Telugu News International - TNILIVE
                                
                            
                            
                    
                                
                                
                                March 1, 2025 at 03:16 AM
                               
                            
                        
                            పత్రికా ప్రకటన
*తిరుమల*
*రూ.44 లక్షల విరాళంతో ఒకరోజు అన్నప్రసాద వితరణకు అవకాశం*
- దాతలు స్వయంగా వడ్డించవచ్చు
- దాతల పేరు ప్రదర్శన
తిరుమల శ్రీవారి దర్శనార్థం దేశ విదేశాల నుండి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు రుచిగా, శుచిగా ఒక రోజు అన్నప్రసాదాలు అందించేందుకు టిటిడి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు ఒక రోజు విరాళ పథకం ప్రారంభించిన విషయం విదితమే.
ప్రస్తుతం అన్నప్రసాద వితరణ కోసం విరాళాల వివరాలు
ఒక రోజు పూర్తిగా అన్నప్రసాద వితరణకు రూ.44 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. (కాగా ఇందులో ఉదయం అల్పాహారం కోసం రూ.10 లక్షలు, మధ్యాహ్న భోజనం కోసం రూ.17 లక్షలు, రాత్రి భోజనం కోసం రూ.17 లక్షలు) దాతలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించవచ్చు.
విరాళం అందించే దాత పేరును వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ప్రదర్శిస్తారు.
---------------------------------
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.