అంతర్యామి
January 31, 2025 at 03:33 AM
*ఆత్మానాత్మ వివేకము(39)*
_కథమ్ సత్య సర్వపః అసత్యస్వరూపోన భవతి? అసత్యస్వరూపః సత్యస్వరూపోన భతి జ్ఞానస్వరూపః జడస్వరూపోన భవతి। జడస్వరూపః జ్ఞాన స్వరూపో భవతి। ఏవం సుఖ స్వరూపో దుఃఖస్వరూపోన భవతి: దుఃఖస్వరూపః సుఖస్వరూపోన భవతి! ఏవం శరీర త్రయ విలక్షణముక్త్వా అవస్థాత్రయ సాక్షిత్వ ముచ్యతే._
సత్యస్వరూపం కలది అసత్య స్వరూపం కలదిగా ఎన్నడూ కాదు. అట్లాగే, అసత్యస్వరూపమైనది సత్య స్వరూపం కలదిగానూ కాదు. జ్ఞాన స్వరూపమైనది ఎన్నడూ అజ్ఞాన స్వరూపం కలదిగానూ కాదు. అజ్ఞాన స్వరూపమైనది (జడమైనది) జ్ఞాన స్వరూపమూకాదు. సుఖస్వరూపమైనట్టిది దుఃఖ స్వరూపం కలదికాదు. అట్లాగే దుఃఖస్వరూపమైనది సుఖ స్వరూపమైనదీ కాదు. ఈ విధంగానే ఈ మూడు శరీరాలు విలక్షణమైనవి అనే విషయం చెప్పి, పిమ్మట అవస్థాత్రయం (జాగ్రత్, స్వప్న, సుషుప్తి)లోని సాక్షిత్వాన్ని గూర్చి చెప్పబోతున్నారు.