*ఓం నమో వేంకటేశాయ* *తిరుమల సమాచారం* *01-మార్చి-2025* *శనివారం* 🕉️ *తిరుమలలో తగ్గిన భక్తుల రద్ది* 🕉️ నిన్న *28-02-2025* రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *52,731* మంది... 🕉️ నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య.... *17,664* మంది... 🕉️ నిన్న స్వామివారి హుండి ఆదాయం *3.24* కోట్లు ... 🕉️ ఉచిత సర్వదర్శనానికి *4* కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు.... 🕉️ ఉచిత సర్వదర్శనానికి సుమారు *8* గంటల సమయం.... 🕉️ టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి సుమారు *4* గంటల సమయం.. 🕉️ 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి *3* గంటల సమయం... *🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏*

https://www.youtube.com/watch?v=eXb2TyzGjvc

https://www.tnilive.com/2025/02/28/usd-to-inr-hits-87-51-telugu-business-news/