Telugu News International - TNILIVE
                                
                            
                            
                    
                                
                                
                                February 21, 2025 at 01:46 AM
                               
                            
                        
                            రాష్ట్రంలోని సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఈ ఏడాది రికార్డు స్థాయిలో పత్తి కొనుగోలు చేసింది. పదేళ్ల నాటి రికార్డులను సీసీఐ అధిగమించింది. రాష్ట్రంలోని గుంటూరు, కృష్ణా, కర్నూలు, అనంతపురం, పల్నాడు, పార్వతీపురం మన్యం, విజయనగరం, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో ఏర్పాటు చేసిన 37 కేంద్రాల్లో 20 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసినట్టు సీసీఐ ప్రకటించింది. మొత్తం 44 వేల మంది రైతులకు మద్దతు ధర లభించింది.