Telugu News International - TNILIVE
Telugu News International - TNILIVE
March 1, 2025 at 03:16 AM
రాహుల్ గాంధీని ప్రధాన మంత్రినిచేసే వరకు విశ్రమించవద్దు: రేవంత్ రెడ్డి పదవులు రాని వారు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదన్న ముఖ్యమంత్రి కష్టపడే వారికి పదవులు తప్పకుండా వస్తాయని హామీ పార్టీ కోసం కష్టపడిన వారికి సముచిత స్థానం కల్పిస్తున్నామన్న ముఖ్యమంత్రి రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేసే వరకు విశ్రమించవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పదవులు రాని వారు నిరుత్సాహపడవద్దని, కష్టపడిన వారికి తప్పకుండా పదవులు వస్తాయని హామీ ఇచ్చారు. నాలుగైదేళ్లు జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చినట్లు చెప్పారు. పార్టీ కోసం నమ్మకంగా పనిచేసిన వారికి కూడా ఉన్నత పదవులు ఇచ్చినట్లు చెప్పారు. పార్టీ కోసం కష్టపడిన వారికి సముచిత స్థానం కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం రెండేళ్ల కాలానికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చామని, మార్చి 10వ తేదీ లోపు జిల్లాల వారీగా ఇంఛార్జ్ మంత్రులు నామినేటెడ్ పదవులకు సంబంధించిన నివేదికలు ఇవ్వాలని ఆయన అన్నారు.
Image from Telugu News International - TNILIVE: రాహుల్ గాంధీని ప్రధాన మంత్రినిచేసే వరకు విశ్రమించవద్దు: రేవంత్ రెడ్డి ...

Comments