Telugu News International - TNILIVE
February 20, 2025 at 03:50 AM
యూట్యూబ్ వంటి ఆన్‌లైన్ వేదికల నియంత్రణకు చట్టంలో శూన్యత నెలకొందని, దీన్ని యూట్యూబర్లు తమ ప్రయోజనం కోసం వాడుకుంటున్నారని సుప్రీంకోర్టు మంగళవారం అభిప్రాయపడింది. ‘‘యూట్యూబర్లు ఇష్టారాజ్యంగా నిర్వహించే కార్యక్రమాల్లో అన్నీ చెల్లుబాటవుతున్నాయి. దీనిపై తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఆ చర్యలు మేం తీసుకుంటాం’’ అని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్‌ల ధర్మాసనం పేర్కొంది.