Telugu News International - TNILIVE
February 21, 2025 at 01:46 AM
గరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీని 40 శాతానికి పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ఉత్పత్తులపై జీఎస్టీ ప్రస్తుతం 28ు ఉంది. దీంతోపాటు కాంపెన్సేషన్ సెస్, ఇతర చార్జీలు కలిపి 53 శాతం దాకా అవుతున్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న కాంపెన్సేషన్ సెస్ గడువు 2026 మార్చి 31తో ముగుస్తుంది. అయినప్పటికీ మొత్తం పన్నుపై దీని ప్రభావం పడకుండా ఉండేందుకు జీఎస్టీని పెంచాలని భావిస్తోంది. కాగా, సిగరెట్లపై పన్ను 75ుదాకా ఉండాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు కన్నా తక్కువే కానుంది. ఇదిలా ఉండగా.. కాంపెన్సేషన్ సెస్ స్థానంలో హెల్త్‌సెస్‌ను ప్రవేశపెట్టే యోచనలో కూడా కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, పొగాకు ఉత్పత్తులపై పన్నుతో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం వస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ ఉత్పత్తులపై పన్నుల రూపంలో రూ.72,788 కోట్ల ఆదాయం రావడం గమనార్హం.