
Telugu News International - TNILIVE
February 20, 2025 at 02:26 AM
గ్రేటర్‌లో వాహనాల సంఖ్య కోటికి చేరువలో ఉంది. ఉదయం, సాయంత్రం పీక్ అవర్‌లో మాదాపూర్, కొండాపూర్, సికింద్రాబాద్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీనగర్, కాప్రా, శంకర్‌పల్లి, శంషాబాద్ రూట్లలో భారీ రద్దీ ఉంటోంది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో పీక్ అవర్‌లో వాహన రాకపోకలు గంటకు 10 వేలు దాటిపోతున్నాయి. ప్రజారవాణాకు పెద్దపీట వేయకపోతే కాలుష్యంలో మరో దిల్లీ, ట్రాఫిక్‌లో మరో బెంగళూరును తలపించే సూచనలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శివారు కాలనీల వరకు ఆర్టీసీ బస్సుల పెంపు, రద్దీ ప్రాంతాల వైపు ఎంఎంటీఎస్, మెట్రో విస్తరణ వేగవంతం చేయాలని ఈ అధ్యయనం తేటతెల్లం చేస్తోంది.
